[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నాన్న’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]తి[/dropcap]మిరంతో
సమరం చేస్తుంటాడు
మనకు నిత్యం
వెలుగునివ్వడానికి
ముళ్ళబాటలోనైనా
నడుస్తాడు
మన భవితకు
పూల బాటకోసం
మన సరదాల కోసం
మారుతుంటాడు
ఎల్లప్పుడూ
ఎ.టి.యం.గా
మనల్ని హీరోని
చేయడానికి
తను ఒక్కోసారి
జీరో కూడా అవుతాడు
మనల్ని ప్రతిసారీ
గెలిపించడం కోసం
తను ఎన్నిసార్లైనా
ఓడిపోతుంటాడు