కొరియానం – A Journey Through Korean Cinema-64

5
3

అమృతవర్షిణి

Chapter 59

[dropcap]డి[/dropcap]యర్ గమ్-జా,

ప్రతీకారానికి కూడా ఒక పరమార్థం కల్పించిన దానివని నీ గురించి చాలామంది అనుకుంటున్నారు. నువ్వు చిన్న వయసులోనే జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. చేయని తప్పుకు. నిజంగా ఆ తప్పు చేసిన వ్యక్తి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు. పైగా నువ్వు ఏ నేరం చేశావని నిన్ను జైలులో ఉంచారో అదే నేరాన్ని అతను ఇంకా చేస్తూనే ఉన్నాడు.

నువ్వు నీ బలహీనతల వల్ల ఇలా నీ జీవితంలో విలువైన 13 సంవత్సరాలను కోల్పోయావని భావించావు. కానీ ఆ భావనతోనే సమయాన్ని గడిపేయలేదు. నిన్ను నువ్వు గొప్పగా మల్చుకున్నావు. అందుకే మన పార్క్ నీ కోసం vengeance genre లో దాదాపు మృగ్యం అయిపోతున్న Bildungsro-man ను వాడాడు. అది పూర్తిస్థాయిలో కాకపోయినా.

జైలులో అందరితో మన్ననలు పొందావు. నీ వ్యక్తిత్వాన్ని, నీ ఔన్నత్యాన్ని బైట సమాజం కాకపోయినా జైలు సమాజమన్నా గుర్తించింది. అందుకే నువ్వు విడుదలౌతున్నప్పుడు అంత హంగామా. నీ కోసం తోఫు కూడా తెచ్చారు.

నువ్వు అరెస్టైన వైనమే ఆశ్చర్యకరం. జనాలకు నీ మీద ఆసక్తి. నీ చిన్న వయసు (18 ఉంటాయా?), దివి నుంచి దిగి వచ్చిన దేవతలా కనిపించే నీ రూపం.

వారికి నువ్వు చేశాను అని చెప్తున్న నేరం ఏమాత్రం.. అసలు ఊహకు కూడా అందనిది.

అంతటి క్రౌర్యం నీలో ఉందా అని ఆశ్చర్య పోయారు.

వన్-మో!

ఆరేళ్ళ పసి పిల్లవాడు. చదువు మొదలు పెడుతున్నాడు. వాడిని నువ్వు చంపావన్నది ఆరోపణ. నిజమే కావచ్చనుకున్నాను. అప్పటికి కొరియన్ సినిమా నాలజ్ బాగా తక్కువ కదా. కానీ ఒక కథానాయిక అంత చిన్న పిల్లవాడిని క్రూరంగా చంపుతుందా అని ఆలోచన.

మన పార్క్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో అని కుతూహలం. నిజమే. నువ్వా హత్య చేయలేదు. కానీ, నీలో ఏదో తెలియని గూఢత. అదే అందరినీ ఆశ్చర్య పరచింది.

నువ్వు హత్యానేరం మోపబడ్డదానివి కానీ హత్య చేసిన దానివి కాదు. మరి నిజమైన హంతకుడెవరు? నువ్వా నేరాన్ని అంగీకరించావన్నారు. దేనికి?

కానీ నీ మీద అందరికీ ఏదో తెలియని సాఫ్ట్ కార్నర్. నీ అందం వల్లా? నీ చిన్న వయసు వల్లా? అంతుచిక్కదు కానీ, తెలియకుండానే అర్థమయ్యే నీ అమాయకత్వం వల్లా? మొత్తానికీ జైలులో సంస్కరింపబడ్డ ఖైదీల జాబితాలో నువ్వే ముందున్నావు. ఒక సోల్ మోడల్. Soul model.

నేరం చేసి జైలుపాలయ్యి, అక్కడ సంస్కరింపబడిన ఖైదీలలో నువ్వొక లెజండ్. కానీ అప్పటికే నీలో మార్పు. చాలా పెద్ద మార్పు.

కారుణ్యమూర్తి గమ్-జా. కరుణామయి గమ్-జా.

ఎంతమందికి నువ్వంటే అభిమానం? ఎంతమందికి నువ్వొక నిజమైన దేవతవు? ఎంతమందికి నువ్వు సహాయం చేశావు? చెప్పుకుంటానికి నువ్వు ప్రతీకారం తీర్చుకునేందుకు జైలు జీవితాన్ని ఒక అవకాశంగా మల్చుకున్నావని అనుకున్నా నీలో నిజంగా కరుణ లేదా? లేకుండానే నువ్వు విడుదల అయ్యే వరకూ 13 సంవత్సరాలు అలా ఉండగలవా?

లేదు నేను ముసుగు వేసుకున్నాను అని అనవచ్చు. నిజమే. ముసుగు వేసుకున్నావు. నీ ప్రతీకార జ్వాలను ఆరకుండా చూసుకున్నావు. జైలులో నీకు పరిచయమైన ఇతర ఖైదీలను నీకు అనుకూలంగా మల్చుకున్నావు. బైటకు వచ్చాక వారి సహాయం పొందావు. మరికొందరితో కలిసి నువ్వు జైలుపాలు కావటానికి కారణమైన వ్యక్తిని శిక్షించటానికి పథకం వేశావు.

కానీ, నీలో కరుణ ఉంది. నీలో మానవత్వం ఉంది. దానికి నిదర్శనం నీ ప్రతీకారమే.

అసలు నువ్వెందుకు జైలుకు వెళ్ళవలసిన వచ్చింది?

నువ్వు వన్-మో ను చంపలేదే? మరేం జరిగింది?

ఇక్కడే అసలు విషయాన్ని చెప్పాలి.

***

పాము కొనసాగిస్తోంది. As reported by GitacharYa from his notes.

Lee Woo Jin is an outstanding antagonist. Perhaps, Oldboy is the classic case of a clash between two antagonists where the ultimate loser is the survivor. But the survivor has at least given something to another soul and in that way slightly fulfilled his life. And gets a sort of redemption.

For a variety of reasons, Lee Woo-jin can be considered as an iconic antagonist. The character was etched with precision:

First of all, his calm but slightly cocky mannerism has not only grabbed the attention of the viewers but also offered a devilish relish in guessing his motives behind his actions. Handpicked by Choi Min-sik (Park Chan-wok wanted to have Han Suk-kyu to repeat the magic of Shiri), he matched Choi with his wicked precision in portraying the role.

అసలా charm ను తట్టుకోవటం కష్టం. చెప్తే నమ్మరు కానీ సిద్ధార్థ్ అభిమన్యు పాత్రను డిజైన్ చేసింది ఈ వు-జిన్ పాత్రను చూసి inspire అయ్యే.

ఓ డే-సు మీద ప్రతీకారం తీర్చుకునేందుకు అతను వేసిన ప్లాన్ సామాన్యమైనది కాదు. చాలా మెటిక్యులస్‌గా పని చేశాడు. ప్రపంచ సాహిత్యంలో గొప్ప విలన్లు లేదా antagonists అయిన Iago (ఇయాగో), Heathcliff, Dr. Hannibal Lector సరసన చేర్చదగిన సత్తా ఉన్నవాడు. He’s a monster. He’s a sociopath. With genius level intellect.

అసలు అతని సైకాలజీని కచ్చితంగా చాలా సూక్ష్మస్థాయిలో పరిశీలించాలి. అలా చేస్తే మనసు లోతుల్లోని చాలా రహస్యాలు మనం కనుక్కోవచ్చు.

కొరియానం నారేటర్: అతను filthy rich. Correct. He has all resources. Correct. He has enough influence to get things done as per his whims. Correct. కానీ, తన జీవితం మొత్తాన్నీ ఒక మనిషిని సర్వనాశనం చేసి అతని మీద పగ తీర్చుకోవటానికి వినియోగించటం? ఎలా? How?

నిజానికి Oh Dae-su might be a beast. Or might not be. కానీ ఒక సాధారణ మెట్ల సుబ్బారావు. With an asterisk. That asterisk is he’s a successful small-scale business-man.

భవదీయుడు ఉస్తాద్ గీతాచార్య: He should be a small-scale businessman as you guessed. Otherwise, his disappearance would have created bigger ripples.

కొనా: సర్సర్లే. మధ్యలో దూరుతావు. అదేమంటే unreliable narrator అని నా మీద ముద్రే కొట్టావుగా. పాము గారూ, you please continue.

భవదీయుడు ఉస్తాద్ గీతాచార్య: అంటే నా మీద జనాలు కొట్టలేదేటీ? పాము గారూ, you please continue.

పాము కొనసాగిస్తోంది. As reported by GitacharYa from his notes.

అవ్వ ఉవాచ: Charming సరే! ఈ వు-జిన్ కన్నా క్రూరమైన విలన్ ను పార్క్ సృష్టించాడా?

***

ఉన్నాడు. అతని పేరు Mr. Baek. ఆ పాత్ర వేసింది నట సార్వభౌముడు (Sr. NTR fans be damned) చోయ్ మిన్-సిక్. అతనొక స్కూల్ టీచర్. పిల్లలను, వారి భవిష్యత్ ను, తద్వారా దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఉన్నత స్థానం అది. కానీ, ఆ స్థానానికి తగిన వాడు కాదు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు.

రాక్షసులలో కూడా మంచి వాళ్ళు ఉండవచ్చు. ప్రహ్లాదుడు, విభీషణుడు.. ఇలా. కనుక Mr. Baek గురించి చెప్పాలంటే కొత్త పదాన్ని సృష్టించాలి. Baek ను బేక్ అని చదవాలి. బేక్ అంటే ఇంకో అర్థం ఉంది కనుక alternate pronunciation తీసుకుని బాయెక్ అందామా?

సరే! బాయెక్ = మాటల్లో చెప్పలేనంత దుర్మారాలు చేసేవారిని, క్రూరులను బాయెక్ అందాం.

Mr. Baek నిజంగా బాయెక్.

***

డియర్ గమ్-జా,

నువ్వు జైలు నుంచి బైటకు వచ్చాక నీ బలహీనతల మీద కూడా పగ తీర్చుకున్నావు. ఏంటా బలహీనత? నిన్ను నువ్వు నమ్మలేకపోవటం. సమాజాన్ని ఎదిరించగలిగే ధైర్యం లేకపోవటం. కుటుంబాన్ని విశ్వాసంలోకి తీసుకోలేక పోవటం.

నువ్వా క్షణాన ఏమి చేశావ్? అసలేమి చేసి ఉండాల్సింది?

ఈరోజున నీకు రెండో విషయాన్ని చెప్పాల్సిన పని లేదు. ఏమి చేసి ఉండాల్సిందో in retrospection నీకు అర్థమయ్యే ఉంటుంది. కనుక ఆ విషయాన్ని వదిలేద్దాం. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితంలో 13 సంవత్సరాలను కరిగించేసింది. 13 అమూల్యమైన సంవత్సరాలు.

నీకు ఓ డే-సు తెలుసా? తన జీవితంలో సుఖంగా గడపాల్సిన టైమ్‌ను పూర్తిగా కోల్పోయాడు. అక్కడ అతని ప్రమేయం లేదు. కానీ, ఇక్కడ నువ్వు చేసిన glaring mistake ఉంది. అదే మిస్టర్ బేక్ అనే బాయెక్ ను నమ్మటం!

టీనేజ్ ప్రెగ్నెన్సీ. కుటుంబానికి చెప్పలేవు. సమాజంలో మనగలగటం కష్టం. ఒంటరిగా ఎదురీదటం నీకు ఆ సమయంలో కష్టమనిపించింది. అందుకే నీ స్కూల్ టీచర్ అయిన మిస్టర్ బేక్‌ను ఆశ్రయించావు.

అతనే నీ ద్వారా Won-mo ను రప్పించాడు. డబ్బు కోసం కిడ్నాప్ అన్నాడు. తరువాత ఆ పిల్లవాడిని మోది మోది చంపేశాడు. ఆరేళ్ళ పిల్లవాడు. అభంశుభం తెలియని వాడు. అదొక్కటేనా?

నీ నుంచి ఏమీ ఆశించకుండానే నిన్ను చేరదీస్తాడా? నీ శరీరాన్ని తనకు అప్పనంగా అప్పగిస్తావని, అప్పగించాలని చూశాడు.

నిజమే! టీచర్లంటే గొప్పచేస్తాం, మాతృత్వాన్ని రొమాన్టిసైజ్ చేస్తాం అదీ ఇదీ అని ఐక్యూ ఎక్కువైన వాళ్ళు రాస్తుంటారు. అదే వ్రాతలు. Not పూయటం.

కానీ అటు మాతృత్వమైనా, ఇటు గురుత్వమైనా గొప్పవి. వాటి విలువ చెప్పటం కష్టం.

ఒక గురువంటే సమాజంలో ఎంతో విలువ ఇస్తారు. ఆ గురువు నడత ఎందరో పిల్లలను ప్రభావితం చేస్తుంది. మరి అలాంటి గురుస్థానంలో ఉన్న వ్యక్తి కష్టంలో ఉండి తనను ఆశ్రయించిన ఒక ఆడపిల్లను తన ‘అవసరాల’కు వాడుకోవాలని చూడటం నీచం.

మిస్టర్ బేక్ వన్-మో ను చంపాక నీ నెలల కూతురిని కిడ్నాప్ చేసి, ఆ పాపను చంపుతానని బెదిరించి నువ్వు ఆ నేరాన్ని.. కాదు కాదు ఘోరాన్ని నీ నెత్తిన వేసుకునేలా చేశాడు. ఎందుకంత నమ్మావ్ అతనిని? ఆ బాయెక్‌ను? ఒక ఉపాధ్యాయుడు కనుక అర్థం చేసుకోగలడనా? ఆ నమ్మకాన్నే కుటుంబం మీద పెట్టవచ్చుగా?

ఒకటి మాత్రం మంచిదైందిలే. దీని వల్ల ఆలస్యమైనా ఆ బాయెక్‌కు తగిన శిక్ష పడింది.

***

పాము continues.

వు-జిన్ పగబట్టి, పనిగట్టుకుని మరీ ఓ డే-సు జీవితాన్ని నాశనం చేయాలని చూడటం, అతను వేయబోయే ప్రతి అడుగునూ తనే నిర్దేశిస్తూ.. అవసరమా?

కానీ ఒక విషయాన్ని గమనించాలి. ఇది కన్ఫమ్డ్ కూడా.

Quentin Tarantino watched the movie thinking it from the point of view of Lee Woo-Jin. టారంటినో ప్రకారం వు-జిన్ జీవితం దారిణమైన ట్రాజడీ.

ఎందుకు అలా అనుకుని ఉంటాడు?

Lee Woo-Jin as an adult is filthy rich, right? It may also be true that his parents are the richest family in the surroundings. లేకపోతే వు-జిన్ తన జీవితంలో 67 శాతం కేవలం ఓ డే-సు మీద అవసరం లేని పగను చూపి, ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి కేటాయించాడు కదా. ఇక సంపాదన ఎట్లా?

అలాంటి డబ్బున్న ఆసామి పిల్లలకు ఎంత వరకూ ఆదరణ దక్కుతుంది తల్లిదండ్రుల నుంచీ? మరి ఆ లేమిని ఎలా కప్పి పుచ్చుకోవాలి?

వు-జిన్ ను చూస్తే పెద్దగా స్నేహితులు కూడా ఉండి ఉండని మనిషల్లే ఉంటాడు. మరి ఇక..?

కానీ, దీనివల్ల బలైంది ఓ డే-సు. అంతకు మించి మిడు లాంటి అమాయకురాలు. తండ్రి మాయం. తల్లి హత్య చేయబడ్డది. తన జీవితాన్ని ఈ వు-జిన్ నిర్దేశిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ జంట లాగా (వు-జిన్, అతని సోదరి – pun absolutely intended) ఆమెకు కనీసం డబ్బు, పలుకుబడి అన్నవి కూడా లేవు. పైగా అప్పటికి పసిపిల్ల.

వు-జిన్ సోదరి మీద ఓ డే-సు సృష్టించిన నిజ రూమర్‌కు, ఆ పిల్లకు ఏమి సంబంధం?

GitacharYa intervenes: Lee Woo-Jin was suffering from metaphysical emptiness. To compensate, such people try to play with other people. సాధారణంగా ఏ కారణం కూడా ఉండదు. కానీ ఏదోక కారణాన్ని కల్పించుకుంటారు. అలాంటి కారణం ఓ డే-సు సృష్టించిన రూమర్. తనే played the ball into the hands of Lee Woo-jin.

దాని వల్ల వు-జిన్ సోదరికి phantom pregnancy వస్తుంది. దాని వల్ల ఆమె ఆత్మహత్య చేసుకోబూనుతుంది. బ్రిజ్ దగ్గర సీన్. చూస్తే అర్థమవ్వుతుంది.

పాము కొనసాగిస్తుంది.

ఆమె మరణంలో ప్రధాన పాత్ర వు-జిన్ దే. కానీ, చేసిన యదవ పని వల్ల ఓ డే-సు ఒక escapist reason గా దొరికాడు. దాన్ని అడ్డం పెట్టుకుని వు-జిన్ ఆట నడుపుతాడు. తనే తన సోదరి మరణానికి కారణం అని మర్చిపోవటానికి.

అతనికీ, సరైన సమయంలో అందాల్సిన ఓదార్పు/ప్రేమ/empathy దక్కి ఉంటే? ఓ డే-సు ఆ రూమర్ సృష్టించే బదులు అతనిని అలా వదిలేసి ఉన్నా.. లేదా అతనికి తెలియకుండా అతనికి అండగా ఉంటూ అతని మార్గాన్ని సరైన విధానంలో నిర్దేశించి ఉంటే? అంత తెలివి ఉంటే! హయ్యో రామ!

మన మెట్ల సుబ్బారావు ఓ డే-సు అలా ఆలోచించగలిగితే? జరిగే పనేనా?

పాము ముగించింది.

ఆదామూ, అవ్వా ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. పాము Apple చెట్టు మీదకు పాకింది.

***

డియర్ కొరియానం నారేటర్,

Lee Woo-Jin జీవితం మారేదేమో మరి. కానీ మిస్టర్ బేక్ మాత్రం మారడు. అతను నిజమైన బాయెక్. అంతం కాక తప్పదు. పైకి నాది ప్రతీకారం లాగా అనిపించినా, అది..

***

కొంత సేపటికి ఆదాము అవ్వ తేరుకుంటారు.

కానీ Lee Woo-jin వైపు నుంచీ కథ వింటుంటే మనసు అల్లకల్లోలం అయిపోయింది. ప్రత్యేకించి అవ్వకు.

అది గమనించిన ఆదాము అవ్వను నడిపించుతుంటూ ఒక వాటర్ స్ట్రీమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ రాళ్ళు ఉన్నాయి. ఒడ్డున. నీరు పారుతున్న శబ్దం మనసుకు సాంత్వనను చేకూర్చింది. ఆ శబ్దాన్ని వింటూ అవ్వ మౌనంగా ఉంది. ఆదాము ఆమె పక్కన ఉన్న ఇంకో కాయి మీద కూర్చున్నాడు.

చల్లటి గాలి వీస్తోంది. సూర్యాస్తమయ సమయం. పక్షులు గూళ్ళకు చేరుకునే ప్రయత్నాలలో రకరకాల దిశలలో అవి ఎగురుతూ కూతలు కూస్తూ సందడి చేస్తున్నాయి.

నడుద్దామా ఆ వైపు? ఆదాము అడిగాడు. అవ్వ అప్పటికే లేస్తోంది. ఇద్దరూ చేతులు పట్టుకుని అస్తమిస్తున్న సూర్యడి వైపు నడవటం ప్రారంభించారు. నీటిలో వారి పాదాల కదలికల వల్ల జనించిన శబ్దాలను వింటూ పాము తృప్తిగా తలూపింది.

సమాప్తం

Epilogue

ఎవరు నువ్వు?

ఆదాము అడిగాడు.

ఎక్కడో చూసినట్లుంది?

అవ్వ అంది.

నా పేరు మిసుక్.

అంటే నువ్వు మా మిన్-ఆ అమ్మవా? ఇద్దరూ ఒకేసారి అన్నారు.

అవును. నవ్వింది ఆమె.

ఇరవై సంవత్సరాలు. అవ్వ అనుకుంది. ఎలా ఉన్నావ్? పలకరించింది.

బాగున్నాను. సమాధానం ఇచ్చింది కాంగ్ మి-సుక్.

ఆదాము వారి సంభాషణ వింటూ మౌనంగా ఉన్నాడు. ఇద్దరూ వారి పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళే. Both of them are coping with the tragedy in their own style. Mi-sook seems to have done well in recovering. But then, there’s a tinge of pain that can be seen in her eyes. తల్లి మనసు. ఆదాము అనుకున్నాడు.

***

కూతురు hospital లో ఉండి యాతన పడటం కన్నా తన దగ్గరే ఉండి చివరి రోజులను ఆస్వాదించాలని ఇంటికి తీసుకుని వచ్చి, she had tried to give her girl everything that makes her life pain free. Even a boyfriend. She might have known a full-on travel to Europe, or the Americas would result in more pain to Min-ah.

మరో రకంగా.

లేకపోతే ఆ పిల్ల కోరిక తీర్చేందుకు, అదే బ్యాలే చూసేందుకు విదేశాలకు తీసుకుని వెళ్ళేదోమో కూడా.

ఇక యూంగ్-జే.

కథలో ట్విస్ట్ చెపితే మజా ఉండదు కనుక చెప్పటంలేదు. సినిమా చూడండి. Available on YouTube. Simply search for “…ing 2003 Korean Movie”.

కళ్ళు చమరుస్తాయి. గుండె గొంతులో అడ్డం పడుతుంది. మనసు మూగగా రోదిస్తుంది. కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. బాధలో ఉంటే ఓదారుస్తుంది. కల్లోలమైన మనసుకు సాంత్వనను చేకూరుస్తుంది. గలగల పారే ఆ సెలయేరు లాగా.

మి-సుక్ వయసు ఇప్పుడు 60-65 మధ్యలో ఉండవచ్చు. అది ఆమెకు మలిసంజె కాకూడదు. జీవితాన్ని ప్రేమించే మనుషులు దీర్ఘాయువులుగా ఉండాలి.

***

జైలు నుంచీ బైటకు వచ్చిన గమ్-జా మిస్టర్ బేక్ మీద ప్రతీకారానికి ప్లాన్ చేస్తుంది. ఇంతలో ఆమెకు తన కూతురు బతికే ఉందని తెలుస్తుంది. That girl was, by that time, in her early teens. She was adopted by an Australian couple and christened her as Jenny. గమ్-జా ఆ పిల్లను కలిసినప్పుడు అమ్మను కౌగిలించుకోదు. కానీ తనతో రమ్మని అడిగితే మటుకూ వచ్చేస్తుంది. కూతురు కోసం ప్రతీకారాన్ని కాసేపు పోస్టుపోన్ చేస్తుంది గమ్-జా.

ఇంతలో గమ్-జా, జెన్నీలను చంపమని మనుషులను పంపిస్తాడు మిస్టర్ బేక్. ఆ మందలో మన సాంగ్ కాంగ్-హో, Mr. Vengeance గా వేసిన Shin Ha-kyun లు cameo రూపంలో పలకరిస్తారు. వాళ్ళందరికీ కైవల్యం ప్రసాదిస్తుంది మాతా గమ్-జా.

ఇక మిగిలింది మహా ప్రస్తానం లాంటి క్లైమాక్స్.

మిస్టర్ బేక్‌ను కిడ్నాప్ చేస్తుంది. అతను చంపిన పిల్లల తల్లితండ్రులను, బంధువులను పిలుస్తుంది. దీనికి తన కేసులో డిటెక్టివ్‌గా పని చేసిన వ్యక్తి సహకరిస్తాడు. అతనికి మొదటి నుంచీ గమ్-జా నేరం చేయలేదని తెలుసు. But he fabricated the proofs to get her into jail on her request.

ఒక్కఒక్కరూ ఒక్కొక్క రకంగా అతనితో ఆడుకుని తమ మనసులో దాక్కుని ఉన్న వేదనను తీర్చేసుకుంటారు. చివరకు ఆచ్చి పంపిస్తారు. గ్రూప్ ఫొటో తీసుకుని వారిలో ఏ ఒక్కరూ ఏ మరొకరినీ ఇరికించకుండా ముందు జాగ్రత్త.

మిస్టర్ బేక్ నడిపేది నిజానికి కిడ్నాపింగ్ రాకెట్ కాదు. అతని భార్య కూడా క్రిమినలే. అతను తను పని చేసే బడిలో పిల్లలను ఎత్తుకెళ్ళి మోది మోది చంపుతాడు. వారి శవాలు కూడా దొరక్కుండా దాచేసి అప్పుడు తల్లితండ్రులకు ఫోన్ చేసి పిల్లలను వదలాలంటే డబ్బు కట్టాలంటాడు. వారా డబ్బు ఇవ్వగానే అక్కడి నుంచీ మకాం మార్చేసి ఇంకో స్కూల్‌లో ఫిర్. అలా అతన్ని మొదటే పట్టించనందుకు మరి కొందరు పిల్లలు ప్రాణాలను కోల్పోయారు. అందరూ Kindergarten వారే.

అందుకే తన బలహీనతల మీద గమ్-జా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నది. తన బలహీనత వల్లే అందరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

అసలా బాయెక్ గాడు పిల్లలను చంపింది వారు తనకు annoying గా అనిపిస్తున్నారని.

WTF (World Tennis Federation మాత్రం కాదు).

పిల్లలను ద్వేషించటం! నిజంగా వీడు మనిషి కాదు. మృగం, పశువూ, రాక్షసుడూ.. ఇవన్నీ చాలవు. వాడు నిజంగానే బాయెక్.

చివరికి ఆ పిల్లల తల్లితండ్రులు, బంధువులు, ఆ డిటెక్టివ్, వీరందరూ ప్రస్తుతం గమ్-జా పనిచేస్తున్న బేకరీ దగ్గర పోగుపడి పార్టీ చేసుకుంటారు.

గమ్-జా తన కూతురు దగ్గరకు వెళ్తుంది. అంతా ముగిశాక మిగిలింది శూన్యం. ఆమె తన చేతిలో ఉన్న కేక్ లో మొహం దాచుకుని కరువుతీరా రోదిస్తుంది. తల్లి గొప్పతనం తెలుసుకున్న జెన్నీ ఆమెను ప్రేమతో కౌగిలించుకుని ఓదారుస్తుంది.

అందరు దేవతల నుంచి శక్తులను పొంది భండాసురుడిని చంపిన లలితా త్రిపురసుందరిలా, వీరలక్ష్మీ అవతారమైన మహిషాసుర మర్దినిలా గమ్-జా ఆ పిల్లలను ప్రేమించే వారినందరినీ పోగుజేసి మిస్టర్ బేక్ ను వధించటం.. it’s true Justice.

గమ్-జా కూడా శాంతించింది. కూతురు ఒడిలో ప్రపంచాన్ని మరచిపోయింది.

॥శుభమ్॥

స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః।

గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా స్సుఖినోభవంతు॥

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here