[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఏసుక్రీస్తుగా నటించి ప్రశంసలందుకున్న నటుడు ‘విజయ చందర్’ ఏ బ్యాంకులో ఎక్కడ ఉద్యోగం చేశారు?
- నటుడు చంద్రమోహన్ అసలు పేరు?
- హాస్యనటులు రాజబాబు నటించిన తొలి చిత్రం ఏది?
- ఎస్. వి. రంగారావు గారు నటించిన తొలి చిత్రం ఏది?
- ఛాయాగ్రహణ దర్శకుడు కమల్ ఘోష్ దర్శకత్వం వహించిన ఏ సినిమాలో బాలయ్య, కృష్ణకుమారిలు నటించారు?
- ఐ.ఎన్. మూర్తి దర్శకత్వంలో కృష్ణ, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, వాణిశ్రీ నటించిన ‘జగత్ కిలాడీలు’ చిత్రానికి కథ అందించినది ఎవరు?
- జెమినీ సంస్థ ఎస్.ఎస్. బాలన్ దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీలతో – వి. కుమార్ సంగీత దర్శకత్వంలో – ఏ తెలుగు సినిమా నిర్మించింది? హిందీలో రాజేష్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన సూపర్ హిట్ సినిమా ఈ తెలుగు సినిమాకి మూలం.
- అమీర్ ఖాన్ నటించిన ‘జో జీతా వహీ సికందర్’ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో పవన్ కళ్యాణ్‍తో తీసిన సినిమా ఏది?
- 1967లో వెస్టిండీస్ కెప్టెన్ సర్ గారీ సోబర్స్ గారు మద్రాస్ వచ్చినప్పుడు గోల్డెన్ స్టూడియోలో జరుగుతున్న ఏ తెలుగు సినిమా షూటింగ్ తిలకించి తారాగణాన్ని మెచ్చుకున్నారు?
- చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చిత్రానికి ఏ ఆంగ్ల చిత్రం ఆధారం?
- 9 ఆగస్టు 1973 న పద్మాలయా స్టూడియోస్ వారు నలుగురు హీరోలతో (ఎన్.టి.ఆర్., జగ్గయ్య, కాంతారావు, కృష్ణ) మల్టీస్టారర్ మూవీ తీశారు. ఈ చిత్రం 28 కేంద్రాలలో శతదినోత్సవం, 200 రోజుల పండుగ జరుపుకుంది. అది అప్పటి రికార్డు. 9 ఆగస్టు 2023 నాటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికీ జీవించి ఉన్న ఆ చిత్ర కథానాయిక ఎవరు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఆగస్ట్ 15 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 49 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఆగస్ట్ 20 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 47 జవాబులు:
1.ఘంటసాల 2. సాహెబ్ 3. దొంగలకు దొంగ 4. సంతోషం 5. మల్లెపూవు, లక్ష్మి 6. ఇల్లాలు 7. మంచి మనుషులు 8. మంచి మనిషి 9. కన్నడ తార లీలావతి 10. రాజపుత్ర రహస్యం
సినిమా క్విజ్ 47 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మణి నాగేంద్రరావు. బి.
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- పి. వి. ఎన్. కృష్ణ శర్మ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సునీతా ప్రకాశ్
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- శ్రేయా ఎస్. క్షీరసాగర్
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వనమాల రామలింగాచారి
- దీప్తి మహంతి
- జి. స్వప్న
- యం.రేణుమతి
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]