సినిమా క్విజ్-40

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. హిందీలో ‘ఏక్ హీ రాస్తా’ సినిమాలో సునీల్ దత్, మీనా కుమారిలు నటించగా తెలుగులో రీమేక్‍గా బాలయ్య, సావిత్రి గార్లతో దర్శకుడు తాపీ చాణక్య తీసిన సినిమా ఏది?
  2. మొట్టమొదటిసారిగా జగపతిబాబు తెలుగులో నటించిన ‘సింహ స్వప్నం’ సినిమాకి ఏ హిందీ చిత్రం ఆధారం?
  3. హిందీ చిత్రం ‘జాల్’ (1986) ఆధారంగా, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నాగార్జునతో అమల మొదటిసారిగా నటించిన చిత్రం ఏది?
  4. హీరోయిన్, కారెక్టర్ నటి జి. వరలక్ష్మి దర్శకత్వం వహించిన చిత్రం ఏది?
  5. శరత్ దర్శకత్వంలో కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణలు నటించిన చిత్రం ఏది?
  6. మలయాళ చిత్రం ‘నరసింహం’ను తెలుగులో మోహన్ బాబు, నాగార్జునలతో ఏ పేరుతో రీమేక్ చేశారు?
  7. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, సమంత, ప్రకాశ్ రాజ్ నటించిన ‘దూకుడు’ చిత్రానికి ఏ ఆంగ్ల చిత్రం ప్రేరణ?
  8. చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా MBBS’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలు – హిందీలోని ‘మున్నాభాయ్ MBBS’, ‘లగేరహో మున్నాభాయ్’ లకు రీమేక్స్. ఈ హిందీ సినిమాలలో హీరో ఎవరు?
  9. హాస్యనటుడు పేకేటి శివరాం దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం ఏది?
  10. హిందీలో రాజ్ ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన ‘ఓ కౌన్ థీ’లో సాధన హీరోయిన్ కాగా, తెలుగులో జయలలిత నటించిన రీమేక్ ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూన్ 13వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 40 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూన్ 18 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 38 జవాబులు:

1.కొదమ సింహం 2. జయంత్ సి. పరాన్జీ 3. గూడుపుఠాణి 4. కర్జ్ 5. తెనాలి రామకృష్ణ 6. మంత్రదండం 7. నవ్వితే నవరత్నాలు 8. వాగ్దానం 9. పి. ఎల్. రాయ్ 10. పసుపు కుంకుమ

సినిమా క్విజ్ 38 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • మత్స్యరాజ విజయలక్షి
  • పి. వి. ఎన్. కృష్ణ శర్మ
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రేయా ఎస్. క్షీరసాగర్
  • తాతిరాజు జగం‌
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here