(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]ము[/dropcap]స్లింల సంతుష్టీకరణ కోసం వారికి భారత్‌లో ఇచ్చిన ప్రత్యేక ప్రతినిధిత్వంపై బ్రిటన్ పార్లమెంట్‌లో పెద్ద చర్చే జరిగింది. ఒకసారి ప్రత్యేక ప్రతినిధిత్వం కల్పించిన తరువాత దానిపై తిరిగి ఆలోచించడం అత్యంత ప్రమాదకరమైందని కూడా బ్రిటన్ ప్రభుత్వం తొందర్లోనే గుర్తించింది. మొదటి ప్రపంచ యుద్ధం పరిణామాల అనంతరం టర్కీలోని ఇస్లాం మత పవిత్ర స్థలాల సంరక్షణ, ఒట్టమాన్ టర్కీ రాజ్యానికి సంబంధించి ఎన్నెన్నో రహస్య ఒప్పందాలు, యుద్ధ విరమణ సంధులు జరుగుతూ వచ్చాయి. మన దేశంలోని ముస్లింలు టర్కీ సమస్యపై ఎక్కువగా శ్రద్ధ చూపించడం మొదలు పెట్టారు. టర్కీలో ఆధిపత్యం కోల్పోతే.. ఒట్టమాన్ టర్కిష్ రాజ్యం ఓడిపోతే.. భారత్‌లో తమ పలుకుబడి, అధికారం, ప్రాముఖ్యత తగ్గిపోతుందని భయపడ్డారు. ఈ పరిణామాలు బ్రిటిష్ పాలకులపై అసహనంగా పరిణమించాయి.
‘Indian Muslims showed their sympathy for Turkey by despatching a medical mission to her aid in December 1912; and a section of pan-Islamists began to teach that the first duty of Muslims is allegiance to the Khalif, and founded a new organization the Anjuman-i-Khuddam-i-Kaaba whose members took an oath to sacrifice life and property in defense of the holy shrine against non-Muslim aggressors. There were signs, however, of an improvement in Muslim feeling in the latter half of 1913, when riots and loss of life in connection with the partial demolition of a Cawnpore mosque caused a temporary set-back. The Turks’ recovery of Adrianople, the declaration of peace in the Balkans, and the reaction from the passions aroused by the Cawnpore affair induced calmer feelings; but a fresh difficulty presented itself when Turkey entered the war against us in November 1914. The Germans counted certainly on being able to stir up disaffection in India, and lost no labour in trying to persuade Indian Muhammadans that Turkey was engaged in a jihad, or holy war, and that it was their religious duty to take sides against England and her Allies. These enemy attempts wholly failed to affect the great mass of the Muslim community. Keenly as they felt the painful position in which they were placed, they were admirably steadied by the great Muhammadan princes and nobles and preserved an attitude of firm loyalty which deserves our praise and sympathy. In this attitude they were greatly helped by the public assurances given by His Majesty’s Government to the effect that the question of the Khali fate is one that must be decided by Muslims in India and elsewhere without interference from non-Muslim powers. But a small section of extremists were quick to seize the opportunity of making trouble and ventured on almost open avowals of disloyalty against which the Government had no choice but to take action.’ (The report of Indian constitutional reforms, London, 1918, p.15 also called Montford report)
టర్కీలో పరిణామాలు క్రమంగా భారత్ లోని ముస్లింలు బ్రిటిష్ వారిపై అసహనాన్ని వ్యక్తం చేయడానికి కారణమైంది. దీంతో బ్రిటిష్ పాలకులు కూడా అంతకుముందు తిలక్‌ను నిర్బంధించడానికి తెచ్చిన పత్రికాచట్టం, అరవిందఘోష్‌ను బంధించడానికి తెచ్చిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ను ఉపయోగించి ముస్లిం పత్రికలైన కామ్రేడ్, హమ్దర్ద్, అల్ హిలాల్, అల్ బలాగ్, జమీందార్ వంటి ముస్లిం వర్గాల పత్రికలను అడ్డుకున్నారు. (ఖిలాఫత్, డాక్టర్ శ్రీరంగ్ గోడ్బోలే) కొందరు ముస్లిం నాయకులను కూడా జైళ్లలో పెట్టారు. ఇదే సమయంలో ముస్లింలకు అందించిన ప్రత్యేక ప్రతినిధిత్వంపై బ్రిటిష్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని భావించింది. ఈ వ్యవహారంపై 1918లో అప్పటి వైస్రాయ్ చేమ్స్‌ఫోర్డ్, భారత వ్యవహారాల మంత్రి ఎడ్విన్ మాంటేగ్‌లు కలిసి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఒక సుదీర్ఘమైన నివేదికను సమర్పించారు. ముస్లిం వర్గాలకు 1909లో ఇచ్చిన ప్రత్యేక ప్రతినిధిత్వాన్ని, ప్రత్యేక హక్కులను సమీక్షించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా వారి నుంచి తీవ్రమైన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మాకు ఒకసారి హక్కులను నిర్ణయించిన తరువాత మరోసారి వాటిపై చర్చ చేయాల్సిన అవసరమే లేదని తమకు మతపరమైన ప్రాతినిధ్యమే తిరుగులేని బలమని వాదిస్తున్నారని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వారికి ప్రత్యేక ప్రతినిధిత్వం కల్పించడాన్ని మాంటేగ్ ఫోర్డ్‌లు ప్రశ్నించారు. కనీసం మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో ఉన్నహక్కులను కొనసాగించడం సరైన పద్ధతి కాదు అని అభిప్రాయపడ్డారు. కానీ వీటికి సంబంధించి ఎలాంటి చర్చ మొదలుపెట్టినా ఆవేశకావేశాలకు అంతుండదని.. వాటిని నియంత్రించడం చాలా కష్టమని నివేదికలో స్పష్టం చేశారు.
“The concession of special electorates and fixed ratios of representation for the Muslims is, however, reinforced by a further safeguard of a far more dubious nature. The proposal is that ‘no Bill, nor any clause thereof, nor a resolution introduced by a non-official affecting one or the other community (which question is to be determined by the members of that community in the legislative council concerned), shall be proceeded with if three-fourths of the members of that community in the particular council, Imperial or provincial, oppose the Bill, or any clause thereof, or the resolution “. Such a provision measures the difficulty with which agreement between the communities was reached. The clause is so widely worded, and would in practice be so widely interpreted by those to whom its interpretation is specifically committed, that it would be unworkable. In a country like India it is impossible to say what proposals would not be capable of being represented as affecting communal interests; and even’.{ such debatable measures were carried peaceably through the councils they would 106 be still hopelessly open to persistent, and probably successful, attacks in the courts. Every law of general application affects Hindus and Muhammadans, and a literal interpretation of this provision would require that all Bills of a general nature should be passed by the specified majority of each community. We have no doubt; however, that what was intended was to protect the peculiar religious rights and customs of Hinduism and Islam. Even this is a far-reaching reservation, susceptible of very wide interpretation in a country like India where religion enters deeply into the daily affairs of life ; but, so far as the law can afford such general protection, it has already done so in section 79 of the Government of India Act, 1915, which enacts that all laws affecting the religion or religious rites and usages of any community shall require the sanction of the Governor General before introduction ; and we much prefer to rely upon this, or some similar, safeguard.” (The report of Indian constitutional reforms, London, 1918, p.105, 106. also called Montford report)
టర్కీ రాజ్యంపై, అక్కడి ఖలీఫాపై ముస్లింలు చూపిస్తున్న ప్రేమ.. భారత్‌లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మారింది. దీంతో బ్రిటిష్ పాలకులు చర్యలు తీసుకోవాలని భావించినా అవి పెద్దగా ఫలించబోవని మాంటెగ్ ఫోర్డ్ నివేదిక తేల్చి చెప్పింది. ఎందుకంటే చెప్తే వినడానికి, చెప్పకుండానే తమను తామే సర్ది చెప్పుకోవడానికి వారేమీ హిందువులు కారు. బ్రిటిష్ వాళ్లు అరెస్టు చేసిన ముస్లిం నాయకులను విడుదల చేయాలని ముస్లిం సమాజం 1917 తొలి నాళ్లలో ఉద్యమించింది. అందుకు కాంగ్రెస్ లోని మితవాద నాయకత్వం, ముఖ్యంగా మహాత్మాగాంధీ పూర్తిగా మద్దతు ప్రకటించారు. మహాత్మాగాంధీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. రావడానికి ముందు నుంచే ఆయన దక్షిణాఫ్రికాలో ఆయన చేసిన పోరాటం గురించి భారత్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొని వచ్చారు. గోపాలకృష్ణ గోఖలే ఆయన్ను రప్పించడంతో పాటు.. బాంబేలో ఘన స్వాగతం కూడా పలికించారు. ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ పగ్గాలు ఆయన చేతుల్లోకి వచ్చాయి. ముస్లిం నాయకుల విడుదలకు ఉద్యమించాలని ముస్లింలు గాంధీజీని 1917లో కోరారు. అప్పటివరకు కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న ముస్లిం నాయకులు.. టర్కీ విషయం వచ్చేసరికి కాంగ్రెస్ మద్దతు కావాల్సి వచ్చింది. గాంధీజీ మొదట్నుంచీ కూడా హిందూ ముస్లింల ఐక్యత గురించి ఎంతో ఆరాటపడ్డారు. అంతేకాదు.. మనసావాచా ఆయన ఈ ఐక్యత సాధించడానికి చాలా కష్టపడ్డారు. ఈ విషయాన్ని గురించి అంబేద్కర్ తన రచనల్లో రాశారు.
“Not so Mr. Gandhi. At the very commencement of his career as a political leader of India when Mr. Gandhi startled the people of India by his promise to win Swaraj within six months, Mr. Gandhi said that he could perform the miracle only if certain conditions were fulfilled. One of these conditions was the achievement of Hindu-Muslim unity. Mr. Gandhi is never tired of saying that there is no Swaraj without Hindu-Muslim unity.” (Pakistan or the partition of India B.R. Ambedkar, 1945, p.146)
గాంధీ గారి ఈ ఆరాటంతో ఆయనకు ముస్లిం స్నేహితులు పెరుగుతూ వచ్చారు. ముస్లిం వర్గాల ఆలోచనను ఆయన పూర్తిగా సమర్థించడం ప్రారంభించారు. దీనివల్ల హిందూ ముస్లిం ఐక్యత సాధ్యమవుతుందనే ఆయన గట్టిగా విశ్వసించారు. 1918లో ఢిల్లీ ఇంపీరియల్ వార్ సమావేశంలో గాంధీజీ పట్టుబట్టి టర్కీ గురించి భారతీయ ముస్లింలలో ఉన్న ఆలోచనను చర్చించారు. ఈ పరిణామంతో ముస్లింలు గాంధీగారిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయ్యారు. గాంధీగారు మాత్రం హిందూ ముస్లిం ఐక్యత ఏర్పడాలన్న బలమైన ఆకాంక్షతోనే జీవితకాలం ఉండిపోయారు.
మరోవైపు భారత్ లోని ముస్లింలు టర్కీలో జరుగుతున్న కల్లోలంపై తీవ్రమైన ఆందోళన చెందడం ప్రారంభించారు. బ్రిటిష్ విధానాల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ టర్కీలో ఖలీఫా అధికారం పోకూడదని వారు బలంగా కోరుకున్నారు. కొంతమంది ముస్లిం నాయకులు విదేశాల్లో పర్యటించి కూడా వచ్చారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రియమైన శిష్యుడు, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 1918లో సుదీర్ఘమైన విదేశీ ప్రయాణం చేసి వచ్చారు. ఇరాక్, సిరియాతో పాటు టర్కీకి కూడా వెళ్లి వచ్చారు. అక్కడ యువతతో పలు సమావేశాలు జరిపారు. తిరిగి వచ్చిన తరువాత అల్ హిలాల్ అనే ఉర్దూ పత్రికలో (ఆ రోజుల్లో 25 వేల కాపీల సర్క్యులేషన్ ఉండేది) వ్యాసం రాశారు. ఇది బ్రిటిష్ వ్యతిరేకంగా, ముస్లిం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించింది. ఒక మాటలో చెప్పాలంటే యాంటీ బ్రిటిష్, పాన్ ఇస్లామిక్‌గా ఆ వ్యాసం కనిపిస్తుంది.
“As a religious scholar, Azad was far more competent than Muhammad Ali and he became the principal theoretician of the Khilafat movement. To him, one of the essentials of Islam is the international solidarity of all Muslims, and the Caliph is the instrument through which this solidarity is to be maintained. Aziz Ahmad summarizes his views on the Caliphate as follows: “The foundations of Pan-Islamic society rest on five sociological pillars: its adherence to a single caliph; its rallying to his call; its obedience to him; emigration from a dar al-harh, including a former Muslim territory occupied by non-Muslims; and jihad which could take several forms.” (The Khilafat movement in India 1919-1924 p.60)
జాకీర్ హుసేన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌల్వి అబ్దుల్ బారీ.. తదితరులందరూ ఖిలాఫత్ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఖిలాఫత్ ఉద్యమానికి ప్రేరణగా తొలి ప్రజాందోళన 1918 డిసెంబర్ 30-31న ఢిల్లీలో జరిగిన అఖిల భారత ముస్లిం లీగ్ సమావేశంలో జరిగింది. ఆ తరువాత ఎక్కువగా ఉత్తర ప్రదేశ్, బెంగాల్, పంజాబ్లలోని కొన్ని పట్టణాలు, బొంబాయి, సింధ్ వంటి ప్రాంతాల్లో మాత్రమే జరిగింది. ఈ ఉద్యమాన్ని దేశమంతటా విస్తరింపజేసింది మహాత్మాగాంధీయే.
ఆ తరువాత 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి 1919 మార్చిలో మౌల్వీ అబ్దుల్ బారీతో చర్చలు జరిపారు. స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన దస్తావేజుల్లో బ్రిటిష్ అధికారులకు, వైస్రాయ్‌కి మధ్యన జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు అనేకం భద్రపరచడమే కాకుండా ప్రచురితమై ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా 1919-24 మధ్యన మహాత్మాగాంధీ కి సంబంధించిన సమాచారాన్నిపై అధికారులకు చేరవేసిన నిఘా ఉత్తరాలు కూడా అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి.. ఈ కింది ఉత్తరం.
S.B., Delhi, dated May 3rd.
An informer reports that Mr. Gandhi met Maulvi Abdul Bari some time ago and discussed the Satyagraha movement with him. Gandhi is said to have been most optimistic about the success of the movement. He told Abdul Bari that he had agents in every city and that the passive resistance idea would extend to the servants of officials and to the army. Hindu-Muslim unity would be complete and the Government would be paralysed. It was agreed that when agitation was at its height there would be a large meeting of Ulemas, Maulvis and Mahommadans generally, at which Abdul Bari should be elected Shaikh-ul-Islam and the Muslim demands regarding the Khilafat, the holy places, etc., should be formulated. The Hindus would support these demands which should be submitted to His Excellency the Viceroy with the warning that non- acceptance of them would mean jehad. In return for the assistance of the Hindus, Abdul Bari, in his capacity as Shaikh-ul-Islam, was to issue a fatwa declaring that the animal originally sacrificed by Ibrahim was a sheep and not a cow, and that cow-sacrifice was prohibited in future. The scheme is said to have been ruined by the out- breaks of violence in various parts of the country.
With reference to the above it is significant that, Gandhi was in Lucknow as the guest of Abdul Bari in March 1919. (Source material for a history of the freedom movement in India ; collected from Bombay government records. P.139
ఈ లేఖ సారాంశం ఏమిటంటే లక్నోలోని మౌల్వి ఇంట్లో అతిథిగా ఉన్న గాంధీజీ.. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయాలని నిర్ణయించారు. ప్రతి పట్టణంలోనూ తనకు కార్యకర్తలు ఉన్నారని.. ఈ ఉద్యమాన్ని మెల్లిగా సైన్యంలోకి, ప్రభుత్వ ఉద్యోగుల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందనీ అభిప్రాయ పడ్డారు. హిందూ ముస్లిం ఐక్యత సాధిస్తే ప్రభుత్వ నిర్వహణ కుంటుపడి బ్రిటిష్ వాళ్లు దిగివస్తారని గట్టిగా చెప్పారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో ఉలేమాలు, మౌల్వీలు, కలిసి బారీని షేక్ ఉల్ ఇస్లాంగా ఎన్నుకోవాలని.. ఆ తరువాత ముస్లిం వర్గాల ఆందోళనను హిందువులు సమర్థిస్తారని చెప్పారు. హిందువులు ఇవ్వబోయే మద్దతుకు ప్రతిగా షేక్ ఉల్ ఇస్లాంగా ఎన్నికైన తరువాత ఖురాను ప్రకారం ఇబ్రహిం బలి ఇచ్చింది గొర్రెను మాత్రమేనని.. ఆవును కాదని.. ఆవును చంపడం నిషిద్ధమని ఒక ఫత్వా జారీ చేయాలని మాత్రం గాంధీగారు బారీని కోరారు. చాలా చిన్న కోరిక. కల్మశం లేని కోరిక. దీని వల్ల తాను లక్షించిన హిందూ ముస్లిం ఐక్యత సాధ్యమవుతుందని గాంధీగారు భావించారు. ఇందుకోసం ఖిలాఫత్ ఉద్యమం ఒక అవకాశంగా ఆయన అనుకున్నారు. అందువల్లనే ‘ఈ టర్కీ కోసం మనం ఆలోచించవలసిన అవసరం లేదు కానీ, ముస్లిం వర్గాలకు ముఖ్యమైన సమస్య కాబట్టి దానికి మద్దతు ఇవ్వడంలో తప్పేమీ లేద’ని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కానీ బారీ తన లెక్కల్లో తాను ఉన్నాడు. అప్పటిదాకా అక్కడక్కడ మాత్రమే జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమాన్ని హిందువుల సహాయంతో దేశమంతటా విస్తరించడానికి గొప్ప అవకాశం లభించింది. ఆవును చంపవద్దని ఒక ప్రకటన ఇవ్వటమే కదా.. తన పని అనుకొన్నాడు. (ది ఖిలాఫత్ మూవ్‌మెంట్ 1919-1924). కానీ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఖిలాఫత్ ఉద్యమానికి కొత్త దారులు వెతకాల్సి వచ్చింది.
(సశేషం)