తందనాలు-6

0
3

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

51
పద్యానికి కావాలి యతి గణ ప్రాసలు
అధ్యయన పండితులు మాత్రం అర్హులు
గద్యానికి ఆ అవసరం లేదు
విద్యావంతులెవరైనా వ్రాయగలరు

52
నరకమంటే ఎక్కడో లేదు
నిరంతర నిర్వాకాలలోనే గోచరిస్తుంది
పరపతి గలవారు తెలివిగా తప్పించుకుంటారు
కారణాలు వెతికి

53
అల్ప సంతోషులు జీవితంలో సుఖంగా వుంటారు
స్వల్ప విజయాలతోనే
కల్ప వృక్షాలు కావాలంటారు ఆశాపరులు
తల్పాలూ కావాలంటారు అతిగా

54
అంగ ప్రదక్షిణాలు చేసేవారు కొందరు
వంగి వంగి దండాలు పెడతారెందరో
రంగ రంగా అంటుంటారు
కంగారుగా ప్రదక్షిణాలతో ఇంకొందరు

55
కంచు కాగడాలోనూ కనిపించని ఔదార్యం
మచ్చు కైనా లేని కనికరం
చించి చించి శోధించినా లేని మానవత్వం
చచ్చు చివరకు దుర్మార్గుడీలాగ

56
మట్టినుండే ఉద్భవించు జీవులు
గట్టి గట్టిగా పెరుగును జీవం
పట్టి పట్టి చూచుకొందరు జీవితాన్ని
చిట్ట చివరకు మట్టిలోనే కలసిపోవు

57
కోరి తెచ్చుకున్న కొత్త పెళ్ళాం
కరి రంగులో వున్ననూ యెంతో అందంగా వున్నది
తరిచి చూడగా యోగ్యవంతురాలు
మురిపించి ఆనంద పర్చుచున్నది

58
వ్యత్యాసాలు తెలియనివాడు
సత్యమే మాట్లాడువాడు
నిత్య నూతన యవ్వనుడు మంచి మనస్కుడు
ముత్యము చిప్పలోని ముత్యము వంటి వాడు గదరా

59
యుగ యుగాలనుండి మనిషి జీవితం మారుతూ వస్తుంది
గంగా జలం పవిత్రమొక్కప్పుడు
రంగ రంగ అంటూ అప్పుడు
యోగాభ్యాసాలు యెక్కువై ఇప్పుడు

60
రోషమున్న వాళ్లెవరు పనికి వెరవరు
వేషాలు వేసి పని తప్పించుకోరు
అష్ట కష్టాలు పడి నెరవేర్తురు
సాష్టాంగ దండ ప్రమాణాలు చేయరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here