‘రవి గాంచిన పోతన పద్యాలు’ పోటీ: గడువు తేదీ ఆగస్ట్ 20, 2023 కి పొడిగింపు – ప్రకటన

0
6

[dropcap]మి[/dropcap]త్రులారా,

గత అనేక వత్సరాలగా మా లాభాపేక్ష లేని ‘అంతర్జాల భాగవత ఆణిముత్యాల సంస్థ’ (IBAM, http://bhagavatamanimutyalu.org) క్రమ పధ్ధతిలో అమెరికాలోనూ, ఇండియాలోనూ పోతనామాత్యుల వారి పద్యాలని విశ్వవ్యాప్తి చెయ్యడానికి అనేక కార్యక్రమాలు చేపట్టి ఘన విజయాలని సాధించిన సంగతి మీకు తెలిసినదే!.

రవి గాంచిన పోతన పద్యాలుపోటీ: గడువు తేదీ ఆగస్ట్ 20, 2023 కి పొడిగింపు

పోతనామాత్యుల వారి పద్యాలని భావి తరాలకి అందించడానికి IBAM సంస్థ నిర్వహిస్తున్న  అనేక కార్యక్రమాలలో ప్రధానమైనది ‘రవి గాంచిన పోతన పద్యాలు’ పోటీ. ప్రపంచవ్యాప్తంగా వేలాది బాలబాలికలు పోతన పద్యాలు శ్రావ్యంగా ఆలపించడంలో ఎంతో శ్రధ్ధాసక్తులు కనపరుస్తున్న ఆ పోటీ పరంపరలో ఇప్పుడు జరగబోయే 3వ పోటీకి న్యూజీలండ్, ఆస్ట్ఱేలియా, సింగపూర్, ఇంగ్లండ్, నార్వే, మధ్య ప్రాచ్య దేశాలు, కెనడా, భారత దేశాలతో సహా అనేక దేశాల బాలబాలికలు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి నమోదు చేసుకుంటున్నారు. తెలుగు నాట ఇప్పటికే 2000కి బాలబాలికల పైగా నమోదు చేసుకోవడం ఈ ‘రవి గాంచిన పోతన పద్యాల పోటీ’ కి ఉన్న అసమాన ప్రాచుర్యానికి ఒక నిదర్శన.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పెల్లుబుకుతున్న తెలుగు వారి ఆసక్తిని గమనించి వారికి మరింత వెసులుబాటు కలిగించే ఉద్దేశ్యంతో ఉత్తర అమెరికాలో ఈ పోటీ నమోదు తేదీ ఆగస్ట్ 20, 2023 దాకా పొగిడిస్తున్నాం.

ఆ పోటీ వివరాలు, నమోదు చేసుకునే పధ్ధతికి జత పరిచిన ప్రకటనలు చూడండి.

http://ibamcontests.blogspot.com/

Last Date to Register is extended to: August 20, 2023

Please contact the following for Registration details

Indira Cheruvu: (442) 224-2588

Vanaja Konduri: (713) 530-9180

E-mail: ibhagavatham@gmail.com

(Contestants from other countries are requested to contact their country representative or any of the above for complete details)

***

మల్లిక్ పుచ్చా వ్యవస్థాపక అధ్యక్షుడిగా అమెరికాలో వనజ కొండూరి, ఇందిర చెరువు, రఘు ధూళిపాళ, శాయి రాచకొండ, కాంత్ దువ్వూరి, శాంత సుసర్ల, బిందు పొన్నపల్లి ప్రధాన నిర్వాహకులుగా, వంగూరి చిట్టెన్ రాజు ప్రధాన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here