బాటసారి

0
4

[మాయా ఏంజిలో రచించిన ‘The Traveler’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(తోడు లేని జీవితంలో ఇల్లు గుహలాగా, ఎంతకీ గడవని రాత్రిళ్ళు పొడవైనట్టుగా, ఒంటరితనం భరించరానిదిగా అనిపిస్తుంది, అయినా బ్రతుకు ప్రయాణం తప్పదు. ఒకానొక అంతర్ముఖీన స్థితిని ఒక కోల్పోయిన తనాన్ని, కనిపించని దుఃఖాన్ని చిత్రించిన శక్తివంతమైన కవిత!)

~

[dropcap]తె[/dropcap]లిసీ తెలియని దారులు
గడిచిపోయిన కాలాలు
ఒంటరి దీర్ఘ రాత్రులు
సూర్యకిరణాలు
పోటెత్తే సముద్రపు అలలు
ఇంకా
కొన్ని నక్షత్రాలు మరిన్ని శిలలు

మగతోడు లేదు
స్నేహితులు లేరు
గుహ లాంటి నా ఇంటిలో
ఇదీ నేను పడే హింస
ఇవీ
నా ఒంటరి
సుదీర్ఘ రాత్రులు!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


1928 ఏప్రిల్ 4వ తేదీన మార్గరెట్ ఆన్ జాన్సన్‌గా ఈ ప్రపంచంలోకి వచ్చిన మాయా St. Louis, Missouri లో జన్మించింది. తల్లిదండ్రుల ఒడిదుడుకుల వివాహం, తత్పరిణామంగా వారు విడాకులు తీసుకోవడం, వారినుంచి  దూరంగా  ఉండాల్సి రావడం అతి చిన్న వయస్సులోనే తనపైన జరిగిన అత్యాచారం-తన ప్రమేయం ఏమీ లేకుండానే కఠినమైన బాల్యాన్ని గడిపింది మాయా. కుటుంబ పరిస్థితుల వల్ల బాల్యంలో తన అమ్మమ్మ దగ్గర పెరిగింది. మాయా కంటే పెద్దవాడైన సోదరుడు ముద్దుగా ‘మాయా’ అని పిలిచేవాడు. తన ఏడేళ్ళ వయస్సులో తిరిగి తల్లి దగ్గరికి చేరుకున్న మాయాపై తల్లి బాయ్ ఫ్రెండ్ అత్యాచారం చేసాడు.

అత్యాచారం చేసిన వ్యక్తి జైలు నుంచి విడుదల అయిన నాలుగు రోజులకే తల్లి సోదరుడు అతన్ని కొట్టి చంపేసాడు. తన స్టేట్మెంట్ ఒక వ్యక్తి మరణానికి దారి తీసిందన్న అపరాధ భావనతోనే ఆరేళ్ళపాటు తాను  మూగబోయానని ఒక చోట రాసుకుంది.

టీనేజ్ లోనే మాయా గర్భం దాల్చడాన్ని మాయా తల్లి వివియన్ ఖండించక పోగా మరెంతో సహకరించింది.. ఆమె తన కూతురి మాతృత్వ భావనను, కాంక్షను నమ్మింది, గౌరవించింది. కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవడం తన మొట్టమొదటి కర్తవ్యంగా ఆమె భావించింది.

మాయా తన తల్లి వైవాహిక జీవితంలో ఎన్ని వైఫల్యాలున్నప్పటికీ  తల్లి నిజాయితీని, వెనుకంజ వేయని తనాన్ని, ఆమె సంరక్షణా తీరుని చూసి గర్వపడేది.

హైస్కూల్ చదువు తరువాత మరిక చదువుకోలేదు మాయా. మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కార్ కండక్టర్‌గా పనిచేసింది. 1954 నుంచి 1955 వరకు Porgy and Bess అనే ఓపెరా నాట్య ప్రోగ్రాములు చేసే ట్రూప్‌తో కలిసి యూరప్‌లో పర్యటించింది. 1957లో Calypso Lady అనే తన మొదటి డాన్స్ ఆల్బంని రూపొందించింది. 1958లో న్యూయార్క్‌కి మారిపొయ్యి, అక్కడ  1950లో ఆఫ్రికన్ అమెరికన్ రచయితల కొరకు నెలకొల్పిన Harleem Writers Guild  అనే ఆర్గనైజేషన్ లో చేరింది. న్యూయార్క్ లోని Brooklyn లోని ఒక అత్యంత నిరాడంబరమైన నివాసాల సముదాయంలో తన మొదటి అపార్ట్మెంట్ తీసుకుంది. కొంతకాలం తర్వాత తన నివాసాన్ని activist లు, సంగీతకారులు, నృత్యకళాకారులు, కవులు, రచయితలు, థియేటర్ కళాకారులు అందరూ కలుసుకునే సమాహార స్థలిగా మార్చింది. అక్కడ అతిథులు పాటలు పాడేవాళ్ళు, ఆడిపాడేవాళ్ళు. భోజనం, మద్యం సేవించి రాత్రింబవళ్ళు అక్కడే గడిపి చిందులేసేవాళ్ళు. రచయితలు వారి మొదటి ప్రచురణల ఆనందాన్ని చవిచూసేవారక్కడ. మేము ఆనందిస్తూ ఇతరులను ఆనందింపచేసాం ఆ రోజులలో అని Ms. Meriwether అనే ట్రూప్‌కి చెందిన కంపోజర్ ఒక చోట రికార్డు చేసారు. ‘అదొక గొప్ప సమయం, నవ్వులు, ఉత్సాహం, సక్సెస్ విరజిమ్మిన కాలమది’ అని చెప్పేది మాయా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here