మండే సూర్యుడు

0
3

[మండుతున్న ఎండల గురించి నానీలు అందిస్తున్నారు పారుపల్లి అజయ్‍ కుమార్.]

[dropcap]సూ[/dropcap]ర్యుడి కోపం
భూమికి తాపం
తరువులు పెంచితే
తరుగును తపనం..
~
ఎండలకు
నేలంతా నెర్రిచ్చే
మేఘం దిగొచ్చేలా
మల్హర్ రాగం పాడండి..
~
ప్రాణకోటికి జీవాధారం
సూర్యుడే
కన్నెర్ర చేస్తే
ప్రాణులన్నీ విలవిలా..
~
ఎదురు చూస్తున్నా
వాన చినుకు కోసం
దాహం తీరని
చాతక పక్షిలా..
~
మండే ఎండలు
వీడ్చే గాడ్పులు
బుగ్గి చేస్తున్నాయ్
పేదవారి బతుకులను..
~
దినదిన గండం
బతుకొక నరకం
మండుటెండల్లో
కూలోళ్ళ వెతలు..
~
నీరింకిపోయిన బావి
ఆశగా యెదురు చూస్తున్నది
కురిసే
వానకోసం..
~
ఆకాశంలో మబ్బులు లేవు
నేలపై నీళ్ళు లేవు
మండే ఎండల
కాలం ఇది..
~
పిట్టగోడ మీద
పిచ్చుకల కేరింతలు
గిన్నెలో నీరంతా
తాగాయి మరి..
~
కర్ఫ్యూ పెట్టలేదు
గానీ రోడ్లన్నీ నిర్మానుష్యం
భానుడి
భగభగలకు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here