హాస్య తరంగిణి-5

0
3

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

41. వాటర్

విశ్వనాథ్: మన కొత్త స్నేహితుడు నారాయణ వాటర్ మేనేజ్‌మెంట్ చదివాడు అని చెపుతున్నావు, అంటే నీళ్ళను ఎలా పొదుపు చేయాలో వివరిస్తాడా?

రామనాథ్: అది కాదు బాబూ! అతను అందర్ని చూచి ఏడుస్తాడులే!

42. తగిన మూల్యం

(ఒక అమాయక నాయకుడు బ్యాంక్‌కు వచ్చి మేనేజర్‌తో)

అనాయకుడు: నేను ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాను సార్!

మేనేజర్: అయితే నన్నేమి చెయ్యమంటారు?

అనాయకుడు: “ఓడిపోతే తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని” ప్రతిపక్ష నాయకులు చెప్పారు సార్. ఒక చలాన్ ఇవ్వండి, ఇప్పుడే చెల్లిస్తాను.

43. బాలల చిత్రం

యాంకరి: మీరు అసలు బాలల కోసం సినిమాలు తీయరు కదా. ఎందుకని ఈ సినిమాను బాలల కోసం తీశారు? దీనికి అవార్డు కూడా వచ్చింది.

దైవాదీనం: ఈ సినిమాను పెద్దవాళ్ళకనే తీశాను. కానీ అది చూసిన కమిటీ బాలల చిత్రంలా ఉందని అవార్డు ఇచ్చేశారు.

44. మనీల్యాండరింగ్

టీచర్ : ఓరేయ్ పాణి! మనీ ల్యాండరింగ్ అంటే ఏమిటో చెప్పరా?

పాణి: మనం లాండరీలో కొంతకాలం డబ్బులు దాచుకొని, ఆ డబ్బులు ల్యాండ్ కొనుక్కోవటాన్నే మనీల్యాండరింగ్ అని అంటారు మాష్టారు.

45. వాట్సప్ శెలవలు

అసిస్టెంట్: సార్! నాకు రెండు రోజులు శెలవు కావాలి.

అధికారి: రెండు రోజులెందుకయ్యా! ఒకరోజు తీసుకో.

అసిస్టెంట్: వాట్సప్ లోని మెస్సేజీలు, ఫోటోలు డిలీట్ చేయాలి.

అధికారి: ఐతే ఒకరోజు తీసుకో మహానుభావా!

అసిస్టెంట్: మా ఆవిడ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మెస్సేజీలు కూడా నేనే డిలీట్ చెయ్యాలి! అందుకే సార్!

46. అనుచిత వ్యాఖ్యలు

బాలయ్య: అదేమిటయ్యా ఆ సురేంద్రగాడు ప్రతి చిన్న విషయానికీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు.

నూకరాజు: వాడా! ఉచిత పథకాలన్నీ తేరగా అందుకుంటూ పైగా కష్టపడి పనిచేయటం కూడా మానేశాడు!

47. వరద – బురద

రిపోర్టర్: ఈ భారీ వరదలపై మీ అభిప్రాయం ఏమిటి?

నాయకుడు: నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిపక్షాల మీద చల్లటానికి కావలసినంత బురద కొట్టుకొచ్చినందుకు!

48. స్పీడ్ బ్రేకర్లు

మాణిక్యం: అదేమిటిరా మీ టౌన్‌లో అసలు స్పీడ్ బ్రేకర్లే కన్పించటం లేదు.

బధ్రయ్య: నీ కోసం ఇన్ని గుంటలు, గుంటనక్కల్లా ఎదురుచూస్తూ ఉంటే ఇంకా స్పీడ్ బ్రేకర్లు కావాలా!

49. హవాలా

టీచర్: ఓరేయ్ భానూ! హవాలా అంటే అర్థం చెప్పరా?

భాను: అది హల్వా లాంటీ స్వీటు టీచర్!

50. సినిమా ప్రారంభ పూజ

పంతులుగారు: ఇదేమిటండీ! నన్ను స్మశానానికి రమ్మంటున్నారు? ఇంతకీ ఎవరన్నా పోయారా!

మేనేజర్: ఇప్పటివరకూ ఎవరూ పోలేదు కానీ ఇది దెయ్యాల సినిమా. ఈ రోజే పూజతో సినిమా షూటింగ్ ప్రారంభం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here