‘ఫిరంగిదళం’ పుస్తకావిష్కరణ సభ నివేదిక

0
5

తెలంగాణ జాతి వైతాళికుడు సురవరం

[dropcap]తె[/dropcap]లంగాణ చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు, తెలంగాణ జాతి వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్, యువజన, క్రీడా, సాంస్కృతిక, పురావస్తు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మే 29న సురవరం జయంతిని పురస్కరించుకుని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రముఖ కవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రచించిన ‘ఫిరంగిదళం’ మొగ్గలు కవితాసంపుటిని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష కనుమరుగైపోతున్న సందర్భంలో సురవరం తెలుగు భాషా వికాసానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆనాడే 354 మంది కవులతో గోల్కొండ కవుల సంచికను వెలువరించారన్నారు. ఆంధ్రుల సాంఘీక చరిత్రను రచించి మనదైన అసలైన చరిత్రను లోకానికి తెలియజేసిన గొప్ప చరిత్రకారుడన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆనాడే ప్రశ్నించిన గొప్ప విప్లవకారుడన్నారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని రచించిన భీంపల్లి శ్రీకాంత్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ కె.సి. నర్సింహులు, ప్రముఖ కవి కె.లక్ష్మణ్ గౌడ్, టీ.ఎన్.జి.ఓ. జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, వైస్ చైర్మన్ పోతుల గి‌రిధర్ రెడ్డి, పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాం రెడ్డి, లయన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here