[dropcap]ఇ[/dropcap]టీవల ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న కథలకు సోమేపల్లి సాహితీ పురస్కారాల పోటీలలో ‘అకుపచ్చని పొద్దు’ కథకు గాను బి. కళాగోపాల్ (నిజామాబాద్) ప్రథమస్థాయి సోమేపల్లి పురస్కారం లభించింది.
‘విత్తు’ కథా రచయిత బి. వి. రమణమూర్తి (మధురవాడ)కు ద్వితీయ, ‘వైకుంఠపాళి’ కథా రచయిత మల్లారెడ్డి మురళీమోహన్ (విశాఖపట్నం)లకు తృతీయ సోమేపల్లి పురస్కారాలు లభించాయి.
అలాగే ‘ఎగిరే ముద్దు’ కథా రచయిత శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు), ‘వెన్నెల దీపం’ కథా రచయిత బి. వి. శివప్రసాద్ (విజయవాడ), ‘బాధనుండి బాధ్యతవైపు’ కథా రచయిత కె.వి.లక్ష్మణరావు (మానేపల్లి), ‘ఏది దానం-ఎవరు దాత’ కథా రచయిత్రి కె.వి.సుమలత (గుడివాడ)లకు ప్రోత్సాహక పురస్కారాలు లభించాయి.
విజేతలకు నగదు, శాలువ, మెమెంటోలతో త్వరలో జరిగే ప్రత్యేక సభలో పురస్కారాలు అందజేయడం జరుగుతుంది.
ఈ కథల పోటీకి ప్రముఖ రచయిత శ్రీ శ్రీకంఠస్ఫూర్తి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ఇట్లు
సాహితీ వందనములతో..
సోమేపల్లి వెంకటసుబ్బయ్య,
అవార్డు కమిటీ ఛైర్మన్
చలపాక ప్రకాష్
ఎడిటర్, రమ్యభారతి