శతక పద్యాల బాలల కథలు-5

0
3

(బాలబాలికల కోసం శతక పద్యాల లోని పద్యాల ఆధారంగా కథలని అందిస్తున్నారు శ్రీమతి ధర్మవరపు చాముండేశ్వరి)

వినదగు నెవ్వరు చెప్పిన

[dropcap]వా[/dropcap]న ముసురు అంటే ఆగకుండా కురిసే వాన అన్నమాట. వానలో రైన్ కోట్, గొడుగులు వేసుకుని పిల్లలు పెద్దలు అమ్మమ్మ చెప్పే శతక పద్య కథలు వినటానికి ఉత్సాహంగా వచ్చారు. ఎప్పటిలా అందరు స్టోరీ హాల్ అదేనండి మేడ మీద గదిలో కూర్చున్నారు. గదిలో దేవుడి దగ్గరి దీపం, అగర్బత్తి హాయైన ఫీల్ ఇస్తున్నాయి. ప్రకృతి అమ్మ, అన్న అందరికి వేయించిన వేడి వేడి వేరుశనక్కాయలు పల్లీలు, తియ్యని బెల్లం ముక్కలు అరటి ఆకు కప్‍లో వేసి తినటానికి ఇచ్చారు.

అమ్మమ్మ వచ్చి అందర్నీ పలకరించారు. “పిల్లలూ, పల్లి బెల్లం ఆరోగ్యానికి మంచివి. తింటూ వినండి” అన్నారు.

మనము వినటానికి సిద్ధమా? అర్ యూ రెడీ?

“పిల్లలూ, కొన్నిసార్లు మనం తొందరపాటుతో ఎవరో ఏదో చెప్పారని విని నమ్మి, ఆలోచించక తీసుకునే నిర్ణయాలు.. యాక్షన్స్.. మనకి మంచి బదులు చెడు చెయ్యవచ్చు. మీ బెస్ట్ ఫ్రెండ్‌తో కట్టిఫ్ కావచ్చు” అన్నారు అమ్మమ్మ.

“అలాంటప్పుడు ఎలా అమ్మమ్మా? ఏమి చెయ్యాలి?” అన్నాడు మానస్.

“తొందరపడక ఆలోచించాలి. ఇప్పుడు అదే చెబుతాను. దాదాపు 700 ఏళ్ళ క్రితం సుమతి శతకంలోని ఈ పద్యంలో చెప్పింది నేటికి కూడా పనికొస్తుంది.. Applicable even today.” అంటూ ఆ పద్యం చెప్పారు అమ్మమ్మ.

~

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపఁదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతి

~

ఎవరు చెప్పిన వినవచ్చు. విన్నాక వెంటనే తొందరపడి పోకుండా బాగా అలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అది నిజమో? అబద్ధమో? తెలుసుకుని ప్రవర్తించిన వాడే లోకంలో తెలివైనవాడు అన్నాడు సుమతి శతకకర్త.

***

కథ

“రాజు రాము మంచి స్నేహితులు. ఇద్దరు ఒకే స్కూల్, ఒకే క్లాస్‌లో చదువుతున్నారు. Childhood friends. అంతేకాదు ఇద్దరు స్కూల్‌కి ఒకే ఆటోలో వేరే ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తారు” అన్నారు అమ్మమ్మ.

ఇంతలో శిరీష్ “ప్రకృతికి అమ్మమ్మా! నేను నా ఫ్రెండ్స్ కూడా same, same!” అన్నాడు

“అవునా? శిరీష్ బంగారు” అన్నారు అమ్మమ్మ.

“శిరీష్! లెట్ అమ్మమ్మ టెల్ ది స్టోరీ” అన్నారు డాడ్.

“ఒకసారి రాము రెండు రోజులు స్కూల్‍కి వెళ్ళలేదు. మూడో రోజున రాము స్కూల్ ఆటోలో ఎప్పటిలా రాజు పక్కన కూర్చుందామని అనుకున్నాడు. ఇంతలో రాజు కిరణ్‍ని పిలిచి తన ప్రక్కన కూర్చో పెట్టుకున్నాడు. రాము రాజుని ‘హలో’ అని పలకరించినా పలకలేదు. రాముకి రాజు ప్రవర్తన.. బిహేవియర్ అర్థం కాలేదు. అలా ఎందుకు ఉన్నడో. స్కూల్‌లో కూడా చాలా ట్రై చేసాడు. No use. అది చూసి మిగతా classmates ‘wow! రాజు రాము మధ్యలో cold war! War!’ అంటూ నవ్వారు.

రాము రాజుకి ఒక కామన్ ఫ్రెండ్ వేరే సెక్షన్‌లో ఉన్నాడు. వాడి పేరు వినీత్. లంచ్ బ్రేక్‌లో రాము వినీత్ దగ్గరకు వెళ్లి “వినీత్! రాజు నాతో మాడ్లాడటం లేదు. ఎందుకు ఏమిటీ? తెలీదు. ప్లీజ్ నువ్వు కనుక్కుంటావా? నీకు కూడా స్నేహితుడేగా” అన్నాడు బాధతో.

వినీత్ రాజుని games period లో కలిసాడు. “రాజు! నీకు రాముకి ఏమైంది? కటీఫ్ ఎందుకు అయ్యావు?” అని అడిగాడు.

“ఏం లేదు!” అన్నాడు రాజు విసుగ్గా.

“కాదు. ఏదో ఉంది. ఏమైంది?” అని అడిగాడు వినీత్.

రాజుకి చెప్పక తప్పలేదు .

“వినీత్! నీకు తెలుసుగా నేను రెండు రోజులు స్కూల్‌కి రాలేదని”

“అవును. అయితే?”

“అప్పుడు రాము నా గురించి చాలా చాలా చెడ్డగా అందరితో చెప్పాడు” అన్నాడు రాజు కోపం, బాధతో.

“చెడ్డమాటలా? నీకెలా తెలుసు? నువ్వు రాలేదుగా?” అన్నాడు వినీత్.

“నాకు తెలుసు. హరీష్, రవి చెప్పారు.”

“హరీష్? రవి?”

“అవును. నా గురించి చాలా చెడ్డగా చెప్పాడట” అన్నాడు రాజు కోపంగా.

“స్ట్రేంజ్. నువ్వు మర్చిపోయావా? హరీష్ నిన్ను, రాముని, మీ friendship ని ఇష్టపడడని” అని, “అవునూ, నీకు రాము ఫీవర్ వచ్చి స్కూల్‌కి రెండు రోజులు రాలేదని తెలియదా? మరి హరీష్‌కి నీ గురించి ఆటోలో ఎలా చెప్పడబ్బా!” అన్నాడు వినీత్.

“ఏంటి? రాము కూడా స్కూల్‌కి రాలేదా? ఫీవర్ వచ్చిందా? అయ్యో!” అన్నాడు రాజు.

“అవును. రాలేదు. కావాలంటే మీ క్లాస్ టీచర్‌ని అడుగు. ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే నమ్మి రియాక్ట్ అయితే ఎలా?” అన్నాడు వినీత్.

“మా అమ్మమ్మ ఏమంటుందో తెలుసా? ఏదైనా, ఎవరైనా చెప్పింది వినగానే వెంటనే నమ్మకూడదు. రియాక్ట్ అవ్వకూడదు. చెప్పిన వ్యక్తి ఎలాంటివాడు? ఎందుకు చెప్పాడు? నిజామా? అబద్ధమా? అని ఒక్కసారి అలోచించి ముందుకు వెళ్ళాలి అంటుంది. రాజు నువ్వు చేసింది తప్పు. మీరిద్దరూ kinder garden days నుండి మంచి స్నేహితులు. మీ అమ్మ వాళ్ళు కూడా. అలాంటిది హరీష్ మాటలు నమ్మి రాముని హర్ట్ చేసావు” అన్నాడు వినీత్.

సిగ్గుతో తలదించుకుని బాధపడుతున్న రాజు దగ్గరికి వచ్చాడు రాము. వినీత్ జరిగింది చెప్పాడు.

“పర్లేదులే రాజు. అంతా మన మంచికే. ఎవరు ఎలాంటివారో తెలిసింది. యు అర్ మై బెస్ట్ ఫ్రెండ్” అంటూ రాజుని గట్టిగా హాగ్ చేసుకున్నాడు.

లంచ్ బ్రేక్ అయిపోవటంతో క్లాస్ లోకి వచ్చారు. వచ్చే ముందు వినీత్‌కి థాంక్స్ చెప్పారు.

***

“అందుకే, పిల్లలూ, తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు” అంటూ ముగించారు అమ్మమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here