విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-17

0
3

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

అసూయాపతి-2

[dropcap]అ[/dropcap]సూయ సర్వ సాధారణం. అది మానవులకే కాదు. దేవతలకు కూడా ఉంది. కానీ, ఆ అసూయ అనేది కచ్చితంగా గట్టి ప్రయత్నంతో జయించాల్సిన భావోద్వేగం. ఎంతమాత్రం సహించాల్సినది కాదు. ఎందుకంటే అది వినాశనానికి దారి తీస్తుంది. అందుకే అసూయ కలుగుతోంది అని గుర్తించగానే దాన్ని నివారించేందుకు ప్రయత్నం చేయాలి.

గంగాధరం మీద అనంతరామ శర్మకు అసూయ ఉందని గ్రహంచింది గాయత్రీపతి రాధాకృష్ణ. కానీ, గట్టిగా ఏ చర్యగా తీసుకోలేదు. ఇక పక్షితీర్థం మామ్మ గారు, గంగాధరం తల్లితండ్రులు, శారద.. ఇలా అందరూ reverence వల్ల.. they were blinded by reverence.

అసూయను ఎలా జయించాలి?

మనకు అసూయ కలుగుతుంది. లేదా చాలాసార్లు చాలాచోట్ల మనం అసూయాపరులను చూస్తాం. లేదా వారిని ఎదుర్కోవలసి రావచ్చు. అది ఎలా చేయాలి?

మొదట బాహ్య ప్రపంచాన్ని జయించే ముందు, అంతర్ప్రపంచాన్ని జయించాలి. లోపల గెలిచాకే బయట. ఇంట గెలిచాకే రచ్చ గెలవాలి.

అంటే అసూయాపరులను ఎదుర్కొనే ముందు మనం కూడా మనకున్న అసూయను జయించటం ముఖ్యం.

దానికి..

మొదట మనలో అసూయ మొదలైంది అన్న విషయాన్ని గ్రహించగానే దాన్ని మనం అంగీకరించాలి. అది మనలను నియంత్రించకుండా అడ్డుపడాలి. అంత తేలిక కాదు. కానీ, సర్వం కోల్పోవటం కన్నా, ఇది మంచిదే.

అసూయ యొక్క మూలాన్ని గుర్తించాలి. అప్పుడు మనకు అసూయ కలగటానికి కారణాలు తెలుస్తాయి. అటు అనంతరామ శర్మ తనలో అసూయ ఉందని గుర్తించనూ లేదు. అంగీకరించనూ లేదు. తెలుసుకునే సరికి పరిస్థితి చేయిదాటి పోయింది. తను చేయాల్సిన పనులను పసివాడి మీద వేసి, అతను పడిన కష్టాన్ని అవమానించి, అతను చేసిన కృషిని తాను వాడుకుని, తన స్థాయిని తగ్గించుకుని, గుండెపోటు తెచ్చుకునేంత వరకూ వ్యవహారం వెళ్ళాక అప్పుడు గుర్తించాడు.

This is the classic Peter Keating situation. Peter Keating doesn’t know he’s incompetent. But his subconscious mind always poked him with right information. But he often ignored it. He also ignored the fact that he suffers from inferiority complex. He masked it with superiority complex. He doesn’t know it too. అది గ్రహించగానే Howard Roark మరణాన్ని కోరుకున్నాడు. అనంతరామ శర్మ suggested unknowingly, and indirectly suicide to Gangadharam.

అనంతరామ శర్మ చేసింది సరిగ్గా ఇదే. అటు తనలో అసూయ ఉందని గ్రహించనూ లేదు. లేదా గ్రహించినా దాన్ని తొక్కిపట్టాడు అంతఃచేతనాన్ని దాటి రాకుండా. గట్టిపిండమే!

తనకు గంగాధరాన్ని చూసినప్పుడు inferiority complex కలుగుతోందని తెలిసినా తెలియకపోయినా, దాన్ని superiority complex అనే ముసుగు వేసుకుని కాపాడుకున్నాడు. సమాజంలో, ఇంట్లో తన మీద ఉన్న నమ్మకాన్ని, తన స్థాన బలిమిని ఉపయోగించుకుని, గంగాధరాన్ని తొక్కిపెట్టాలని చూశాడు. He used his stature. దీనంతటికీ అనంత్ మామ సాక్షి. (గుర్తు పెట్టుకోండి. తర్వాత మాట్లాడుదాం).

సరిగ్గా పీటర్ కీటింగ్ Howard Roark-Horton Stodard trial లో ఇచ్చిన testimonial మాదిరి. గంగాధరానికి స్కాలర్షిప్ రాకుండా అడ్డుపడ్డాడు.

ఇప్పుడు అర్థమయిందా? నేను ఎందుకు అనంతరామ శర్మను పీటర్ కీటింగ్ అన్నది!

<<<అత్తయ్యా! అదే. నువ్వు నవ్వుతూ అన్నా exactly అదే! అలాంటిదేదో ఆంతర్యం, అంతరార్థం ఉంది. అంటాడు గాయత్రీపతి.>>>

పక్షితీర్థం మామ్మగారు నవ్వుతారు కొట్టిపడేస్తున్నట్లు.

వెంటనే కథ అటువైపు గాయత్రీ వసంతం కు మన గంగాధరం సంగీత పాఠాలు నేర్పుతున్న హాస్య సన్నివేశానికి మళ్ళుతుంది. అంటే కే. విశ్వనాథ్ ఎంత బలంగా తన సన్నివేశాలను నిర్మించాడో చూడండి.

ప్రణటి ప్రణటి ప్రణటి…

గాయత్రీ వసంతం పాడుతుంటుంది.

గాయట్రీ వషంటం. ఆమెకు త పలుకదు.

త… తత్! అది. That. ఆ అదే పలుకదు. అత్యంత అవసరమైనదే పలుకదు. సరిగ్గా ఈ విషయం మనకు చాలా కీలకమైన డీటెయిల్ ఇస్తుంది.

గంగాధరానికి అవసరమైనదే దొరకదు అని.

తత్! టట్, tut!

Got it?

The తత్ that should have been the essential for Gangadharan has become the టట్ (tut) to him courtesy Anantha Rama Sharma.

గ్రహించారా విశ్వనాథ్ మేజిక్?

సరే! అసూయను జయించటానికి ఇంకా ఏమి చేయవచ్చో చూద్దాం.

అసూయను గుర్తించి, అది కలిగిందని అంగీకరించాక, దానికి కారణమేమిటో గుర్తించడానికి ప్రయత్నించాలి. ఒకరి విజయాలు, రూపురేఖలు లేదా సంబంధాల పట్ల అసూయ కలుగుతోందా? అసూయ యొక్క మూలాన్ని మీరు తెలుసుకున్న తర్వాత, దానిని పరిష్కరించే పనిని ప్రారంభించవచ్చు.

The biggest antidote to jealousy is Ego. అష్టావక్ర మహర్షి కథను గుర్తుకు తెచ్చుకోండి. ఆయన తన ego వల్ల మాత్రమే తపస్వి, శాపానుగ్రహ సమర్థుడైన తండ్రిని తట్టుకుని నిలబడగలగటమే కాదు. ఆయనను ఉద్ధరించాడు. అంతటి మహాత్ముడు కనుకనే అద్వైత వేదాంతంలో పరాకాష్ఠ లాంటి అష్టావక్ర గీతను అందించాడు. We know the case of Howard Roark.

Egolessness is often the biggest reason for jealousy.

Selflessness గురించి Ayn Rand చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి ఇక్కడ. ఏమిటది?

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here