యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-5

0
3

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

పారిస్ – Luxembourg Garden

[dropcap]పా[/dropcap]రిస్‌లో మేము చూసిన ఇంకొక అందమైన ప్రదేశం Luxembourg Garden. మా హోటల్ F9 నుండి లోకల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిటీ బస్సు ఎక్కి బస్సు నెంబర్ 21లో పార్క్ దగ్గర దిగాం. మార్గమధ్యంలో పారిస్ వీధుల అందాన్ని చూస్తూ అనేక ఇతర ముఖ్యమైన ప్రదేశాల్ని దాటుకుంటూ మా బస్సు ప్రయాణం సాగింది. బస్సు లోపల డిజిటల్ మరియు ఆడియో డిస్‌ప్లే ఉంది అందువల్ల మాకు మేము వెళ్లాల్సిన పార్కు దగ్గర దిగటం ఇబ్బంది కాలేదు. బస్ స్టాప్ ఒక పెద్ద కూడలికి అవతలి వైపున ఉంది.

మేము రోడ్డు క్రాస్ చేసి పార్క్ వైపు వెళ్ళాం. పార్క్ లోపలికి ప్రవేశం ఉచితం. చాలా పెద్ద పార్క్. బహుశా మేము పక్క గేట్లోంచి వెళ్లినట్టున్నాము. ఎటు చూసినా ఎత్తయిన చెట్లు, చెట్ల కింద కూర్చోడానికి కుర్చీలు, చుట్టూ ఆనాటి విగ్రహాలు. అందమైన మెట్లు దిగి ఇంకొంచెం ముందుకు వెళ్ళాం.

అక్కడొక పెద్ద రౌండ్‌గా ఉన్న లేక్ లాంటిది అనుకోండి, వాటర్ బాడీ ఉంది. దాన్ని చుట్టూ లెక్కలేనన్ని కుర్చీలు వేసి ఉన్నాయి. ఫిబ్రవరి నెల విపరీతమైన చలిని తట్టుకుంటూ ఉలన్స్ వేసుకుని మాలాగే ఎంతోమంది పార్క్‌లోని ఎండలో సేద తీరుతున్నారు. మాలాంటి టూరిస్టులు పార్క్ అంతా తిరిగి చూస్తున్నారు.

ఆ పార్క్‌లో చాలామంది స్త్రీల విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా వరుసల్లో నాటిన ఆనాటి పెద్ద చెట్లు ఎంత బాగున్నాయో. అలాగే ఆ పార్కులో టెన్నిస్ కోర్టులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఆటని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ కనిపించారు. ఇంకా చిన్న పిల్లలకి అనేక ఆటస్థలాలు కూడా కనబడ్డాయి.

అలాగే ఫుడ్ హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ తిరిగి చూస్తూ చాలా దూరం ఉంది అనుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళాం. అక్కడ అద్భుతంగా ఉంది అనిపించేలాగా ఉన్న ఒక రాజమహల్ లాంటి ప్యాలెస్ కనబడింది. అందులోకి వెళ్లి చూడొచ్చు అని అన్నారు కానీ అదేదో రిపేర్ లలో ఉన్నట్టుంది అంతేకాకుండా దాని చుట్టూ చాలామంది సైనికులు పహారా కాస్తూ కనపడ్డారు. సో దాన్ని దూరం నుంచి చూసి దాని శిల్ప నైపుణ్యాన్ని చూసి ఆనందపడ్డాము.

ఇంకొంచెం ముందుకి మేము వచ్చిన గేటుకి దగ్గర వైపు నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ గేట్ నుంచి కొద్ది దూరంలో ఒక నీటి కొలను, దాని చుట్టూ చెట్లకి హృదయ ఆకారంలో అల్లిన పూల తీగలు, అంతేకాకుండా ఒక వ్యక్తి శిల్పం అక్కడ ఉంది. వాలెంటైన్ డేకి ముందు రోజది పార్క్ అంతా కూడా చాలామంది ఉన్నారు హార్ట్ షేప్ తీగల వద్ద నిలబడి మేము ఫోటోలు తీసుకున్నాం.

విపరీతమైన చల్లగాలుల మధ్య ఎండ. ఎండకి వేసుకున్న ఉలెన్సు కష్టంగా అనిపించాయి. కానీ చెవులకు తాకుతున్న చల్లగాలి ఇబ్బంది పెట్టింది. Europe లో మేము చూసిన కొన్ని దేశాలలో ఆ టైంలో పారిస్ వాతావరణం కొంచెం వేడిగా అనిపించింది. అక్కడ వాళ్ళని అడిగితే గత కొద్ది కాలంగా క్లైమేట్ చేంజ్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు వెదర్ హాట్‌గా ఉంటున్నది అని చెప్పారు.

 

మేము వెళ్లిన పార్క్ గురించిన కొన్ని విశేషాలు తెలుసుకొని కొంతసేపు పార్కులో ఫోటోలు తీసుకుంటూ తిరిగి ఇంకా హోటల్ దారిపట్టాం. పార్క్ లోంచి బయటకు వచ్చాక ఎదురుగా కనబడిన ఐస్ క్రీమ్ షాప్‌లో ఐస్ క్రీమ్ కావాలని అడిగాను. కావాల్సిన ఐస్ క్రీమ్ కొని తీసుకుని తిన్నాం. కానీ ఎందుకో ఇండియాలో దొరికే ఐస్ క్రీమ్లే బాగున్నాయి అనిపించింది. బహుశా అవి అక్కడి వారి టేస్ట్‌కి తగ్గట్టుగా తయారై ఉంటాయి. అక్కడే పక్కన వీధిలో అమ్ముతున్న ఫ్రూట్ వెండర్ దగ్గర నుంచి కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని హోటల్ కి తిరిగి వచ్చాము.

పార్క్ విశేషాలు

కింగ్ హెన్రీ 6 వితంతువు మేరీ డి మెడిసి 1612లో లక్సెంబర్గ్ ప్యాలెస్‌ని తన కొత్త నివాసంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు తోటని ప్లాన్ చేసారట. ఈ తోట ఫ్రెంచ్ సెనేట్ ఆధీనంలో ఉంది, ఇది ప్యాలెస్‌లో కలుస్తుంది. ఇది 56.8 ఎకరాలు ఉంది. దాదాపు అనేక సంవత్సరాలు భవనం, దాని చుట్టూ ఉన్న తోటలు విగ్రహాలు నిర్మాణంలో మార్పులు చేర్పులు జరిగాయట. విస్తీర్ణం పెరుగుతూ వచ్చిందిట. అనేక సందర్భాల్లో పాలక చక్రవర్తుల అశ్రద్ధకు గురిఅయింది.

1848 జూలై రాచరికం సమయంలో మరియు తరువాత, ఈ ఉద్యానవనం పెద్ద సంఖ్యలో విగ్రహాలకు నిలయంగా మారింది; మొదట క్వీన్స్ ప్రసిద్ధ మహిళలు, వరుసలో ఉన్నారు; తర్వాత, 1880లు మరియు 1890లలో, రచయితలు మరియు కళాకారుల విగ్రహాలున్నాయి.

మెడిసి ఫౌంటెన్ (లా ఫాంటైన్ మెడిసిస్) 1630లో ఫ్రాన్స్ రాజు హెన్రీ IV యొక్క భార్య మరియు ఫ్రాన్స్ రాజు లూయిస్ XIII యొక్క రాజప్రతినిధి అయిన మేరీ డి మెడిసిచే నిర్మించబడింది. 18 శతాబ్దంలో పాడుబడిపోతున్న దీన్ని నెపోలియన్ ఆదేశాలతో చక్కగా పునరుద్ధరించారట.

పార్క్ లోపల ఒక పాలస్ లాంటిది ఉంది. కానీ ప్రజలకు అనుమతి లేదనుకుంటాను. సైనిక పహారా ఉంది. ఆ దేశపు స్ప్రింగ్ సీజన్‌లో అందమైన రంగుల పూలతో పచ్చని చెట్లతో అందంగా ఉంటుంది.

Photos: Mr. D. Nagarjuna

(వచ్చే వారం కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here