[స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘ఆగస్ట్ 15’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]తె[/dropcap]ల్లవారి పాలనతో తెల్లబోయిన
మన దేశం దాస్య శృంఖలాలలో
బందీగా ఉంది భరతమాత
రెండు శతాబ్దాలు నిస్సత్తువుగా
విప్లవ వీరులు స్వాతంత్ర్య సమర
యోధుల పోరాటాల త్యాగాల ఫలం
అందుకుంది ఆగస్టు పదిహేనున
డెబ్బదియారు వత్సరాల కిందట
ఆ అమర వీరుల త్యాగధనుల
నిస్స్వార్థం మరచిపోకు మిత్రమా
గతం గతః అంటూ సూక్తులు చెప్పకు
భవితకు బంగారు బాట వేసే
దిశలో అడుగు వెయ్యు
దేశ శ్రేయస్సు కోసం చేయి చేయి
కలుపు, కలుపు మొక్కలు తీసి
బంగారు పంటను పండించు
ఆనాడే మన వీరుల త్యాగానికి
గుర్తింపు, వారి ఆత్మలకు ఇంపు
దేశమును ప్రేమించు భరత జాతిని
గౌరవించు అదే నీవిచ్చే మన్నింపు