తందనాలు-8

0
4

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

71
కరుణామయుడు బోళా శంకరుడు
చేరుకొనిరి ఆలయంలో ప్రజలు ప్రార్థన కొరకు
కరములు జోడించి ప్రార్థించిరి
కరుణ చూపించె శివుడు

72
శివ నామాలతో మారుమ్రోగింది ఆలయం
కావవే శంకరా అంటూ కొందరు
శివోహం అంటూ మరి కొందరు
శివ శివా అంటూ ఇంకొందరు ఆలపించిరి

73
కండలున్న బలవంతుడు
కొండలనైనా పిండి కొట్ట గల యోధుడు
అండదండలుంటే
మండపం లోని జనాన్ని ఒంటరిగానే అదుపు చేయగలడు

74
కంగు మని గంట మ్రోగె
చెంగు చెంగున పిల్లలు గంతులేసిరి
రంగంలోకి దిగిన అల్లరి పిల్లలు
రంగు రంగుల గాలిపటాల్ని ఎగుర వేసిరి

75
పచ్చిగా వున్న రోడ్డు మీద జారిపడ్డాం
చచ్చి చెడి బ్రతికి పోయాం
గుచ్చి గుచ్చి అడిగితె ఏం చెప్పం
వొచ్చి పోయే దారిలో జరిగిన ప్రమాదం గురించి

76
ఎందరో మునులు అడవిలో జపం చేస్తారు
కందమూలాలు తిని
మందలోని ఆవు పాలు త్రాగుతారు
వంద సంవత్సరాలు హాయిగా బ్రతకగలరు

77
కసిగా కావ్యం వ్రాశాడు
ప్రసిద్ధ కవులెందరో చదివిరి
వాసికెక్కిన కవి గురించి ఆలోచించ పనిలేదు
పసిడి పతకంతో సత్కరించిరి

78
వెట్టి చాకిరీతో విసిగి పోయాడు
తట్టి లేపాడు మనసుని
గట్టిగా ప్రయత్నించాడు విముక్తి కొరకు
వొట్టి మాటలతో లభించదని గ్రహించాడు

79
పారుచున్న నదిలో ప్రయాణించే నావ
కూరుకుపోయె ఇసుక తిన్నెలో
కోరుకున్న చోటికి చేర లేకపోయె
తిరుగు ప్రయాణమైరి వేరొక నావలో

80
కోరుకున్న వరుడు కనబడ లేదని
చేరుకున్నది కారులో ప్రియుని ఇల్లు
చూరుక్రింద దాక్కొని కనిపించె
కారులో తీసుకోని పొయె ప్రియుణ్ణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here