[dropcap]ఊ[/dropcap]హ తెలిసీ తెలియని వయసు.
అమ్మా, పిన్ని, అమ్మమ్మా సినిమాకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. పడుంటాం కనుక నన్ను కూడా తగిలించుకోక తప్పదు. మార్నింగ్ షో. నరసరావుపేటలో ఫేమస్ సత్యనారాయణా టాకీస్. సినిమా పేరు నాకు తెలియదు.
సినిమా పేరు నాకు తెలియదు కాదు. I’m saying that I don’t know the movie’s title.
ఆ వయసుకు తగ్గట్టు నేను సినిమా మొదలు కాగానే సాంప్రదాయాన్ని అనుసరించి ఏడుపు లంకించుకున్నాను. తీసుకు వెళ్ళిన వాళ్ళకు ఇబ్బంది. నేను సౌండ్ పెంచాను. ఇది కూడా సాంప్రదాయాన్ని అనుసరించే.
ఇంతలో స్క్రీన్ మీద ఒకడు కనిపించాడు. గుర్రం మీద వస్తూ. అది నా అటెన్షన్‌ను పట్టింది. సౌండ్ ను e^(-x) graph రూపంలో తగ్గించాను. నాకు తెలియకుండానే. మనిషి తెల్లగా ఉన్నాడు. తమాషా టోపీ పెట్టుకున్నాడు. దాన్ని hat అంటారని తరువాత తెలిసింది.
అది గమనించి మా పిన్ని, “అదిగో చూశావా? వాడు గుర్రం మీద పోతున్నాడు. భలే ఉంది కదా?”
నేను: ఊఁ
పిన్ని: వాడే హీరో. గన్ పేలుస్తాడు. ఫైటింగ్ చేస్తాడు.
నేను: హీరో అంటే?
పిన్ని: మంచి పనులు చేస్తాడు. సాహసాలు చేస్తాడు. నీలాగా బంగారు కొండల్లే ఉంటాడు. (వేయాల్సిన బిస్కెట్ వేసేసింది. నువ్వే హీరో అని).
అంత పొగిడాక ఊరుకోం కదా. ధర్మాన్ని పాటిస్తూ తప్పక ఏడుపు ఆపేసి ఆ గుర్రం మీద వాడిని ఫాలో అయ్యాను.
నేను: వాడి పేరేంటి?
పిన్ని: Superstar Krishna.
ఆ సినిమా పేరు మోసగాళ్ళకు మోసగాళ్ళు!
కథ అర్థం కాకపోయినా, విషయం తెలియక పోయినా, ఆ గుర్రాలు, తుపాకి మోతలు, ఫైటింగ్‌లు, తెలియకుండా ఉత్సాహాన్ని ఇచ్చే మ్యూజిక్ వింటూ సినిమా చూశాను.
కొన్నాళ్ళకు నంబర్ 1, మధ్యలో రీరిలీజ్ సింహాసనం (ఏం పాటలు!), అమ్మ దొంగా, ఒకసారి తాత (అమ్మ నాన్న) తీసుకు వెళ్ళిన అల్లూరి సీతారామరాజు, ఇలా.. ఆ Superstar Krishna అనేవాడు చాలాసార్లు తగిలాడు. నా attention grab చేశాడు. కొత్తా, పాతా తేడా లేకుండా చాలా సినిమాలు చూశాను. తెలియకుండానే అభిమానం ఏర్పడింది.
Cut to 2023.
1 April.
మోసగాళ్ళకు మోసగాడు 4K rerelease with upgraded sound అని ఫేస్బుక్ లో పోస్టు పెట్టాను.
స్పందించిన మిత్రులలో తోటివారితో వెళ్దామా అని ఒక ప్రశ్న. వెళ్దాం అనే సమాధానాలు. ఆతర్వాత నెలకు ప్రముఖ వెబ్సైట్లలో న్యూస్ వచ్చింది. క్రమంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
Not every plan comes true in the end. కానీ కొత్త avenue లు ఓపెన్ అవుతాయి. పెద్దలు, సహృదయ మిత్రులు నాలాగే వెళ్దాం అనే ప్లాన్ వేశారు. నా ప్లాన్ కుదరలేదు కాబట్టి వారితో నేను కూడా జాయిన్ అవుతా అన్నాను. వెల్కమ్ అన్నారు. కుదిరింది.
మధ్యలో సంభాషణలలో అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ ఫైటింగ్లు ఇవీ ఉండటం వల్ల చాలామందికి, ప్రత్యేకించి పిల్లలకు నచ్చేవారు అని ఒక మిత్రులు అన్నారు.
నా సమాధానం: మనుషులు బేసిగ్గా మంచివాళ్ళు. వయసు పెరుగుతున్న కొద్దీ అవలక్షణాలు జొరబడతాయి.
అందరూ acceptance గా నవ్వారు. కాసేపయ్యాక హాల్‌లో పోస్టరు దగ్గర Superstar Krishna ను commemorate చేస్తూ ఫొటోలు. మా వల్ల escalator దగ్గర చిన్న ట్రాఫిక్ జామ్. Fun experience. సరదాగా కబుర్లతో లోపలకు వెళ్ళాం. మహేశ్‌ది గుంటూరు కారం టీజర్. దానికి మంచి రెస్పాన్స్.
కానీ, అసలైన రెస్పాన్స్ మటుకూ తెర మీద టైటిల్స్‌తో Superstar Krishna కనబడ్డప్పుడు. విజిల్స్. హూటింగ్స్. ఫోన్ కెమేరాలు ఆన్ చేసి ఫొటోలు..
వేరే లెవెల్!
అనుభవించాల్సిందే.
క్వాలిటీ, ఎలా 4K కు upgrade చేస్తారు అని ముందే మాట్లాడుకున్నాం. ప్రింట్ బాగుంది. ప్రత్యేకించి క్లోజప్ షాట్లు చాలా క్లారిటీతో వచ్చాయి. Dolby atmos లో ఆ సినిమా మ్యూజిక్ వేరే స్థాయిలో ఉంది. కనీసం నాలుగైదు చోట్ల జనం కేరింతలు కొట్టారు. నక్కజిత్తుల నాగన్నగా నాగభూషణం కనిపించిన చోటల్లా నవ్వులే. డైలాగ్స్ మరోసారి విని ఆస్వాదించాం.
కోరినదీ నెరవేరినదీ పాటను ఆ మంచు కొండలతో బిగ్ స్క్రీన్ మీద చూడటం cinematic nirvana. విలన్లుగా ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ వారి స్థాయిలో బాగున్నారు.
సినిమాలో అబ్జర్వ్ చేసినవి:
డ్రామా ఉంది. But it’s not overdone.
రొమాన్స్ ఉంది. But it’s not overdone.
సినిమా మొత్తం lighthearted spirit maintain అయింది.
నాగభూషణం పాత్ర ద్వారా passive black comedy వాడారు. బాగా workout అయింది.
కృష్ణను సీరియల్ కిల్లర్‌గా చూపారు. Signature of murder బాగా effective గా ఉంది. (సీరియల్ కిల్లరా? అనకండి. కళ్ళు పోతాయి).
There’s a lot of action in the film. Every fight is well choreographed for those times.
Editing was at its best. Not even a second of lingering on unnecessary images.
Adventure ఉంది. సాహసం చేయాలనే కోరిక కలుగజేసేలానే ఉంది.
ప్రతి పాటా సందర్భోచితంగా వచ్చి బాగున్నాయి.
ఆ రోజుల్లో international hit అయిన రాజసులోచన పాటను కట్ చేశారు. ఆ విషయాన్ని అక్కడే మిత్రులతో డిస్కస్ చేశాను. మోసగాళ్ళకు మోసగాడు international version లో ఉంచిన ఏకైక పాట అదే. రాజసులోచన dance movements captured the attention of the foreign audience అని ఎక్కడో చదివాను.
ఆ పాట అలా తెలుగులోనే ఉండిపోయిందట. ఆమె జిప్సీ తరహా పాత్ర వేయటం వల్ల తెలుగును జిప్సీ భాష అనుకున్నారు ఫారెనాడియన్స్ అని కూడా చదివాను. But a super song was cut. Probably Superstar Krishna లేకుండా ఉన్న పాట కదా అని కట్ చేసి ఉండవచ్చు. లేదా నైట్ టైమ్ effect లో తీసిన పాట కాబట్టి upgrade చేయటానికి లొంగక పోయి ఉండవచ్చు.
But a historic occasion missed an iconic song and a rare international hit మిస్ అయింది.
ఆదినారాయణ రావు సంగీతం అద్భుతం. అన్ని పాటలు ఈ రోజుకు కూడా నచ్చేలా ఉన్నాయి.
భారతీయ సినిమాలలో కౌబాయ్ జన్రాలో తీసిన సినిమాలలో ఎన్నియో మోరికోన్ సౌండ్స్ వాడకపోవటం ఉండదు. కానీ ఈ సినిమా థీమ్ లో Morricone’s signature sounds వాడలేదు. అది విశేషమే.
Superstar Krishna, విజయ నిర్మల మధ్య డ్యూయెట్ (కోరినది నెరవేరినది) మొదట వచ్చే మ్యూజిక్‌లో The Good The Bad The Ugly signature sound వాడారు. అది తమాషాగా అనిపించింది.
పోరాట సన్నివేశాలు యునీక్‌గా ఉన్నాయి. Eye catching and attention grabbing. Cinematography is top class. Landscapes, సీనరీ చాలా బాగా కేప్చర్ చేశారు.
దర్శకత్వం కేఎస్సార్ దాస్. నిత్య నూతనం.
ఆయన వాడిన between the legs shot ను రామ్ గోపాల్ వర్మ బాగా వాడుకున్నాడు. దీన్ని ఈ సినిమాలో చాలా effective కా వాడుకున్నారు.
Trunk shot, point of view shots కూడా బాగా వాడారు. కొద్దిసేపే అయినా. Cringe worthy scenes లేవు.
ఎస్. వరలక్ష్మి చేసిన పూటకూళ్ళమ్మ పాత్ర సహజ భారతీయాత్మను, మనవారి naturally empathetic nature ను పట్టి ఇచ్చింది.
గుమ్మడి పాత్ర unintended comedy గా మారింది. ఈ కాలానికి. శాంతకుమారి మెలోడ్రామా కూడా అలాగే అయ్యింది.
As expected Superstar Krishna was the biggest highlight. He is perfect fit for the role. None can ooze the naive charm like him. విజయ నిర్మల బాగా చేసింది. జ్యోతిలక్ష్మి తన పాత్రలో జీవించింది. A well written femme fatale. ప్రధాన పాత్రలు జీవం ఉట్టిపడేలా ఉన్నాయి. సహాయ పాత్రలు వాటి వాటి మేనరిజాలతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒఫ్ఫొఫ్ఫొఫ్ఫో! గుర్తొచ్చిందా?
ఎప్పటిలాగే ఇది Superstar Krishna సినిమా కనుక నిధినంతా పేద ప్రజలకు పంచి పెట్టారు.
మోసగాళ్ళకు మోసగాడు ఎంత influenced and inspired సినిమా అయినా గొప్ప క్లాసిక్ అన్నది నిజం.
తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.
Superstar Krishna is a blessed man. మామూలు రిస్క్ కాదు.
చిన్నప్పుడు అమ్మా, పిన్నీ, అమ్మమ్మలతో చూసినప్పుడు ఏ wondrous feeling కలిగిందో, అదే అనుభూతి ఇప్పుడు చూసినా కలిగింది. Finally with slightly heavy hearts we bade farewell to a beloved hit pair.
ఇతి వార్తాః॥