డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు గారికి మహాకవి సినారె ప్రత్యేక పురస్కారం – ప్రెస్ నోట్

0
4

[dropcap]ప్ర[/dropcap]ముఖ కవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు, దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షులు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 2023 సంవత్సరానికి మహాకవి సినారె ప్రత్యేక పురస్కారాన్ని ఆదివారం 31 జూలై 2023 నాడు స్వీకరించారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మహాకవి సినారె కళాపీఠం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ తొలి అధ్యక్షులు బాద్మి శివకుమార్ ఈ పురస్కారాన్ని ఆయనకు బహూకరించారు.

తన సాహిత్య ప్రస్థానానికి సహకరించిన ప్రముఖ రచయితలను, కవులను ఈ సందర్భంగా మాట్లాడుతూ డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రత్యేక పురస్కారం అందజేసిన మహాకవి సినారె కళాపీఠానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వ్యాస గవాక్షం’, ‘వెలుగు-వెన్నెల’, ‘విపంచి’, ‘అమ్మంగి వేణుగోపాల్ రచనలు- సమగ్ర పరిశీలన’, ‘భావదర్పణం’ తదితర గ్రంథాలు వెలువరించిన డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు ప్రధానమంత్రి ప్రసంగాలను ఆకాశవాణి శ్రోతల కోసం అనువదిస్తూ అనువాద రంగంలోనూ చక్కటి పేరు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా వక్తలు ఆయనను ప్రశంసించారు.

కవిత్వం, విమర్శ, అనువాదం తదితర ప్రక్రియల్లో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు విశేష కృషి చేస్తున్నారని వారన్నారు. సాహిత్య వేదికల నిర్వహణలోనూ ప్రత్యేక పంథాతో వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములు, సమన్వయకర్త డా. పోరెడ్డి రంగయ్య, జాతీయ సాహిత్య పరిషత్తు మహబూబ్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షులు ఉమ్మెత్తల మహేశ్, కార్యదర్శి కిరణ్మయిలతో పాటు పలువురు సుప్రసిద్ధ రచయితలు, కవులు పాల్గొన్నారు. ఈ పురస్కారాన్ని డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు స్వీకరించడం పట్ల దర్పణం సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి డా. చీదెళ్ల సీతాలక్ష్మి, కార్యవర్గ సభ్యులు సత్యమూర్తి, నారాయణ రావు, ప్రముఖ కళాకారుడు అహోబిలం ప్రభాకర్, కవయిత్రులు వరలక్ష్మి, విజయ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here