బాలల కథలకు ఆహ్వానం – ప్రకటన

0
3

[dropcap]బా[/dropcap]ల సాహిత్య రచయితలు/రచయిత్రులకు ఓ విన్నపం.

6 నుండి 15 ఏళ్ళ వయస్సు గల పిల్లలు కోసం ఓ మంచి కథా సంకలనం ప్రచురించ దలచాను.

కథల్లో మూఢనమ్మకాలు, దెయ్యాలు, భూతాలు, లాంటివి ఉండకూడదు, ఇతరులకు సహాయం చేసే గుణం, దేశ భక్తి, పరమత సహనం, పెద్దల యెడ గౌరవం, తోటి వారి పట్ల అభిమానం, మొక్కలు, జంతువుల పై ప్రేమ వంటి మానవీయ అంశాలతో కూడుకున్న కథలు అయి ఉంటే పిల్లలు ఆసక్తితో చదువుతారు.

మీకు ఆసక్తి ఉంటే,  పై అంశాలు దృష్టిలో ఉంచుకొని, రెండు, లేదా మూడు పేజీల్లో ఉండేలా కథను వ్రాసి పంపండి, ఎలాంటి పారితోషికం చెల్లించబడదు.

20 కథలతో పుస్తకం ప్రచురణ అవుతుంది, కథల ఎంపికలో సంపాదకునిదే తుది నిర్ణయం.

అనుకున్న స్థాయిలో కథలు రాకపోతే, మళ్ళీ ప్రకటన ఇచ్చి కథలను కోరతాం.

కథా సంకలనంలో ప్రచురించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఓ ఒప్పుదల ఉత్తరం, కథ తమ స్వంతమేనని, దేనికీ కాపీ కాదని హామీ పత్రం తప్పనిసరిగా జతపరచండి.

కథలు తేదీ 31-07-2023 లోగా మాకు చేరాలి, ప్రచురణకు స్వీకరించిన వెంటనే సంబంధిత కథకునికి తెలియపర్చి, ప్రచురణ అయిన వెంటనే ఒక కాపీని రిజిస్టర్ పోస్ట్‌లో పంపగలము.

చిరునామా:

N. K. Babu,

24-8-1,

Sameera Residency,

Vizianagaram

535 002. AP.

ఫోన్: 8977732619

nkbabu.publisher@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here