సినిమా క్విజ్-38

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ప్రముఖ హిందీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రాణ్ గారు తెలుగులో నటించిన చిత్రం ఏది?
  2. మహేష్ బాబు, బిపాసా బాసు నటించిన ‘టక్కరి దొంగ’ చిత్రానికి దర్శకుడు ఎవరు?
  3. మొట్టమొదటి ఆర్.ఓ.కలర్‍లో కృష్ణ, శుభ నటించిన డూండీ చిత్రం ఏది?
  4. టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో – బాలకృష్ణ, భానుప్రియ, దీప నటించిన ‘ఆత్మబలం’ చిత్రానికి మూలాధారమైన హిందీ చిత్రం ఏది?
  5. ఎల్.వి. ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, సందీప్ కిషన్‍లో ఒకే పేరున్న సినిమాలో నటించారు. అది ఏది?
  6. 1951లో కె. రామచంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీ రంజని నటించిన చిత్రం ఏది
  7. కృష్ణకుమారి కథానాయికగా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఏది?
  8. ఆచార్య ఆత్రేయ గారు బొల్లిముంత శివరామకృష్ణ గారితో కలిసి మాటలు వ్రాసిన చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి నటించగా, ఆత్రేయ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఏది?
  9. తెలుగులో మొట్టమొదటి రంగుల చిత్రం, లలితా శివజ్యోతి వారి ‘లవకుశ’కు ఛాయాగ్రాహకుడు ఎవరు?
  10. జగ్గయ్య, జి. వరలక్ష్మి నటించిన ఏ చిత్రానికి ఎడిటర్ జి.డి. జోషి దర్శకత్వం వహించారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 మే 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 38 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూన్ 04 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 36 జవాబులు:

1.అశుతోష్ ముఖర్జీ వ్రాసిన ‘చలాచల్’ 2. ఆత్మబలం 3. ఎన్ తంబి 4. చంటి 5. షెరేడ్ Charade 6. పోలీస్ రిపోర్ట్ 7. ఆస్తులు అంతస్తులు 8. బంధాలు అనుబంధాలు 9. చిరంజీవి 10. దేవాంతకుడు

సినిమా క్విజ్ 36 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్షి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శంభర వెంకట రామ జోగారావు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వనమాల రామలింగాచారి
  • దీప్తి మహంతి
  • జి. స్వప్న
  • యం.రేణుమతి
  • కొన్నే ప్రశాంత్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here