హాస్య తరంగిణి-10

0
3

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

91. సిగ్గు – పెగ్గు

మహారాజు: ఓ వికటకవీ! అందము గూర్చి ఒక కవిత జెప్పుము?

వికటకవి: ఆడువారికి సిగ్గు అందము, మగవారికి పెగ్గు అందము.

92. నేనే నేతిని

నాయకుడు: ఎవరయ్యా ఆవిడ? ఏం కావాలట ఆమెకు?

కార్యకర్త: ఆమె నేతియట! మన పార్టీలో చేరటానికి వచ్చింది.

నాయకుడు: నేతి అంటున్నావు! నెయ్యి వ్యాపారం చేస్తుందా ఆవిడ?

కార్యకర్త: మగవారిని నేత అంటాం కదా! ఆడదాన్ని కాబట్టి నేను నేతిని అని నాతో వాదిస్తోంది అన్నా!

93. అగ్రతాంబూలం

పురోహితుడు: అదేమిటి నాయనా! టేబుల్ పైకెక్కి మరీ నాకు తాంబూలం ఇస్తున్నారెందుకు?

పండరి: పూజ చేయించినవారికీ అగ్రతాంబూలం ఇవ్వాలని మా గురువుగారు చెప్పారు స్వామి!

94. భయం

సారథి: మంత్రిగారు పైకెక్కి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయాలి కదా!

మాణిక్యం: కానీ మన మంత్రిగారు ససేమీరా కొత్త బ్రిడ్జి పైక్కనంటున్నారు!

సారథి: ఎందుకట?

మాణిక్యం: హఠాత్తుగా బ్రిడ్జి ఎక్కడ కూలిపోతుందోనన్న భయమట.

95. క్యాట్ ఎగ్జామ్

బామ్మ: ఇదేమిటిరా, ఈ మధ్య నువ్వు బుద్ధిగా చదువుకుంటున్నావు? ఇంతకీ ఏ పరీక్ష రాస్తున్నావు?

భద్రి: క్యాట్ పరీక్ష!

బామ్మ: ఇంతకీ నువ్వు చదివేది గోడమీది పిల్లి గురించా! బాగానే ఉంది. నీ చదువు – చట్టుబండలు.

96. కుక్కమీద వ్యాసం

టీచర్: శునకము మీద ఒక వ్యాసము వ్రాయుము.

హాస్యానంద్: కుక్కమీద వ్యాసము రాయలేము సార్! అది నన్ను కరుస్తోంది బాబో్య్!

97. జనాల శాఖ

నాయకుడు: నిన్ను మంత్రివర్గంలోకి తీసుకోవటం కుదరదయ్యా! అంటే అర్థం కావటం లేదా? అన్ని శాఖలూ కేటాయించేశాం!

జనార్దన్: అయ్యా! అయితే నాకు ‘జన సమీకరణ శాఖామంత్రి’ పదవి ఇచ్చేయండి. మన ఇక మీటింగులన్నీ విజయవంతమే.

98. జ్ఞాతులు – కోతులు

గురువు: ఇంతకీ నీ జ్ఞాతులెవరో తెలుసా నీకు?

డింబవర్మ: నా జ్ఞాతులే కాదు, మీ జ్ఞాతులు కూడా తెలుసు గురువర్యా!

గురువు: ఇది చాలా ఆశ్చర్యంగా ఉందిరా! సరేలే! చెప్పుచూద్దాం!

డింబవర్మ: మన అందరీ జ్ఞాతులూ కోతులే గురువర్యా!

99. భూతనాథ్

అధికారి: అసలు నీకెందుకు డాక్టరేట్ ఇవ్వాలి?

బూత్ నాథ్: నేను బూతులమీద పరిశోధన చేసి, ఒక నిఘంటువుని కూడా రాశాను సార్!

100. లౌలీ రోబో

నిరంజన్: రోజు నా లవర్ వడ్డిస్తే నేను హాయిగా భోజనం చేసేవాడిని తెలుసా?

చిత్తరంజన్: ఇంతకీ నీ లవర్ పేరేమిటి?

నిరంజన్: లౌలీ రోబో!

చిత్తరంజన్: మరి ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్ళింది?

నిరంజన్: నా దగ్గరే ఉందిగానీ బ్యాటరీ ఐపోయింది!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here