[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి (5) |
4. కంట్రోల్ రివర్స్ లో (3) |
6. లేఖాగమ్యస్థాన సూచక చిహ్నం – క్లుప్తంగా పంపుట అని కూడా చెప్పవచ్చు (3) |
7. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ గారిదీ, ప్రాచీనాంధ్ర కవయిత్రులలో మంచిపేరున్న రంగాజమ్మగారిదీ ఒకటే ఇంటిపేరు (5) |
8. రాహురత్నము (4) |
9. గాలివాన తన సృష్టికర్త పేరునే అల్లకల్లోలం చేసేసింది (4) |
12. వీడు లోకవిరోధియట (5) |
14. వాడికీ వీడికీ అస్సలు —– ఎప్పుడూ గొడవలే! (3) |
16. అటునుంచి స్వేచ్ఛ (3) |
17. అటునుంచి చూస్తే వినాయకుడు కనిపిస్తాడు (5) |
నిలువు:
1. తెలంగాణలో నల్గొండజిల్లాలో కూడా చక్కెరేనట (3) |
2. అయిదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహించిన నాయకుడు (5) |
3. ఏడుపు అనుకునేరు కాదండోయ్ – దున్నపోతు (4) |
4. షడ్రుచులలో ఒకటి – మీరెటునుంచి చూసినా సరే అదే రుచి! (3) |
5. కదళీఫల గుచ్ఛము (5) |
8. కుక్కగొడుగు (5) |
10. శైవాస్త్రము (5) |
11. నేరము చేసినట్లుగా ఆరోపించఁ బడిన వ్యక్తి (4) |
13. స్వప్రయోజనము మొదట్లో హ్రస్వమై తడబడిపోయింది (3) |
15. చిరుపాల చెట్టు (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 మే 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 62 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 మే 21 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 60 జవాబులు:
అడ్డం:
1.బాణాసంచా 4. ప్రమాదీచ 7. తాపికత్తియ 9. ప్రధానం 11. ముతుక 13. భరా 14. అరక 16. రాము 17. ధరణి 18. మనసా 19. పుర 20. మగత 22. హుమా 24. నమువ 26. పండుట 27. ప్రకాష్ రాజు 30. సులభము 31. విలుకాడు
నిలువు:
1.బాలప్రభ 2. సంతానం 3. చాపి 4. ప్రత్తి 5. మాయము 6. చషకము 8. కక్కెర 10. ధారాధరము 12. తురాసాహుడు 14. అణిమ 15. కమత 19. పునర్వసు 21. గణేష్ 23. మాటకాడు 25. వప్రభ 26. పంజులు 28. కాము 29. రావి
సంచిక – పద ప్రతిభ 60 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- ప్రవీణ డాక్టర్
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.