గుజరాత్ లిప్పన్ ఆర్ట్

0
3

[గుజరాత్‍కి చెందిన ‘లిప్పన్ ఆర్ట్’ గురించి వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్ ఈ రచనలో.]

[dropcap]లి[/dropcap]ప్పన్ ఆర్ట్ లేదా మడ్ మిర్రర్ ఆర్ట్ అనేది రాష్ట్రానికి చెందిన కళ. ఇటీవల గుజరాత్ రాష్ట్రాన్ని చూడటానికి వెళ్ళాను. అక్కడ గాంధీజీ పాద ముద్రలలో పాటు ఆ రాష్ట్ర సాంప్రదాయ కళల్ని కూడా చూశాము. మేము వెళ్ళిన జాతీయ పిల్లల వైద్య నిపుణుల సమావేశంలో అక్కడి సంస్కృతి కళలకు సంబంధించిన స్టాల్స్ ఎన్నో పెట్టారు. వాటిలో ఈ లిప్పన్ ఆర్ట్ యొక్క స్టాల్ కూడా ఉన్నది. మట్టితో తయారయే కళా రూపాల్ని,  గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇళ్ళను అలంకరించుకోవడానికి తయారు చేసుకుంటారు. ఈ లిప్పన్ ఆర్ట్‌కు  గుజరాతీ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం పేరు. మా చిన్నప్పుడు ఎంతో గొప్పగా నేర్చుకున్న ‘కచ్ వర్క్’  ఈ ప్రాంతందే అని తెలుసుకునేసరికి ఎంతో ఆనందమేసింది. కచ్ వర్క్ నేర్చుకుంటే కుట్లు కుట్టటంలో బీఏ పాసయినట్లే. కచ్ వర్క్ అంతే, అంత కష్టంగానూ, అంత గొప్పగానూ చెప్పుకునేవారు లిప్పన్ ఆర్ట్‌ను మట్టి, ఆవుపేడ కలిపి ఇళ్ళగోడను అందంగా తీర్చిదిద్దుతారు.

లిప్పన్ ఆర్ట్‌లో బేస్‌గా వాడటానికి అట్ట ముక్కలు, మందపాటి ఎమ్.డి.ఎఫ్ బోర్టుల్ని ఉపయోగిస్తాము. బాగా మందంగా ఉన్న ఏయే ఎమ్.డి.ఎఫ్ బోర్డును నలుచదరంగా కత్తిరించుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డుపై మనకు నచ్చిన డిజైనను గీసుకోవాలి. మొదట పెన్సిల్‌తో గీసి ఉంచుకుంటే దానిపై మట్టి విశ్రమంతో గీతలు గీసుకోవచ్చు. పూర్వకాలపు వారు మట్టి, పేడల మిశ్రమం వాడినప్పటికీ ఈ కాలంలో మనం వాల్ పుట్టీ పౌడర్‌ను వాడవచ్చు. వాల్ పుట్టీ పౌడర్‌ను తెచ్చుకుని దానిలో ఫెవికాల్‌ను కలిపి ముద్దగా చేసుకోవాలి. ఇంకొంచం మెత్తగా పైన్‌గా రావడానికి రెండు చుక్కల నీరు, మరో రెండు చుక్కల నూనెను కలపాలి. కోన్‌లో నంచి జారెలా కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి అంటే గోరింటాకు కోన్‌ను తయారు చేసినట్లుగా, ప్లాస్టిక్ కాగితపు కోన్‌లో వాల్ పుట్టీ  మిశ్రమాన్ని నింపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ గజిబిజి లేకుండా సులభమైన గీతల డిజైన్‌ను వెసుకుని, దానిపై కోన్‌తో మిశ్రమాన్ని దిద్దాలి. ఇది పూర్తిగా ఎండినాక రంగులు వెయ్యాలి. రెండు మూడు రంగులు డిజైన్‌గా వేసుకోవాలి. రంగులు వేయటం పూర్తయ్యాక అద్దాలు అతకించాలి. గుండ్రం, నలుచదరం, డైమండ్ ఆకారాల అద్దాలను అందంగా అతికించి కళాకృతిని కనువిందుగా మలుచుకోవాలి.

వాల్ పుట్టీతో పాటు ఏమ్ సీల్ కూడా ఉపయోగించవచ్చు లేదంటే పాపుల్లో దొరికే శిల్పకార్ క్లేను కూడా వాడవచ్చు. ఆర్ట్స్ షాపుల్లో క్లే పౌడర్ దొరుకుతుంది, రక రకాల కంపెనీల మట్టి దొరుకుతుంది. వీటిలో ఏదైనా వాడవచ్చు. మేము దిగిన హోటల్‌లో కూడా ఈ మట్టి ప్రేములు ఎన్నో అలంకరించబడ్డాయి. ఎయిర్‌పోర్టు లోనూ ఈ మట్టి కళాకృతులు ఎన్నో కనిపించాయి. వాల్ పుట్టీ మిశ్రమాలకు రంగులు వేసి కూడా వాడవచ్చు. దీని కోసం యాక్రిలిక్ రంగునో వాడవచ్చు. లేదంటే పుడ్ కలర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి రంగుల మట్టితో ప్లాస్టిక్ డబ్బాలు, సీసాల మీద కూడా డిజైన్లు వేయవచ్చు. రంగుల మట్టిలో మెటాలిక్ రంగుల్ని లేదా మెరుపుల్ని కూడా వాడితే బాగుంటుంది. హార్లిక్స్ డబ్బాలకూ ఈ డిజైను వేసుకుంటే అందంగా ఉంటుంది. రంగుల పుట్టీ కోన్ లతో చుక్కలు, గీతలు గీసుకున్నట్లుగా డిజైన్ వేసుకోవచ్చు. హార్లిక్స్ డబ్బానే కాదు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలను వాడుకోవచ్చు. రంగు రంగుల మట్టిలో డిజైన్లు వేశాక అద్దాలు అతికించుకోవచ్చు. దీనిలో పూలు పెట్టుకుని పూల కుండీగా వాడుకోవచ్చు. లేదంటే టీపాయ్ మీద అందంగా అలంకరించుకోవచ్చు.

కొన్ని పెద్ద ప్రేములను చేసుకునేటపుడు కోన్లు తయారుచేసుకోనవసరం లేదు. పిండి మిశ్రమం కలుపుకున్నాక పక్కన పెట్టుకుని చేత్తో బండమీద తాల్చుకోవాలి తాళ్ళను వేసినట్లుగా. సన్నగా చేత్తో పాలతోకలు చేసినట్లుగా చేసుకోవాలి. ఒకేవిధంగా ఉండేలా తాడులా షేనినాక బోర్డు మీద పెన్సిల్ గీత వెంబడి అతిరించుకుంటూ పోవాలి. చివర్లు కత్తిరించడానికి చిన్నకత్తి వాడాలి. దీనికి కావాల్సిన టూల్స్ కూడా షాపుల్లో దొరుకుతాయి. మొత్తం డిజైన్ పూర్తయ్యాక గీతల వెంట అతికిన తాడు మీద సన్నగా గాట్లు పెట్టుకోవాలి. టూత్ పిక్స్, ఫోల్ సేప్స్, నీడిల్ వంటివి వాడితే మెలి బెట్టిన తాడు లాగా డిజైను వస్తుంది. మనకు నచ్చినట్లుగా డిజైన్లు చేసుకోవచ్చు. రంగులు వేసుకోవాలి. అద్దాలు కూడా అతికించి గుజరాత్ గ్రామాల్లో మట్టితో పాటు ఒంటె పేడను కూడా కలుపుతారు దీనివల్ల ఇంటిలోపల చల్లదనంగా ఉంటుంది. ఇది ప్రధానంగా లోపలి గోడలకు పరిమితమైనప్పటికీ, వెలుపలి గోడలపై కూడా కళాకృతులు వేసుకుంటారు.

ఈ లిప్పన్ ఆర్ట్‌ను ఆకుల మీద కూడా వేయవచ్చు. ఆకులను బాగా ఎండబెట్టి దానిమీద ఈ ఆర్ట్‌ను దేవేవచ్చు. మామిడి, బాదం, రావి ఆకులను పేపర్ల మధ్యలో ఎండబెట్టాలి ఎండాక దాని మీద సులభమైన డిజైన్లు వేసుకుంటే బాగుంటుంది.

మొదటగా ఆకుకు పూర్తి ఆకుపచ్చ రంగును వేసుకోవాలి. రంగుతో నింపాక కోన్‌లో సన్నగా డిజైన్లు వెయ్యాలి. దీనికి మరల రంగులు వెయ్యడం కష్టం కాబట్టి రంగుల మట్టి కోన్లు వాడితే బాగుంటుంది. నాలుగైదు రంగుల కోన్లు తయారుచేసి ఉంచుకుంటే బాగుంటుంది. కోన్ల చివరి భాగం గాలి పోకుండా జాగ్రత్తగా అతికించుకోవాలి. వాడేటప్పుడు చివర్న కత్తిరించాలి. ఏ మాత్రం గాలి దూరినా మొత్తం కోన్ ఎండిపోతుంది, ఇలా ఆకు మీద డిజైను వెరైటీగా ఉంటుంది.

మందపాటి జనపనార షీట్లపై లిప్పన్ ఆర్ట్ వేయవచ్చు. ఆర్ట్‌లో రకరకాల డిజైన్లు వేసినట్లుగా, బేస్‌లో కూడా రకరకాలుగా పెట్టుకోవచ్చు. మందపాటి గోతం సంచిని ఫెవికాల్ కలిపి ఎండబెడితే వంగిపోకుండా గట్టిగా ఉంటుంది. దీనిపై మట్టి కోన్‌లో డిజైన్లు వేసుకోవచ్చు. ఇంకా మట్టి మిశ్రమంతో జువెల్లరీ కూడా చేసుకోవచ్చు. నెక్లెస్ లాగా కూడా చేసుకోవచ్చు ముందు చిన్న ఉంగరం చేసుకుందాం. పుట్టీ మిశ్రమాన్ని గుండ్రంగా చేత్తో తాల్చినాక చప్పగా అణగగొట్టినట్లుగా చేయాలి. చిన్న స్కేలుతో నొక్కితే చప్పగా అణుగుతుంది. దీనిని గుండ్రంగా వేలుకు చుట్టుకొని గుండ్రంగా చేసి దానికి రంగులు వేయాలి. గుండ్రని ఉంగరానికి డిజైన్లు వేసి ఆరనివ్వాలి. ఇలా సరదాగా ఉంగరాలు చేసి పెట్టుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here