[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.
సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) గోపికా కృష్ణుల ఆట (3) |
3) నిష్ప్రయోజకుడు (3) |
8) హిందీ గడ్డం (2) |
9) కొయ్య (3) |
10) హుస్సేను సాగరులోని విగ్రహం (2) |
13) పట్టు పురుగు చెట్టు (3) |
14) కాలక్షేపానికి తినేది (3) |
18) దూడ (2) |
19) చెవి రంధ్రం (3) |
20) హిందీ స్థలము (2) |
23) ఆడ గుర్రము (3) |
24) సూర్య చంద్త్రుల బింబము (3) |
నిలువు:
2) దుడ్డు కర్ర (2) |
4) కోమటి వాడు (2) |
5) సంవత్సరంలో పావు భాగం (3) |
6) ఛందస్సులో రెండు మాత్రల సమానం (3) |
7) పుట్ట తేనె (3) |
11) పన్ను లేని గ్రామం (3) |
12) గొప్ప (3) |
15) పిల్లి (3) |
16) వానపాము (3) |
17) ఆస్ట్రేలియా జంతువు (3) |
21) అతడి, మహారాష్ట్రలో ఒక ఊరు (2) |
22) మంచం పురుగు (2) |
మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2023 జూన్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద ప్రహేళిక జూన్ 2023 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూలై 2023 తేదీన వెలువడతాయి.
సంచిక – పదప్రహేళిక- మే 2023 సమాధానాలు:
అడ్డం:
1) మందార 3) జాగీరు 8) పుట 9) తృణము 10) బిస్త 13) బమ్మెర 14) సహజ 18) ఖట్టి 19) మర్మము 20) చిత్తి 23) టక్కరి 24) గుర్విణి
నిలువు:
2) దాఢ 4) గీము 5) త్రపుస 6) ఘణము 7) హస్తము 11) తెమ్మెర 12) గ్లహము 15) దాఖలా 16) కూర్మము 17) ముత్తిగ 21) గ్రుక్క 22) ఉర్వి
సంచిక – పదప్రహేళిక- మే 2023కి సరైన సమాధానాలు పంపినవారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.