[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- మల్లాది వెంకట కృష్ణమూర్తి అందించిన కథ గల చిత్రంలో డా. రాజశేఖర్, టీవీ రామాయణంలో సీతగా నటించిన దీపిక, మహర్షి రాఘవ, శాంతిప్రియలు నటించారు. కొమ్మూరి సాంబశివరావు గారి నవల ‘అనామకుడి హత్య’ పోలికలతో ఉన్న ఈ చిత్రం పేరేమిటి?
- 1950లో వైజయంతిమాల – తెలుగు చిత్రసీమకి – ఎస్. వరలక్ష్మి, సిహెచ్. నారాయణరావు, టి.ఆర్. రామచంద్రన్ ఉన్న చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఆర్. సుదర్శనం సంగీతమందించిన ఈ సినిమా పేరేమిటి?
- అక్కినేని, జమునలు నటించిన యీ చిత్రానికి పి. చెంగయ్య దర్శకత్వం వహించారు. సంగీతం ఎం. సుబ్రహ్మణ్య రాజు. సంభాషణలు ఆచార్య ఆత్రేయ. ఇది ఏ సినిమా?
- ఐ.యన్. మూర్తి దర్శకత్వంలో కృష్ణ, వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో ఎస్. వి. రంగారావు గారి ‘తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు రా గూట్లే’ అన్న డైలాగ్ ప్రసిద్ధం. ఈ సినిమా పేరేమిటి?
- ఎన్.టి.రామారావు నటించిన సినిమాల పేర్లు తీసుకుని దాసరి నారాయణరావు పాట వ్రాస్తే, ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పి. సుశీల పాడిన ‘నిన్నే పెళ్లాడతా – రాముడు భీముడు – రాముని మించిన రాముడు’ అను చరణలున్న చిత్రం ఏది?
- శ్రీశ్రీ రాయగా, జిక్కి పాడిన ‘తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా’ అనే పాట కృష్ణకుమారిపై చిత్రీకరించబడింది. ముఖ్యపాత్రలు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి. సి.ఎస్. రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరేమిటి?
- రాజ్ కపూర్, నూతన్ నటించిన ‘అనాడీ’ అనే హిందీ చిత్రాన్ని తెలుగులో కృష్ణ, జమునలతో అడ్డాల నారాయణ దర్శకత్వంలో రీమేక్ చేశారు. శంకర్ సంగీతం అందించిన ఈ సినిమా పేరేమిటి?
- కృష్ణ, శోభన్‍బాబులు కలిసి నటించిన ఆఖరి చిత్రం ఏది? ఈ సినిమాకి ఏ. కోడండరామిరెడ్డి దర్శకుడు.
- ‘అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహం సింహమేరా డోంగ్రే’ అని మహానటులు ఎస్.వి.రంగారావు ఏ చిత్రంలో అరిచారు?
- ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో ఘంటసాలగారు కలిసి పాడిన పాటలు ఎన్ని?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జూలై 04 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 43 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జూలై 09 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 41 జవాబులు:
1.టిఎ కళ్యాణం 2. చదరంగం 3. అక్బర్ సలీం అనార్కలి 4. పెళ్ళిసందడి 5. ఆరాధన 6. టాక్సీ రాముడు 7. చిరంజీవులు 8. దొంగలున్నారు జాగ్రత్త (1958) 9. ఆడబ్రతుకు 10. కులగోత్రాలు
సినిమా క్విజ్ 41 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మణి నాగేంద్ర రావు బి.
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సునీతా ప్రకాష్
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రేయా ఎస్. క్షీరసాగర్
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వెంకాయమ్మ. టి
- వర్ధని మాదిరాజు
- వనమాల రామలింగాచారి
- దీప్తి మహంతి
- జి. స్వప్న
- యం.రేణుమతి
- భరత్ టి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]