యూరప్ పర్యటనలో అందాలూ – అనుభవాలూ -ఆనందాలూ-1

0
3

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

పారిస్ – ఆర్క్ డి ట్రైయంఫ్

[dropcap]ప్ర[/dropcap]స్తుత కాలంలో విదేశ యానం సాధారణ విషయం. పక్క ఊరికి వెళ్లి వచ్చినట్లు ఉంటుంది వ్యవహారం. మరి నేను చెప్పే మా విదేశీయానం కబుర్లలో ఏమిటీ విశేషం?

కట్టె కొట్టె తెచ్చె లాగ కాకుండా కొంత వివరం చూసింది, ఫీల్ అయింది నలుగురితో షేర్ చెయ్యాలనే తాపత్రయం.

మా అమ్మాయికి వర్క్ రిలేటెడ్ వర్క్ షాప్స్/సెమినర్స్‌లో ప్రసంగించటానికి ఇన్విటేషన్స్ వచ్చాయి. మొదటిది జర్మనీ లోని మ్యూనిచ్‌లో.

“నేను కూడా వస్తాను” అంటే అందుకు కావాల్సిన ప్రయాణం, వీసా ఏర్పాట్లు చేసింది.

నా చిరకాల కోరిక పారిస్ లోని ఈఫిల్ టవర్ ఎక్కి చూడటం.

అందుకని పోర్ట్ అఫ్ ఎంట్రీగా ఫ్రాన్స్ వీసా తీసుకున్నాము. యూరప్ యూనియన్‌లో సభ్య దేశానికి చెందిన వీసా ఉంటే అన్ని దేశాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా టూరిస్ట్‌గా తిరిగి చూడవచ్చు.

ప్రయాణం డేట్ దగ్గరపడే కొద్దీ తెలియని ఉత్సాహం. సోషల్ టీచర్‌గా క్లాసులో ఫ్రెంచ్ రెవల్యూషన్, యూరోపియన్ స్టేట్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పిన ఒక స్టేటమెంట్ గుర్తుకు వచ్చి ఫ్రాన్స్, పారిస్‌ని విజిట్ చేస్తున్నానని ఉద్వేగం కలిగింది.

ఆస్ట్రియన్ ఛాన్సలర్ Metternich అభిప్రాయంలో when France sneezes, the rest of Europe catches cold.

ఆ రోజుల్లో ఫ్రాన్స్‌లో జరిగిన, చూసిన revolutions, democracy, కార్మిక హక్కులు, పాలనలో మార్పులు – ఇతర దేశాల వారిని ఉత్తేజపరిచి చరిత్రలో ఏమి జరిగిందో విన్నాము. అలాంటి చైతన్యవంత దేశాన్ని చూడటం అంటే?

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి ఎమిరేట్స్ ఫ్లైట్‌లో దుబాయ్ మీదుగా పారిస్‌కి వెళ్ళాము.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ ఏరియాలో డ్యూటీ ఫ్రీ షాపింగ్ చూసాం. రిటర్న్‌లో ఏమి కొనాలో చూసుకున్నాము.

మనవరాలు ‘పరి’కి విండో సీట్ కావాలి. ఫ్లైట్ టేకాఫ్, లాండింగ్, మేఘాలు, చిన్నగా కనపడే కార్స్, మనుషులు చూడటానికి. అదొక తుత్తి!

ఫిబ్రవరి నెల చలికి తగిన విధంగా వుల్లెన్స్ తీసుకుని వెళ్ళాము. పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తరువాత వివిధ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సూట్‌కేసులు, బాగ్స్‌తో హోటల్‌కి వెళ్ళటానికి ఫామిలీ అఫ్ ఫైవ్ కనుక పెద్ద కార్ టాక్సీ అద్దెకు తీసుకున్నాము. వెయిటింగ్ ఏరియాలో మనకి అలవాటు లేని విపరీతమైన చలి. హోటల్ చేరేటప్పటికి నైట్ 9 గంటలు. రూమ్స్ లోకి సామాన్లు చేర్చుకుని నిద్రకు ఉపక్రమించాము. హోటల్‌లో మన బుకింగ్ వివరాలు, పాస్‌పోర్ట్స్ చూపించాకా రూమ్స్ allot చేసి డోర్ కీ, వైఫై కి password పేపర్ ఇచ్చారు. రూమ్ డోర్ ఓపెన్ చెయ్యాలంటే passcode పంచ్ చెయ్యాలి.

8వ అంతస్తులో రూమ్స్. కొద్దిసేపు విండో లోంచి కనిపిస్తున్న పారిస్ సిటీ నైట్ లైట్స్, ట్రాఫిక్ చూసి – ట్రాఫిక్ రూల్స్ ఎంత చక్కగా పాటిస్తున్నారని అనుకున్నాము. మరి మనం?

మేము ఉన్న హోటల్‌కి చుట్టుపక్కల పెద్ద Shopping lanes, బిగ్ హాస్పిటల్, సిటీ కనెక్టవిటీ ఉన్న public transport, ఫ్రాన్స్ లోనే అతి పెద్దదిగా చెప్పే flea market. దాదాపు 3-4 miles విస్తరించి ఓల్డ్ అండ్ న్యూ దొరకని వస్తువు ఉండదు. ముఖ్యమైన టూరిస్ట్ ప్రదేశలకు కనెక్ట్ చేసే బస్సు, మెట్రో ఉన్నాయి.

ఇక్కడ హోటల్‌లో ఎందుకో తెలీదు టవల్, సోప్. షాంపూ లాంటివి ఇవ్వరు. మనమే తెచ్చుకోవాలి. May be Covid effect?

మర్నాడు ఉదయం హోటల్‌లో 10 am లోపల breakfast తిని చలిని భరించేలా layering వేసుకుని సైట్ సీయింగ్‌కి బయలుదేరాము. ఇక్కడి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా వసతిగా ఉంటుంది. ఐదుగురం కలిసి బస్సులో వెళ్ళాము.

మొదటిగా పారిస్ లోని యుద్ధ స్మారకం ‘ఆర్క్ డి ట్రై యంఫ్’ లేదా ‘ట్రై యంఫాల్ ఆర్చ్ ఆఫ్ ది స్టార్‌’ని చూడటానికి వెళ్ళాము. ఇది నగర నడిబొడ్డున ఉంది. దీనికి నలుమూలల నక్షత్రంగా పిలవబడే 12 మార్గాలు రోడ్లని కలిపి ఉంది.

ఫ్రెంచ్ విప్లవం మరియు నెపోలియన్ యుద్ధాలలో ఫ్రాన్స్ కోసం పోరాడి అమరులైన వారి పేర్లు, అన్ని హోదాలలో ఉన్నవారివి గౌరవ సూచకంగా చెక్కబడి ఉన్నాయి. ఇది చార్లెస్ డి గల్లె అనే చోటులో ఉంది.

1806లో ప్రారంభించి 1836లో పూర్తి చేశారట. ఎత్తు 164 అడుగులు. లోపల నుండి స్పైరోల్ స్టెప్స్ ఉన్నాయి. 400 కు పైగా మెట్లు ఉన్నాయి. ఎక్కటానికి కొంత ఇబ్బంది అనిపించింది. వెడల్పు 148 ft, లోతు 72 ft.

పైన భాగంలో నుండి పారిస్ పరిసర ప్రాంతాలు అందంగా కనిపిస్తాయి. దూరంగా ఇఫెల్ టవర్ కూడా.

దీనిని 1806లో ఆస్టర్లిట్జ్‌లో విజయం సాధించిన తర్వాత నెపోలియన్ చక్రవర్తి విజయ చిహ్నంగా నిర్మాణం ప్రారంభించారు. పునాదులకే 2 సంవత్సరాలు పట్టిందిట.

ఫ్రెంచ్ విప్లవం, ఇంకా నెపోలియన్ యుద్ధాలలో ప్రధాన ఫ్రెంచ్ విజయాల పేర్లతో చెక్కబడిన 30 షీల్డ్‌లు ఉన్నాయి. స్మారక చిహ్నం లోపలి గోడలలో 660 మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి, వారిలో మొదటి ఫ్రెంచ్ సామ్రాజ్యానికి చెందిన 558 మంది ఫ్రెంచ్ జనరల్స్ ఉన్నారు; యుద్ధంలో మరణించిన జనరల్స్ పేర్లు అండర్‌లైన్ చేయబడ్డాయి. నాలుగు సపోర్టింగ్ కాలమ్‌ల పొట్టి వైపులా, నెపోలియన్ యుద్ధాలలో ప్రధాన ఫ్రెంచ్ విజయాల పేర్లు కూడా చెక్కబడి ఉన్నాయి.

ఆర్క్ కింద మొదటి ప్రపంచ యుద్ధం నాటి తెలియని సైనికుడి సమాధి ఉంది. 1920 యుద్ధ విరమణ దినం నాడు, ఎప్పటికీ గుర్తించబడని (ఇప్పుడు రెండు ప్రపంచ యుద్ధాలలో) చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఒక శాశ్వతమైన జ్వాల మండుతుంది.

ఆర్క్ యొక్క ప్రతి స్తంభాలపై నాలుగు ప్రధాన శిల్ప సమూహాలు:

Le Départ de 1792 (లేదా La Marseillaise), ఫ్రాంకోయిస్ రూడ్ ద్వారా 10 ఆగస్టు తిరుగుబాటు సమయంలో ఫ్రెంచ్ ఫస్ట్ రిపబ్లిక్ యొక్క కారణాన్ని శిల్ప బృందం జరుపుకుంటుంది.

Le Triomphe de 1810, Jean-Pierre Cortot ద్వారా Schönbrunn ఒప్పందాన్ని జరుపుకుంటారు. ఈ సమూహంలో నెపోలియన్‍కి, విజయ దేవత చేత పట్టాభిషేకం చేయబడింది.

అనేక చారిత్రక చిహ్నాలు, శిల్పాలు అనేకం కనిపిస్తాయి. గత చరిత్రని పరిరక్షించే విధం నచ్చింది.

మరిన్ని పారిస్ విశేషాలు తెలుసుకుందామా?

(వచ్చే వారం కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here