[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. విష్ణుమూర్తి (4) |
4. కుబేరుని నవనిధులలో ఒకటి (4) |
8. సంతోషము (3) |
10. స్వల్పకాలపు నిద్రవిరామం (3) |
11. నడుము లేని నీచము (2) |
12. సులోచనము (3) |
13. చంద్రునిలో పదునాఱవ భాగము (2) |
16. సేనాముఖము (3) |
17. అశ్వధారావిశేషము (ఒక విధమైన గుఱ్ఱపునడక)(3) |
21. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆచార్య కృష్ణమూర్తి గారి ఇంటిపేరులో తొలిసగం అటునుంచి చూడండి (2) |
23. ఎటునుంచి చూసినా వదనము (3) |
24. తుదిలేని బలరాముడు (2) |
25. యోగ్యమైన (3) |
27. ఆజ్ఞ (3) |
28. నిశాముఖము (4) |
29. మేఘము (4) |
నిలువు:
1. విడువనిచ్ఛగలవాఁడు (4) |
2. మొల్ల – రామాయణం వ్రాసిన కవయిత్రి కాదు (3) |
3. క్రిందనుండి పైకి చూసేటప్పుడు రెండవ అక్షరాన్ని వత్తితే చుంబనం! – అలవాటుగా పైనించి క్రిందకి చదువుతూ రెండవ అక్షరాన్ని వత్తితే త్రమ్ము !! (2) |
5. అస్తమించు (2) |
6. వరకు, పర్యంతము (3) |
7. అయిదువ్రేళ్లను కొనలుగూర్చి పట్టిన అభినయ హస్తవిశేషము (4) |
9. ఫాలనేత్రము (3) |
14. తొల్లి (3) |
15. మద్దెల (3) |
18. అచ్చువేయబడినది (4) |
19. అసంబద్ధవచనము లాడునది (3) |
20. యాదవ కులంలో ఇది పుట్టిందంటే సర్వ నాశనం మొదలయిందని అర్థం! (4) |
22. దీపావళి వెళ్లిన రెండవ రోజు ఈవిడ చేతి భోజనం తినాలని ఒక ఆచారం (3) |
24. కళింగాంధ్ర మాండలికంలో మిగిలినది, ఆ పైనది – దీని చివరగాని దీర్ఘం తీశారంటే కోస్తాలో మినహాయింపు దొరుకుతుంది! (3) |
26. ఉర్దూలో చూపునది, దర్శకము (2) |
27. వృద్ధ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2023 ఆగస్ట్ 22 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 76 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2023 ఆగస్ట్ 27 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 74 జవాబులు:
అడ్డం:
1.సరస్వతి 4. ధ్వాంతమణి 7. జప 8. తంటా 9. కవనం 12. కంపన 14. మురి 15. ఋద్ధము 17. గది 18. పుల 19. దంభోళి 21. రేఖ 23. నముచి 25. దండుగ 26. వల 28. వాపు 29. సుచరిత 30. ముళ్లయతి
నిలువు:
1.సత్యకము 2. స్వజనం 3. తిప 4. ధ్వాంతం 5. తటాకం 6. ణిమనది 10. వరిపొలము 11. శ్రద్ధ 13. పగటిరేడు 15. ఋగ్వేదం 16. మురళి 18. పునర్వసు 20. భోగి 22. ఖగపతి 24. చివరి 25. దంపుళ్ళ 27. లత 28. వాము
సంచిక – పద ప్రతిభ 74 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- కర్రి ఝాన్సీ
- కాళిపట్నపు శారద
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.