యువభారతి వారి ‘నన్నెచోడుని కవితా వైభవం’ – పరిచయం

0
4

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

నన్నెచోడుని కవితా వైభవం

[dropcap]ఆం[/dropcap]ధ్ర సాహిత్యంలో పురాణేతిహాసాలు వెలువడుతున్న రోజుల్లో వర్ణనా ప్రధానమైన అలంకారిక రచనకు అంకురార్పణ చేసి కావ్య మార్గాన్ని రసకుసుమోపేతంగా తీర్చిదిద్దినవాడు నన్నెచోడ దేవుడు.

ఇతడు ప్రభువు. అయినా రాజ్య రచనతో తృప్తి పడక, శాశ్వతమైన కావ్య రచనకు పూనుకొని, రాజుల కాలం పోయినా, కవిగా తెలుగులా హృదయాలలో నేటికీ చోటు చేసికొని కూర్చున్నాడు. ఆయన రచించిన ‘కుమార సంభవం’ ఏ సంస్కృత గ్రంథానికీ అనువాదం కాదు. తమిళ కన్నడ సంస్కృత కావ్యాల్లోని శివలీలలను యితడు జాను తెలుగులో అవతరింపజేశాడు. అలంకారాల ద్వారా ఊహాలోకాలను సృష్టించగల శక్తి నన్నెచోడున కున్నంతగా మరే తెలుగు కవికి లేదేమో అనిపిస్తుంది.

తెలుగు సాహిత్యమున నన్నయ కావ్య సంప్రదాయమునకు ఆది కవిగా ప్రసిద్ధికెక్కగా, నన్నెచోడ కవి ప్రబంధ కవితకు ప్రథమాచార్యుడు. ఈయన రచించిన కుమార సంభవము నవ రసములతో, దశ కావ్య గుణములతో, అష్టాదశ వర్ణనలతో, ముప్పది యారు అలంకారములతో సర్వలక్షణ సమన్వితయై విరాజిల్లుచున్నది. ఈయన రచించిన ‘కుమార సంభవము’ అవతరించినది మొదలు, పాల్కురికి సోమనాథుడు, కేతన, తిక్కన, మంచెన, శ్రీ కృష్ణదేవరాయలు వంటి ఎందఱో తరువాతి కవులు ఆయనను అనుసరించారు.

నన్నెచోడుడు సింహాసనమును అధిష్టించి రాజ్యము నేలెనో లేదో తెలియదు కానీ, కావ్య సింహాసనమును అధిష్టించి కవితా సామ్రాజ్యమేలిన మాట తథ్యము. అతడు కవి సార్వభౌముడే కాదు. రాజ కవి సార్వభౌముడు. అతని కృతి ఆంధ్ర సరస్వతికి మణి కిరీటము.

నన్నె చోడుని ‘కుమార సంభవం’ కావ్య విశ్లేషణను నన్నెచోడుని కవితా వైభవంగా తెలుగు సాహితీ ప్రియులకు పరిచయం చేసిన ఆచార్య వేంకట రావుగారు పరిశోధనా పరమేశ్వరులు. వారు కవులు, మృదుల హృదయులు, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య సాగరాన్ని పుడిసిట బట్టిన అపర అగస్త్యులు. తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో తలస్పర్శి పరిచయమున్న మనీషీ వతంసులు. తెలుగువారికి నన్నెచోడున్ని కొత్త కోణంలో చూపించారు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%A8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%9A%E0%B1%8B%E0%B0%A1%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/page/n5/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here