[dropcap]‘నూ[/dropcap]తన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. బైబిలు ప్రకారం ఆదాము (2, 4) |
3. పని, మిక్కిలి ఆసక్తి (4) |
7. విరివేణి (4) |
8. నిలయాల సమవాయములో వాయస అంతర్ధానంతో సరిచేస్తే కమ్మతెమ్మెర వీస్తుంది. (6) |
10. సరిగమప పాట పాడాలి, పాటల్లోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి అని సంగీతం టీచరు పాడింది ఇందుకే నంటారా? (2, 2, 3) |
13. హంకారసంపన్నుడు. (4,3) |
16. శాతవాహనుల రాజధాని (6) |
17. ఉరగభూషణుడు దాచుకున్న కానుక (4) |
18. ఎదురుబొదురు (4) |
19. నిద్రను పోగొట్టడానికి పాడే పాటలు (6) |
నిలువు:
1. ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసే అర్చన (4) |
2. శీలా వీర్రాజు చేత పాకుడురాళ్ళుగా మార్చబడిన నవల. (6) |
4. పశువుల కొట్టం (4) |
5. మందస్మితము (6) |
6. సినిమా యాక్ట్రెస్ (5, 2) |
9. ప్రపౌత్రుని చూచిన వ్యక్తికి చేయవలసిన సత్కారము (7) |
11. గాలి, కాలము (6) |
12. పెళ్లిచూపులకు వెళ్లి చేసే భోజనం (6) |
14. యావత్తు కలిగిన యావత్తు (4) |
15. వటారము మధ్య తిరగబడి పేలు మధ్యలో చేరిన సువాసిని (4) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘నూతన పదసంచిక 70 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 16 తేదీన వెలువడతాయి.
నూతన పదసంచిక 68 జవాబులు:
అడ్డం:
1) అందెవేసినచేయి 5) యక్షగానము 6) గజగామిని 9) చదువులపడతి 12) వక్రీడానము/వనడాక్రీము 13) కొత్త అల్లుడు 14) రంగరంగవైభవం 17) జితమంతుడు 19) తోమాలసేవ 20) ముసలమ్మమరణం
నిలువు:
2) సిలిమి 3) యియక్షువు 4) అనకొండ 6) గతసంవత్సరం 7) గాలికొండాపురం 8) నిచయము 10) పని అనుభవం 11) తిన్నడు కన్నడు 13) కొరవంజి 15) గజమాల 16) వైభవము 18) తతిమ్మ
నూతన పదసంచిక 68 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- లలిత మల్లాది
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేషశాస్త్రి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.