నూతన పదసంచిక-65

0
3

[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. చంద్రుడి బోనుకు రెండు వైపుల పదునుంటుంది.  (5)
4. నగర సంస్కృతి (5)
7. తడబడిన నీరాజనం (3)
8. ముసిరిన ఎదలో దర్శనం (5)
9. స్వర్గము, కవిత్వం చెప్పేవాడు, భర్త, పండులతో ఒక రత్నం (7)
11. ప్రకాశం ఉన్న చంద్రుడు (5)
15. ఎర్రని ధాతువు (5)
19. అడ్డం తొమ్మిదే (7)
22. పగడము ఉన్న ఫణము (5)
23. విజ్ఞప్తి వారివి, వీరివి కాదు (3)
24. పొద్దున్నే, కడతేరిన చీకటి (5)
25. నాయకుడు నలుగురిలో ఒకడు. (5)

నిలువు:

1. లూజ్ మోషన్స్ (5)
2. శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించింది తలక్రిందలుగా (4)
3.  టిఫిన్ కావాలంటే శీర్షాసనం వేయక తప్పదు (4)
4. ముల్లోక సంచారి, వెయ్యిండ్లపూజారి (5)
5. విశ్వనాథ్ దర్శకత్వంలో 1986లో వచ్చిన తెలుగు సినిమా కలగాపులగం (5)
6. అతిశయించు (5)
10. జీవకారుణ్యము (4)
12. దృశ్య వివరణ ఇంగ్లీషులో (4)
13. కలుక్కుమనే దానిలో చూపు (2)
14.  మోదుగు (2)
15. లవకుశ సినిమాలో అంజలీదేవి పాత్ర (5)
16.  ఉష్ణప్రసరణం ముందువెనుక (5)
17. సాగుమానము (5)
18. రేఖలు చూచి అదృష్టము చెప్పువాడు (5)
20. అయ్యోరామా! (4)
21. డిటెక్టివు తడబడ్డాడు (4)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 06 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 65 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 11 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 63 జవాబులు:

అడ్డం:   

1) ఉత్తర అమెరికా 5) శంప 6) మహాతల్లి 7) రాళ్ళపల్లి 9) రితన్వంధ 13) నాకమా 14) పక్షపాత వైఖరి 15) నేర పరిశోధన 16) రవిజ 18) విరాళము 20) లునవభా 21) అభిశప్త 22) త్వక్త్ర 23) ముక్కాలు మువ్వీసము

నిలువు:

1) ఉపకారిక 2) అపరాధ పరిశోధన 3) కామల్లి 4) సంతకం 8) పరిపాలనవిభాగము 10) తమాలపత్రం 11) కోవైసరళ 12) గురిగింజ 13) నాడునేడు 17) విముఖత్వము 19) కుంభిని 20) లుప్తము ‌‌

‌‌నూతన పదసంచిక 63 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్. మూర్తి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here