[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నువ్వే కావాలి..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప్రి[/dropcap]యా!
నీ నవ్వును చూసి
పున్నమి వెన్నెల
మురిసిపోతుంది
నీ చూపును చూసి
గగనపు తార
మెరిసిపోతుంది
నీ పలుకును చూసి
పచ్చని చిలుక
ముచ్చటపడుతుంది
నీ పిలుపు విని
రాగాల కోయిల
పరవశిస్తుంది
నీ నడకను చూసి
అందాల హంస
పులకరిస్తుంది
నీ హొయలు చూసి
ముదిత మయూరి
పురివిప్పుతుంది
నీ రూపం చూసి
‘నువ్వే కావాల’ని
నా మది కలవరిస్తుంది