[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ‘మాయాబజార్’ (1957) చిత్రంలో ‘అహ నా పెళ్ళంట’ పాటను పి. సుశీల పాడగా, మధ్యలో పురుష గొంతు వస్తుంది. ఆ కంఠధ్వని ఎవరిది?
- చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రానికి ఆధారం అయిన హిందీ చిత్రంలో అనిల్ కపూర్, అమృతా సింగ్, రాఖీలు నటించారు. ఆ సినిమా పేరు?
- శశికపూర్ నటించిన హిందీ చిత్రం ‘ఫకీరా’ను తెలుగులో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణతో రీమేక్ చేశారు. ఆ తెలుగు సినిమా పేరు?
- తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై గారు ఏ తెలుగు చిత్రానికి కథను సమకూర్చారు? ఈ సినిమాలో ఎన్.టి.ఆర్., అంజలీదేవి, జగ్గయ్య, జమున, రామశర్మలు నటించారు.
- హిందీలో గురుదత్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్యాసా’. మాలాసిన్హా, వహీదా ప్రముఖ పాత్రలు. ఈ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబు, జయసుధ, లక్ష్మితో ఏ పేరున రీమేక్ చేశారు? వహీదా పాత్రను తెలుగులో ఎవరు చేశారు?
- అడ్వకేట్ ఉమామహేశ్వరరావు (1940) కె.వి. నాగేశ్వరరావు (1965), శోభన్ బాబు (1981) ల చిత్రాల పేర్లు ఒకటే. ఆ సినిమా పేరు?
- హిందీలో శశికపూర్, షర్మిలా టాగోర్ నటించిన ‘ఆ గలే లగ్ జా’ చిత్రం తెలుగులో శోభన్ బాబు, మంజులతో రీమేక్ అయింది. తెలుగు సినిమా పేరు?
- విలన్ త్యాగరాజు (పగడాల త్యాగరాజు నాయుడు) నటించిన మొదటి చిత్రం ఏది?
- జూపిటర్ పిక్చర్స్ వారి ‘మర్మయోగి’లో ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ పాటని దర్శకులు బి.ఎ. సుబ్బారావు గారు తెర మీద గుమ్మడితో పాటు ఏ నటిపై చిత్రీకరించారు?
- కన్నడంలో ఉదయ్ కుమార్, జమునలతో; తమిళంలో శివాజీ గణేశన్, జమునలతో బి.ఆర్. పంతులు తీసిన ‘రత్నగిరి రహస్య/తంగమలై రగస్యం’ – చిత్రం కథ ఆధారంగా తెలుగులో కలర్ స్కోప్‍లో ఎస్.డి.లాల్ దర్శకత్వంలో – ఎన్.టి.ఆర్. జయప్రదలు నటించిన సినిమా ఏది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఆగస్ట్ 01 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 47 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఆగస్ట్ 06 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 45 జవాబులు:
1.బమ్మెర పోతన (మహా భాగవతం నుంచి) 2. నసీహత్ 3. అనుగ్రహం 4. అన్నదమ్ముల సవాల్ 5. అమావాస్య చంద్రుడు 6. అంతులేని కథ 7. కార్తవరాయని కథ 8. ఏకవీర. కుట్టాన్ సేతుపతి 9. సి.ఐ.డి. 10. బావా మరదళ్ళు 11. కంచుకోట
సినిమా క్విజ్ 44 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మణి నాగేంద్రరావు. బి
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రేయా ఎస్. క్షీరసాగర్
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వనమాల రామలింగాచారి
- దీప్తి మహంతి
- జి. స్వప్న
- యం.రేణుమతి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]