[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పాకుడురాళ్ళు సృష్టికర్త (7) |
5. వేదపఠనారంభావసానములం దుచ్చరింపఁబడు ప్రణవము (1) |
8. హేతువు ఆ వైపు నుండి కనపడుతోంది (4) |
10. పసి లేని పసిపాప, ఆ వైపు నుండి (2) |
12. ప్రతిదినము (3) |
14. నటి విజయశాంతికి బాగా పేరు తెచ్చిన సినిమా (5) |
16. ఇది కూడా ఒక వృత్తేనట! (3) |
17. వివోఢ (3) |
18. వినడానికి అడ్డం 14 లాంటిదే – కాకపొతే ఇది ‘జరిగినది’ – అందుకే మొదలు చివర మాత్రమే మిగిలినది (2) |
20. ఫోనెత్తితే మనమంతా మొదలుపెట్టేది దీనితోనే (2) |
21. తిప్పతీగెకు నారబట్ట కడితే వెలిచండ్రచెట్టు కనిపిస్తుందా? (6) |
24. రతిగారి పతి నొకసారి పిలవండి (3) |
25. పాముకు కోరల్లోనూ, తేలుకు కొండిలోనూ వీనికి ఒంటినండానూ విషమేనని సుమతీశతకకారుని ఉవాచ (3) |
26. ప్రౌఢ దేవరాయలు శ్రీనాథునికి చేసిన సన్మానము (7) |
నిలువు:
2. యావత్తు లేని సైన్యరచన (2) |
3. కరాటము (3) |
4. చిన్న తిరుపతి (7) |
6. కేశవీధి (3) |
7. మిక్కిలి సులభము (4) |
8. క్రిందినుండి పైకి చూస్తే మధ్యభాగం కనిపిస్తుంది (3) |
9. పేరు – తండ్రి పేరు – గోత్రము మొదలగువాని వివరములు – కొంచెం ముందు వెనుకగా (3) |
11. సామెత కథల ఆమెత – 28 లో అరుణ వాళ్ళ ఆయనను ఇలాగే వర్ణించింది – మీరు కాస్త మధ్యలో కొమ్మివ్వండి – అర్థం మాత్రం అదే (7) |
13. ఉత్తరహరివంశ రచయిత (6) |
15. మొదలు చివర మాత్రమే మిగిలిన భీముడి కొడుకు (2) |
19. విషవిశేషము – మొదట ఒకించుక తడబడింది (4) |
22. కోరికలను పూరించేదాని మొదలు చివరకెళ్ళింది (3) |
23. ఎటుచూసినా ఫేసే (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 జూలై 11 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 70 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 జూలై 16 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 68 జవాబులు:
అడ్డం:
1.దమనము 4. దరముద 7. దరదరక 9. మదము 11. ముదర 13. ముడి 14. శారద 16. ర్పము 17. యశోద 18. రదణ 19. దబ 20. ముదిమం 22. ముద 24. మిడుకు 26. దలుమ 27. దరహాసము 30. మునవద 31. దళపతి
నిలువు:
1.దరమము 2. నదము 3. ముర 4. దర 5. రకము 6. దస్తరము 8. దబర 10. దడియబడు 12. దర్పణములు 14. శాదము 15. దరమం 19. దమితము 21. దిసహా 23. దమయంతి 25. కుదవ 26. దముళ 28. రద 29. సద
సంచిక – పద ప్రతిభ 68 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కాళీపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.