విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-22

0
4

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

Peter Keating vs Anantha Rama Sharma

[dropcap]స[/dropcap]రిగ్గా ఈ ట్రాన్సిషన్ సీన్లతో అనంతరామ శర్మ పతనానికి నాంది పలికాక, కే. విశ్వనాథ్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడు. మన గంగాధరానికి వాళ్ళ అమ్మ దిష్టి తీస్తుంది. తరువాత మొదట దేవుళ్ళ విగ్రహాలు చూపిస్తాడు. ఆపైన గంగాధరం achievements పేపర్ కటింగ్‌ల రూపంలో, ఆ పైన త్యాగరాజ స్వామి పటం (వారి చిరు హోటల్‌లో బైట నుంచీ వస్తుంటే ఎదురుగా కనిపిస్తుంది), next.. కుక్కపిల్లను పట్టుకుని సాక్షి రంగారావు, ప్లస్ మమ్ముట్టి (అనంతరామ శర్మ) నడక చూపిస్తారు. అక్కడ మమ్ముట్టి అభినయం అద్భుతం.

అసూయ!

బైటపెట్టలేడు.

స్నేహితుడు గంగాధరాన్ని పొగుడుతున్నాడు.

కాదనలేడు.

గంగాధరం సహజ ప్రతిభను ఆకాశానికెత్తేస్తున్నాడు.

భరించలేడు.

కోపం వస్తుంది.

ప్రదర్శించలేడు.

ఎక్కడ చూసినా గంగాధరం గంగాధరం గంగాధరం. గంగాధరం.

కొందరు వైష్ణవులు శివ నామస్మరణ భరించలేరంటారు. అటు ఇటు కూడా నిజమే.

అలా అనంతరామ శర్మ గంగాధరం అనే మాటను కూడా సహించలేని స్థితికి వచ్చేస్తాడు.

చిత్రమైన విషయమొకటి చెప్పుకోవాలిక్కడ.

అక్కడ త్యాగబ్రహ్మ పటం నుండి ఈ సన్నివేశానికి తీసుకు రావటం! ఎందరో మహానుభావులు పాడిన త్యాగరాజ స్వామిని అక్కడి పెద్దలు మెచ్చుకున్న చందాన ఇక్కడ అనంతరామ శర్మ స్నేహితుడు గంగాధరాన్ని పొగుడుతాడు. వారు విద్వద్విద్వాంసులు కనుక పొగడ్త measured గా ఉంది. ఇక్కడ మామూలు మనిషి కనుక ఆ పొగడ్త హద్దుదాటింది. నిజానికక్కడ మామూలు మనిషి అనంతరామ శర్మ. He’s becoming selfless.

ఇప్పుడా స్నేహితుడు గంగాధరం talent ను శంకర భగవత్పాదుల వారితో పోలుస్తాడు.

ఆయన లాగనే గంగాధరం అల్పాయుష్షు కలిగిన వాడు. అతని అసువులు బాయబోయే వ్యక్తికే గంగాధరం గురించి శంకరులతో పోల్చి చెప్పటం!

Hard creativity. Black humour.

కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టేస్తుంది. Washed away.. గౌరవంగా తప్పుకో!

ఇవీ ఆ స్నేహితుడి మాటల సారాంశాలు. మమ్ముట్టి నటన అక్కడ శిఖరాయమానమైంది. సాక్షి రంగారావు మాటల్లోనే చెప్పాలంటే..

అమ్మమ్మమ్మా! మాటలు చాలవనుకోండీ!

అనంతరామ శర్మ రగిలిపోతుంటాడు. నడుస్తున్నవాడు ఆగి కూర్చుంటాడు. ఇంకా పొగడ్తలు వినలేక లేచి పోబోతున్నవాడిని ఆపి మరీ చెప్తాడు.

నీ శకం ముగిసింది. ఇక మర్యాదగా తప్పుకో! గౌరవం కాపాడుకో!

చెప్పింది ఎవరి గురించి?

ఏ పిల్లాడికైతే తాను సంగీతం స్కాలర్షిప్ రాకుండా అడ్డపుల్ల వేయగలిగాడో ఆ పిల్లాడి గురించి.

ఎవరు చెప్పింది? ఎవరి ముందైతే తన అధికారాన్ని, తన స్థాయిని ఉపయోగించి గంగాధరానికి అడ్డుకట్టవేయబోయాడో ఆ వ్యక్తి.

అక్కడ background score అద్భుతం. అనంతరామ శర్మ మానసికంగా కుంగిపోతాడు. He resigns himself to his fate. He’s facing someone who’s out of his range talent-wise. మనసు నరకమైపోతుంది. క్షణం కూడా ఊపిరిసలుపుకోనివ్వదు. బాధ. అభద్రత. అసూయ. అహంకారం. అన్నీ! అన్నీ మీదపడతాయి. లోపలి నుంచీ ప్రతికూల భావావేశం బుసలు కొట్టేలా చేస్తాయి.

ఇక్కడ అనంతరామ శర్మ తన అసూయను dissect చేసి ఉండవచ్చు. అలా తన హోదాను, పెద్దరికాన్ని కోల్పోకుండా గంగాధరానికి దారి ఇచ్చి అతనికి గురుస్థానంలో నిలువ వచ్చు. కానీ అసూయ చాలా బలవత్తరమైన ఎమోషన్. దానికి negative side తప్ప పొరబాటున కూడా పాజిటివ్ సైడ్ ఉండదు. ఒక్కసారి కీరా నైట్లీ మాటలు గుర్తుకు తెచ్చుకోండి.

***

అసూయ అనేది ఒక సహజమైన మానవ భావోద్వేగం. అయితే, అది ఎంతో హానికరం. అలా కాకుండా ఉండటానికి, అసూయను ఆరోగ్యకరమైన మార్గంలో ఎదుర్కోవడం ముఖ్యం. అసూయను ఎదుర్కోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.

మొదట అసూయను అంగీకరించాలి.

అసలు పీటర్ కీటింగ్‌కు చివరి వరకు తనకు Oward Roark మీద ఉన్నది అసూయ అన్నది తెలియదు. అసలు ఆ మాత్రం తెలియని వాడే కనుక అసూయను వెళ్ళగక్కచాన్కి కూడా భయపడేవాడు. కనుక అసూయను అంగీకరించటం అనే ప్రశ్నే లేదు. As Rand herself said, Keating is a man who doesn’t know that he could never be.

కానీ అనంతరామ శర్మకు తనకు గంగాధరం మీద ఉన్నది అసూయ అని తెలుసు. పైగా ఆయన కూడా విద్వాంసుడు కూడా. ప్రతిభాపాటవాలు కూడా తక్కువేమీ కాదు. కానీ అసూయను గుర్తించాడు కానీ అంగీకరించలేదు. అసూయను ఒక సానుకూల భావోద్వేగంగా భావించ కూడదు. దాన్ని పారద్రోలాలి. అది ఇద్దరూ చేయలేదు. అసూయను అంగీకరిస్తే రెండు ప్రయోజనాలు. మీరు కష్టపడుతున్నారని మరియు, మీరు మీ స్వంత జీవితం గురించి ఆందోళన చెందుతున్నారని తెలియజేస్తుంది. పైపెచ్చు మీరు దానితో పోరాడటం ప్రారంభించవచ్చు.

అసూయకు కారణం ఏమిటో గుర్తించాలి.

మీరు ఎందుకు అసూయపడతారో మీకు తెలిసిన తర్వాత, దానిని ఎదుర్కోవడం ప్రారంభించవచ్చు. మీకు ఏమి కోల్పోయారో, కోల్పోతున్నారో తెలియాలి. Roark shine అయితే తన ఆటలు సాగవు. పైగా తనకు Roark చేసిన సహాయం గురించి ఇతరులకు చెప్తాడు ఏమో అని భయం. దానివల్ల తన పేరు పోతుందని ఆందోళన. ఇక్కడ అనంతరామ శర్మకు తన ప్రాభవం పోతుందని, గంగాధరం తనను మించిపోతాడని భయం కలుగుతుంది ఆ నడక సన్నివేశంలో. గంగాధరం ముందరి కాళ్ళకు బంధం వేస్తాడు అనంతరామ శర్మ.

స్వంత బలాలను గుర్తుంచుకోవాలి.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో గొప్పగా ఉంటారు. అనంతరామ శర్మ గురువుగా రాణించగలడు. అసూయను పక్కనపెట్టి గంగాధరాన్ని కొడుకులా ఆదరిస్తే అతని తండ్రి స్థానంలో ఉంచి అతని విజయాలను ఆస్వాదించవచ్చు. కానీ అలా చేయలేదు. ఈమాత్రం విచక్షణ కూడా లేదు కనుక పీటర్ కీటింగ్‌కు ఆ అవకాశం కూడా లేదు. పైగా తన బలం అయిన లేదా అనుకుని నమ్మిన పెయింటింగ్ కూడా అతని చేయి దాటి వెళ్ళిపోయింది. మీ స్వంత బలాలను గుర్తుంచుకోవడం ద్వారా, మీరు ఇతరులతో పోల్చుకోకుండా మీకు మీరుగా గుర్తింపు పొందవచ్చు. కనీసం ఒక appreciator గా. ఊఁహూఁ. ఇద్దరికిద్దరూ ఆ పని చేయలేదు.

చేసే పనులపై దృష్టి పెట్టాలి.

మీరు ఇతరులపై దృష్టి పెడితే, మీరు ఎల్లప్పుడూ వారిని మించాలనో దెబ్బకొట్టాలనో ఆలోచనలు రావచ్చు. కానీ if you don’t think about others like Howard Roark, (he says ‘but I don’t think of you’) అని Ellsworth Toohey తో అన్న విధంగా ఉండగలిగితే అంతకన్నా ప్రశాంతత ఇంకోటి ఉండదు. అనంతరామ శర్మ గణపతి సచ్చితానంద స్వామి ఇచ్చిన పనిలో నిమగ్నమై, తాను బరువు ఎత్తలేని చోట గంగాధరం సహాయం తీసుకుని, అతనిని పైకి తెచ్చి ఉంటే..! అటువైపు దృష్టి పెట్టలేదు.

సహాయం చేయమని అడగాలి!!!

పీటర్ కీటింగ్ ఎవరిని అడగాలి? Roark ను. కానీ how can anyone take the advice of the adversary when they themselves feel superior to the adversaries. అందుకే అడగలేదు. అడగకుండా వారికి వారి vanity అడ్డొచ్చింది.

ఇంతలో ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి తీశాను.

ఎదురుగా అనంతరామ శర్మ గారు!!

గర్జించలేదు. మృదువుగా నవ్వుతూనే అన్నారు.

“నీ విజయ విశ్వనాథమ్ గాడి తప్పుతోంది.”

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here