సాహితీ కిరణం వారి బాల నాగయ్య స్మారక కథా సంపుటాల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన ‘గాండ్ల మిట్ట’ పుస్తకానికి 15/6/23 న హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో తిరుపతి రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె. వి. రమణాచారి గారు పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, నేటి నిజం సంపాదకులు బైస దేవదాసు, సాహితీ ప్రియులు పెద్దూరి వెంకటదాసు, వంశీ రామరాజు, ఎం.బాల గంగాధరయ్య, గుదిబండి వెంకట రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.