[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. షేక్స్పియర్ నాటకం. ఈ మధ్య దీన్ని కర్రిగాడు పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. (3) |
3. “ఓ పిట్ట కథ” సినిమా చూడాలంటే ఇది కావాలి 🙂 (3) |
5. మొదటే ఎర వేసే ప్రియురాలు (3) |
7. నవతెలంగాణా పేపర్లో మహిళా పేజీ (3) |
8. మబ్బు క్రమ్మియున్న బాడిద చెట్టు (3) |
9. ప్రాణం పోయింది (2,5) |
10. చతురంగంలో Knight (3) |
11. రక్తచందనం (3) |
13. రెండు కొమ్ములు లేని ఫేనము (3) |
17. తడబడిన కడపతో తడిబము (3) |
18. సంచిక రైటరు (3,4) |
19. తుమ్ము (3) |
20. గద్యం (3) |
22. ___ వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటురావే వయారీ అని అల్లు రామలింగయ్య పాట (3) |
23. నిలువు 21కి భార్య (3) |
24. వ్యంజనము (3) |
నిలువు:
1. అమెరికా మాజీఅధ్యక్షులలో ఒకరు (3) |
2. విమానము లేదా హెలికాప్టర్ (2,3) |
3. గెలిచాము (5) |
4. రచయితల నుండి కథలను ఆహ్వానించి వాటిలో కొన్నింటికి బహుమతులు ఇచ్చే ప్రక్రియ (3,2) |
5. రామానాయుడు నిర్మాతగా దాసరి దర్శకత్వంలో అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన ఒక సినిమా (5) |
6. రామోజీరావు నడిపిన ఒక పత్రిక (3) |
10. గులాబ్, బుల్బుల్, నిసర్గ, ఆసాని, హిక్కా ఇవి దీని పేర్లు (3) |
12. నడవడికలో వేగం లేదు (3) |
14. అడవి గోధుమలు (5) |
15. స్త్రీలకు ఇష్టమైన కదంబవృక్షం (5) |
16. పోరాటపథం సీరియల్లో శ్రీరామకృష్ణ ఆశ్రమం విద్యార్థి మందిరం వార్డెన్ ఈ స్వామీజీ (5) |
17. ముగింపు, రిజల్టు (5) |
19. దెబ్బ (3) |
21. కర్ణుడికి అతిరథుడు ఎలాగో, ప్రమద్వరకు స్థూలకేశుడు ఎలాగో, కృష్ణుడికి అలాగే ఇతడు. (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూన్ 20 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 67 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూన్ 26 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 65 జవాబులు:
అడ్డం:
1) విధుపంజరం 4) నాగరికత 7) హాతిర 8) దరిసినము 9) నాకవిభూఫలము 11) నిసివెలుగు 15) లోహితాయస 19) హరిహయోపలము 22) పాముపడగ 23) మనవి 24) నిశావసానం 25) ధీరోదాత్తుడు
నిలువు:
1) విరేచనాలు 2) పంరూశ్వవి 3) రంహాలఫ 4) నారదముని 5) రిన్నెసిలవె 6) తలమునుగు 10) భూతదయ 12) సినేరియో 13) లుక్కు14) రోహి 15) లోకపావని 16) తాహపనంవ (తాప వహనం) 17) సహగమనం 18) సాముద్రికుడు 20) హతవిధీ 21) పత్తేరుదా
నూతన పదసంచిక 65 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.