వ్యక్తిత్వం నగ కాదు

0
3

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘వ్యక్తిత్వం నగ కాదు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]దిలో పడిన రాయి నలిగి నలిగి
సాలగ్రామం అవుతుందట
అలాగే –
ఎంతో వైవిధ్యమైన నేపథ్యంలో
పెరిగిన తరువాత కూడా
సానదేరితే తప్ప
విశిష్టమైన వ్యక్తిత్వం అలవడదు.
వ్యక్తిత్వమన్నది అలంకారం కాదు
చిన్ననాటి నుండి
క్రమక్రమంగా రూపుదిద్దుకునేది
కారణం ఏదైనా –
అటువంటి దాన్ని ప్రక్కన పెడుతూ
బ్రతకవలసి రావటమంటే –
కర్ణుడు కవచకుండలాలని పెకిలించి
దానం చేసినట్లే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here