అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – జమైకా

0
4

[జమైకాలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు డాక్టర్ నర్మద రెడ్డి.]

[dropcap]జ[/dropcap]మైకాకి వెళ్ళాలనేది మావారి చిరకాలపు కోరిక. జమైకన్ సింగర్ Bob Marley పాడిన ఎన్నో ఫేమస్ పాటలు విని మావారికి జమైకా మీద చాలా ఇంటరెస్ట్ వచ్చేసింది.

జేమ్స్ బాండ్ సినిమాల రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ కూడా జమైకా దేశస్థుడు కావడం వల్ల జమైకా మీద మరింత ఆసక్తి కలిగింది. జమైకా పౌరులు చాలా స్నేహశీలురని విన్నాము.

మా అమ్మాయి మారథాన్ రన్ గురించి అమెరికా వెళ్ళాల్సి ఉంది. పనిలో పనిగా జమైకా కూడా చూసొద్దామని అనుకున్నాం. Jamaica, Aruba, Curaçao, Haiti, Cayman Islands, Puerto Maya Cruise (Mexico) మొదలైన ప్రాంతాలు దర్శించాలని క్రూయిజ్ బుక్ చేసుకున్నాం.

చరిత్ర, సంస్కృతి, సంగీతం, సాహిత్యం – క్లుప్తంగా:

స్థానిక టయనో ప్రజలు ఈ ప్రాంతాన్ని అరవాకన్ అనే భాషలో జమైకా అని పిలిచేవారు. జమైకా అంటే వృక్షభూమి, విలాసభూమి అని కూడా అర్థం. దీన్నే ‘ల్యాండ్ ఆఫ్ స్ప్రింగ్’ అని అంటారు. జమైకన్లు తమ ద్వీపాన్ని ‘Rock’ అని పేర్కొంటారు. Jamrock, Jamdown, Ja అనే మాటల తోటి ఈ దేశానికి ‘జమైకా’ అనే పేరు వచ్చింది.

క్రిస్టఫర్ కొలంబస్ 1404లో ఇక్కడికి ప్రవేశించారు. కొలంబస్ అక్కడికి వచ్చినప్పుడు, ఆ తరువాత ఎన్నో యుద్ధాలు, ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. ఒకరి తరువాత ఒకరుగా ఎంతమందితోనో పరిపాలించబడింది ఈ దేశం. స్పెయిన్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ వాళ్ళు జమైకా పై ఆధిపత్యం చెలాయించారు.

‘Reggae’ మ్యూజిక్ అనేది జమైకాలో చాలా ప్రసిద్ధం. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన Reggae Music అనేది అన్ని చోట్లా వ్యాపించింది. అందులో భాగంగా Reggae Music ఇక్కడికీ వచ్చింది. Bob Marley అనే అతను ప్రసిద్ధ గాయకుడు. ఇతను 1965లో ఒక ఆల్బమ్‍ను, 1971లో ‘The Best of the Wailers’ అని ఒక ఆల్బమ్‌ని విడుదల చేసాడు. 1977లో ‘Exodus’ ఆల్బమ్‌ని విడుదల చేసారు. అయితే 1981లో అతను ఒక జబ్బు తోటి మరణించాడు. అయితే 1984లో అతడి ఆల్బమ్స్ ‘ఆల్ టైమ్ రికార్డు’ గా 75 మిలియన్లు పైగా అమ్ముపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్‍లో రికార్డు అయిన వాటిలో 5 స్థానాలలో ఇది చేర్చబడింది. అందువలన జమైకా మ్యూజిక్ అంటే ప్రజలు అందరూ చెవి కోసుకుంటారు. 1984లో Bob Marley ని ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ తో జమైకా దేశం సత్కరించింది.

ఇయాన్ ఫ్లెమింగ్ అనే అతను ఒక రచయిత. ఈయన జేమ్స్‌బాండ్ థ్రిల్లర్స్ రచించాడు. ‘గోల్డెన్ ఐ’ అనే జేమ్స్‌బాండ్ సినిమా వచ్చింది. ఇది ఫ్లెమింగ్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందింది. జమైకాలో 15 ఎకరాల ఎస్టేట్ ఈ రచయితకు ఉంది. ఈ 15 ఎకరాల ఎస్టేట్ లోనే జేమ్స్ బాండ్ జన్మించాడు. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా అతను ఇక్కడ పుట్టినట్టుగా రాశారు. దాంతో జమైకా చాలా ప్రసిద్ధి చెందింది. జేమ్స్ బాండ్ సినిమాల వల్ల కూడా రచయిత ఫ్లెమింగ్ ప్రసిద్ది చెందాడు.

మేం చూసిన దర్శనీయ స్థలాలు:

మా క్రూయిజ్ ఇక్కడ అగగానే మేము మా ఫ్రెండ్స్ – కుమార్, అతని కొడుకు అయిన అమీష్, వాళ్ళ తమ్ముడు ఆనంద రెడ్డి – అయిదుగురము కలుసుకున్నాము. కుమార్ మాకు 40 ఏళ్ళ నుంచి పరిచయం. 82లో పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచి స్నేహితులం. అయితే మేము అందరం కలసి ఒక కారు తీసుకొని జమైకా చూడటానికి బయలుదేరాము.

మేము వెళ్ళిన ప్లేస్ “Ocho Rios”. ఇది జలపాతాలకి ప్రసిద్ధి. ఇది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. జలపాతాన్ని దర్శించి, మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాము.

మేము చూడాలనుకున్న ప్రదేశం Fern Gully. అక్కడ 500 రకాల ‘ట్రాపికల్ ప్రెర్న్’ (Tropical Fern) అనే వృక్షాలు చాలా ఉంటాయట. దారి మధ్యలో ఆ దేశం యొక్క పండు ‘అకీ’ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు డైవర్. నిజానికి నాకు తెలియకుండానే ఆ చెట్టు దగ్గర ఆపమని టాక్సీ అతన్ని అడిగాను. ఆ పండు ఎర్రగా మన సంత్రా లాగా ఉంది. కాని లోపల విత్తనాలు మాత్రం చాలా డిఫరెంట్‍గా ఉన్నాయి. స్థానికులు ఆ పండుని రుచి చూపించారు. ఇక్కడ నుంచి ఒక చర్చికి తీసుకెళ్ళారు మమ్మల్ని.

ట్రాఫికల్ ఫెర్న్:

ఫెర్న్ అనేది మన దగ్గర కూడా దొరుకుతుంది. ఇక్కడ 500 రకాలు ఉన్నాయట. ఈ ఫారెస్ట్‌లోకి మీరు వెళ్ళెచ్చని చెప్పి అక్కడి ఒక అబ్బాయి ఫారెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఇది ‘రెయిన్ ఫారెస్ట్’. ఇందులో లోపల టెక్కింగ్ చెయ్యాలన్నమాట. అయితే అక్కడ మాకేమో – “ఎక్కువ దూరం లేదండి మీరు చాలా ఈజీగా అరగంటలో వెళ్ళి రావచ్చు” అని చెప్పారు. “అబ్బ అరగంటే కదా వెళ్ళి చూద్దాం” అనుకుని బయల్దేరాం. ఇవి నేచరల్ ఏర్పడిన మెట్లన్న మాట. కొండపైకి వెళ్ళడానికి నేచురల్‌గా ఉన్న మెట్ల మీద నుంచి నడుస్తూ వెళ్ళాము. అక్కడకు వెళ్ళగానే అక్కడ ఒక 20 డాలర్లు ట్రెక్కింగ్‌కి తీసుకుంటున్నారు. ఒక గైడు ఉంటాడు, ఆ గైడు మనతో పాటు వస్తూ అన్ని చెప్తాడు. మొత్తం మన గ్రూప్‌కి 20 డాలర్లు అన్నాడు. సరే అలాగే అని నేను మా ఫ్రెండ్ కుమారుడు అమిష్, నేను మావారు ముగ్గురు వెళ్ళెదామని ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నాము. అయితే ఈ లోపల కుమార్ క్రిందనే ఉన్నాడు పైకి రాలేదు. నేను డాడిని అడిగివస్తానని మళ్ళీ రాలేదు. సరే మేమిద్దరం నేను మావారు కలసి ఆ ట్రెక్కింగ్‌కి వెళ్ళాము. అరగంట అన్న ట్రెక్కింగ్‌ నాలుగు గంటలు పట్టింది. అతడు కొండ పై వరకు నడిపించాడు. అంతా చెట్లు, చేమలు, బురద. సరైన చెప్పులు లేవు సరైన డ్రస్ కూడా వేసుకోలేదు. ఆ రోజు లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. అయితే కొద్ది దూరం వెళ్ళి తరువాత “మనము ఫాల్స్ చూడచ్చు” అని చెప్పి, “ఒక పెద్ద నది ఉంది, ఆ నది నుంచి అటు సైడుకి మనం వెళ్ళాలి అక్కడ చాలా ముఖ్యమైనవి ఉన్నాయి” అని చెప్పాడు. సరే ఎలా వెళ్ళతామని అడిగితే, అంత పెద్ద రివర్ పై నుంచి పడేటప్పుడు ఒక అంచు ఉంటుంది కదా, ఆ అంచు మీద మా ఇద్దరిని ఆ గైడు నడిపించాడు. నిజంగా నేను మళ్ళీ తిరిగివస్తానని అనుకోలేదు. నది భయంకరమైన ప్లోలో ఉంది. ఆ నీటి ప్రవాహము ఎంత స్పీడుగా ఉందంటే అంత స్పీడుగా ఉంది. అందులోనూ నేను లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను. ఆ వాటర్ అంత ఫ్రాక్ మీద పడి నన్ను కొట్టేస్తుంది. పైకి వెళ్లదామంటే పడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అప్పుడు ఆ ఫ్రాక్ పై వరకు లుంగీలాగా చుట్టేసి కట్టేసి నేను మావారు చేతులో చెయ్యి పట్టుకొని నడిచాను. అడుగు వేస్తున్నప్పుడు దేనిమీద అడుగు వేస్తున్నమో తెలియడం లేదు. ఆ రాళ్లు, రప్పలను దాటుతూ అవి చాలా లోపలకి ఉన్నాయి, మనకు ఏమి కనిపించదు కదా. వాటి మీద అలా అడుగు అడుగు వేస్తూ ఎంత టెన్షన్ పడ్డామంటే నేను ఇంత వరకు అంత పెద్ద టెన్షన్ ఎప్పుడు పడలేదు. అంత పెద్ద అడ్వెంచర్ రివర్‍ని మేము దాటుతామని నా కలలో కూడా నేను ఊహించలేదు. ఒకసారి అక్కడ నుండి దాటిపోతే, తరువాత మనము వేరే రూటులో క్రిందికి వెళ్ళిపోవచ్చు అని అతను చెప్పాడు. దాని కారణంగా మేము దాటాము. దాటిన తరువాత అతను అన్నాడు – “ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. అక్కడ వరకు వెళ్ళదాం!” అని. ఎంత దూరం ఉంది అంటే పక్కకే ఉంది, నిజంగా నేను కరెక్టుగా చెబుతున్నాను అన్నాడు. సరే అని ఆ వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళాము. అందరు ఫారినర్స్ చిన్న చిన్న బట్టలు వేసుకొని వాటర్ స్లిప్పర్స్ వేసుకొని ఎంతో పగడ్బందీగా అక్కడకు వచ్చి అవన్నీ దాటుతున్నారు, నీళ్ళల్లో దూకుతున్నారు. అది చూడచక్కని సుందర దృశ్యం. ఆ వాటర్ ఫాల్స్ కాని ఆ ఫారెస్ట్‌లో తిరగడం గాని అద్భుతం.

అక్కడి స్థానిక పళ్ళ చెట్లు ఉన్నాయి ఎన్నో ఎన్నో రకరకాలు. వాళ్ళు మందులకు ఏయే చెట్లు వాడతారో ఆ అబ్బాయి వివరిస్తూనే ఉన్నాడు. మన దగ్గర ఆయుర్వేద మందులు వాడుతున్నటుగా అక్కడ ఆకులు అలములు అన్ని కూడా ఎలా ఎలా ఉపయోగిస్తారో చెప్పుకొచ్చాడు ఆ గైడు.

జమైకన్స్ లోకల్ డ్రింక్ కూడా తయారుచేస్తున్నారు ఆ అడవిలో. కాని మేము ఏమి ముట్టలేదు. మాకు భయం వేసింది. అసలు అక్కడ అలా లోపలకి ఎలా వెళ్లామో మాకే తేలిదు. అంతా అడవి జాతి వాళ్ళు ఉన్నారు. అక్కడ అన్ని చూస్తూ అక్కడ చేతితో తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలు అమ్ముతున్నారు. అలాంటివి ఒక రెండు మూడు షాప్స్ కూడా ఉన్నాయి. అది అంతా చూసేసి అప్పుడు మేము ఇంక ఇంటికి వెళిపోతాం కదా, దిగుతాం కదా అనుకుంటే – లేదు మనం వెనక్కి వెళ్ళాలి అంటే మరల ఆ నదిని దాటాల్సిందే అని చెప్పాడు.

ఇంక అసలు మా గుండెల్లో బాంబు పడింది. అయ్యా బాబోయ్ ఇప్పుడు ఎలాగో వచ్చాము, మరల ఎలా దీన్ని దాటాలి అని అనుకున్నాం. అప్పుడు అతను “మీరు బాగా భయపడుతున్నారు” అన్నాడు. ఆ వాటర్ ఫాల్ ఎలా ఉందంటే నా మనసుకి నయాగరా వాటర్ ఫాల్స్‌ పైన అంచుల మీద మనం నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ అనుభూతి. నిజంగా నయాగరా అని చెప్పుకోవడం కాదు గాని ఇక్కడ కూడా ఒక్క చిన్న స్లిప్ అయినా, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఎందుకంటే ముగ్గురం చేతులు పట్టుకున్నాము, ఏ ఒక్కరు కాలు పట్టు తప్పిన కూడా ముగ్గురం పడిపోతాం. నిజంగా క్షణం క్షణం భయం భయం అని అతి భయంకరమైన ట్రెకింగ్ మాత్రం చేసాము. చాలా డేంజరస్ ట్రిప్. మరల అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నదిని దాటాము. ఆ నదిని దాటిన తరువాత ఆయన ఒకొక్క చెట్టు గురించి మరల చెప్పుతూ చెప్పుతూ క్రిందికి తీసుకువచ్చారు.

ఈ లోపల క్రింద ఉన్న కుమార్, అమిష్, ఆనంద రెడ్డి – ఈ ముగ్గురు అసలు వీళ్ళు ఏమయ్యపోయారు? జమైకా అబ్బాయి తీసుకెళ్ళి వీళ్ళను ఏమయినా చేశాడా, చంపేసాడా – అంత భయంకరంగా వాళ్ళు ఫీలయ్యపోతున్నారు. ఎందుకంటే అర్ధగంట అని చెప్పి వెళ్ళిన వాళ్లం నాలుగు గంటల తర్వాత వచ్చాం.

తిరిగి వచ్చేసరికి మేము తడిచి తడిచి ముద్దయ్యపోయాం. కిందకి వచ్చాకా, ఓ ఆశ్యర్యకరమయిన సంఘటన జరిగింది. “నిజంగా మీరు పిచ్చి స్లిప్పర్స్, పిచ్చి డ్రెస్స్ తోటి ఈ నదిని దాటటమనేది చాలా అద్భుతమమ్మా” అని చెప్పి ఒక చెట్టు ఆకులు, రెమ్మలతో తోటి చక్కటి కిరీటం తయారు చేసి నా నెత్తిన ఆ కిరీటం పెట్టాడు గైడు. ఈ రోజు ఇంత పెద్ద అడ్వంచర్ చేసారని నన్ను సత్కరించాడు. నాకు చాలా సంతోషం కలిగింది. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు అంతలాగా గౌరవించడం సంతోషమనిపించింది. కాని చాలా అమాయకులు. అందరూ చెప్పినట్టుగా ఎక్కడ కూడా మాకు ఏ మోసం కూడా జరగలేదు. చాలా ఫ్రెండ్లీ నేచర్! ఇక అక్కడ నుంచి వచ్చిన తరువాత అందరితో కలసి ఆ బ్లూహోల్ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకున్నాము.

వైట్ రివర్ రాఫ్టింగ్:

తరువాత మేము వైట్ రివర్ రాఫ్టింగ్ అనే ప్లేస్‌కి వెళ్ళాము. ఆ వైట్ రివర్ మీద అంటే ఆ నదిపైన ఒక పది వెదురు బద్దలు వేసి తడకలాగా అంటే బిల్డింగ్ కనెక్షన్ తటకలాగా కడతారు. అలాంటి తడకలు లాగా కట్టి దాని మీద కూర్చోబెట్టి ఆ రాఫ్టింగ్‌కి తీసుకెళుతున్నారు. అది చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అది కాకుండా పడవలు కూడా ఉన్నాయి. ఇలాంటివే సేమ్ ‘ఫిజి ఐలాండ్స్’లో కూడా ఉన్నాయి. కానీ అక్కడ చాలా పెద్ద తెప్ప పడవ. అంటే పడవలాగా ఏమి ఉండదు. అన్ని వెదురు కట్టెలుతో చేసిందే. అంటే 30 x 30 ఫీటు దాని కట్టి ఆ నదిలో వేసారు. కాని ఇక్కడ ఓన్లీ ఒక 10 వెదురు కట్టెలు ఉంటాయి. ఆ పది వెదురుకట్టెల మీద కూర్చుబెట్టి నీళ్ళలో తీసుకెళ్ళుతున్నారు. అంటే మనం ఊహించుకోవచ్చు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా పడుతుందో తెలీదు. అది చాలా నాటు పద్ధతి అనుకోవాలి. కాకపోతే అందరు స్విమర్స్ వెళ్ళతారు కాబట్టి ఏమీ కాదు. అలా ఒక వేళ పడిపోయినా కూడా వాళ్ళు మళ్ళా వెదురు కట్టెల తెప్పని పట్టుకొని పైకి ఎక్కుతారు. కానీ నాలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చనిపోతారు. అయితే అక్కడ ఒక ఫోటో దిగాను. పడవలో కూడా వెళ్ళాం కాని తెప్పల్లో వెళ్ళలేదు.

అక్కడ ఇదంతా చూసిన తరువాత మేము క్లబ్‌కి వెళ్ళాం. ఆ క్లబ్ ఒక కొండ చిటారు అంటే కొండ చివరన అంచులో ఎత్తులో ఉంది. అక్కడో హోటల్ లాంటిది ఉంది. అది  పెద్ద హోటల్ కాదు, ఒక చిన్న రెస్టెరెంట్. టీ, కాఫీ తాగచ్చు. మేము అక్కడ కాఫీ తాగేసి ఆ పై నుంచి వ్యూ పాయింట్ చూసాము. క్రింద వరకు కంట్రీ అంతా కనిపిస్తుంది. ఇక్కడ జమైకన్స్.. పూసలు, ఇంకా వాళ్ళు చేత్తో చేసిన శాలువాలు అమ్ముతున్నారు. టోపీలు ఇవన్నీ చూస్తూ మళ్లా కిందికి వచ్చాము.

అక్కడ నుంచి మేము వైట్ అండ్ సాండ్ బీచ్ చూశాం. తరువాత డాల్ఫిన్-కో అనే స్థలానికి వెళ్ళాము. ఆ డాల్ఫిన్-కోలో డాల్ఫిన్స్ చాలా ఉన్నాయు. అక్కడి డైవర్స్ వచ్చిన టూరిస్టులందరికి వాటి విన్యాసాలు చూపించారు. ఆ విన్యాసాలను చూసి అక్కడ నుంచి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక గోడమీద ఒక సింగర్ ఫోటో పెయింట్ వేసి ఉంది. అక్కడకు వెళ్ళి ఒక ఫోటో దిగాను. అప్పటికి మా టైము అయిపోయింది.

ఎన్ని చూసినా, నా మనసులోంచి జమైకా అడవి దూరం కావడం లేదు. దాని గురించి చెప్పాలంటే నిజంగా ఎంతో కష్టం. వర్ణించడానికి సాధ్యం కాదు.

Nature Black Hole గురించి విన్నాను కాని కనులారా కాంచడం ఓ అద్భుతమైన అనుభూతి.

ఆకులో ఆకునై పూవులో పూవునై – అందని అందలాలకు సాగిపోనా అని పాడుకుంటూ జమైకా నుండి తిరిగి వచ్చాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here