[dropcap]సం[/dropcap]చిక ది 25 జూన్ 2023, ఆదివారం నాడు రచయిత/త్రులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తోంది.
ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగే ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా రచయిత/త్రులని ఆహ్వానిస్తున్నాం.
ప్రస్తుతం సంచిక నిర్వహిస్తున్న రచయితల సమావేశాలు హైదరాబాద్‍కు పరిమితం అవుతున్నందున – ఇతర ప్రాంతాల లోని రచయిత/త్రులను కలుసుకుని – ఒకరినొకరు పరిచయం చేసుకునే విధంగా ఈసారి ఆన్‍లైన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము.
సంచిక ప్రతీ నెలా రచయితలతో – ఆఫ్‍లైన్, ఆన్‍లైన్ సమావేశాలు నిర్వహించాలని తలుస్తోంది. ఆన్‍లైన్ మీటింగ్‍లలో ఏ ప్రాంతపు రచయితలైనా పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఆఫ్‍లైన్ మీటింగ్స్ – ఒక్కో ఊరిలో నిర్వహించాలని భావిస్తున్నాము. నిజామాబాద్, వరంగల్, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, కావలి, కరీంనగర్, కర్నూలు, కడప, నెల్లూరు, చెన్నై, ముంబయి, రాయగడ వంటి ప్రాంతాలలోని రచయిత/త్రుల సహకారంతో ఆయా ఊర్లలో సమావేశాలు నిర్వహించాలని సంచిక ఉద్దేశం.
ఈ 25న జరగబోయే జూమ్ మీటింగ్‍లో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని సంచిక కోరుతోంది.
వివరాలు:
Meeting ID: 830 9422 5332
Passcode: 506040
ధన్యవాదాలు.