[dropcap]కొం[/dropcap]డకోనల తిరిగెటోడు
కల్లాకపటం ఎరగనోడు
వేటలోన ధీటుగాడు
రోజు నీతో మంతనాలు
పల్లెలకె రాజు వాడు
పట్టు తేనేలు పట్టెవాడు
పచ్చి మాంసం నైవేద్యం
బుగ్గల నీటి అభిషేకం
కనుల రక్తం ఆగదంట
కలవరపాటే చెందద్దంటూ
కాలి గుర్తు నెత్తిన మోపి
కన్నులు పెరికి పెట్టినాడా
వాడి భక్తికి నువ్వు మెచ్చి
కన్నప్ప బిరుదునిచ్చి
మోక్షమిచ్చి కొండనెట్టి
కింద నువ్వు కొలువున్నవా
నీ లీల నీకే తెలుసు
ఓ కాళహస్తి వాస