[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘నిరాశ వద్దు..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఆశకి నిరాశకి మధ్య లోలకమై ఊగుతుంటుది జీవితం!
జీవితంలో గెలుపు ఓటములు సహజం!
జీవితం అంటే గెలుపుకై సమరం!
ఓటమి ఎదురై ఇబ్బంది పెట్టినప్పుడు
ఓర్చుకుని ఓర్పుగా విజయం కోసం శ్రమించాలి!
‘కష్టే ఫలి!’ అన్నట్లుగా..
శ్రమిస్తే తప్పకుండా అపజయాలు పటాపంచలై
గెలుపు ప్రియమైన పలకరింపులా దగ్గరై
నిన్ను సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది!
ఓటముల అగాధాలని తట్టుకుని
ధీమాగా దాటితే గాని గెలుపు శిఖరాలని చేరుకోలేవు నేస్తం!