[dropcap]న[/dropcap]ది నడకలు నేర్చిన
అడవి
కొత్త శోభల విరబూసిన ప్రకృతి
చెట్లు నెమలి నాట్యాలు చేసింది
అడవి
నెత్తావి అందాలు చిందించింది
గుండె గాయాలను మాన్పింది మహిమచే
అడవి
గొప్ప మూలికల ఔషధమందించె ప్రేమతో
ఎదసొదల సూర్యకాంతి పరిచింది
అడవి
జీవజాలం బతుకు ప్రకృతి ధర్మమై వెలిగింది
మనసు నడకలు తోచెను ఆరోగ్యమై
అడవి
క్షమధాత్రిని మనిషి చెట్టు నడిచె పచ్చగా