[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- శోభన్‍బాబు ‘వీరాభిమన్యు’ చిత్రంలో శకునిగా నటించినది ఎవరు?
- ‘శ్రీమతి’ అనే చిత్రంలో కాంతారావు శారదలపై చిత్రీకరించిన ‘మోగింది గుడిలోని గంట, మురిసింది హృదయాల జంట’ పాటని సుశీల, ఘంటసాల పాడారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
- సి.వి.రంగనాధ దాస్ దర్శకత్వంలోని ‘తోబుట్టువులు’ అనే సినిమాలో జగ్గయ్య, జమునలపై చిత్రీకరించిన ‘మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండువెన్నెలే’ పాటని సుశీల, ఘంటసాల పాడారు. ఈ చిత్రానికి సంగీతం అందించినది ఎవరు?
- ‘అందం కోసం పందెం’ అనే చిత్రంలో కాంతారావు, కాంచన లపై చిత్రీకరించిన ‘నాలోని స్వప్నాల అందాలె నీవు’ పాటని సుశీల, ఘంటసాల పాడారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
- కె. హేమాంబరధరరావు దర్శకత్వంలోని ‘దేవకన్య’ అనే సినిమాలో కాంతారావు, కాంచన లపై చిత్రీకరించిన ‘ఏదో పిలిచినదీ ఏమో పలికినది విరిసే వయసే రమ్మన్నది’ పాటని సుశీల, ఘంటసాల పాడారు. ఈ చిత్రానికి స్వరకల్పన ఎవరు?
- ‘అమాయకుడు’ చిత్రంలో కృష్ణ కోసం పి.బి. శ్రీనివాస్ ‘అనుకోనా ఇది నిజమనుకోనా కలయనుకోనా’ అనే పాట పాడారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
- కె. వి. రెడ్డి తీసిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ధర్మరాజు పాత్రధారి ఎవరు?
- సి. ఎస్. రావు దర్శకత్వంలో కృష్ణుడిగా ఎన్. టి. రామారావు నటించిన ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ సినిమాలో బలరామ పాత్రధారి ఎవరు?
- కృష్ణుడిగా ఎన్. టి. రామారావు నటించిన ‘శ్రీకృష్ణావతారం’ సినిమాలో రుక్మిణిగా దేవిక, సత్యభామగా కాంచన నటించారు. జాంబవతి పాత్రధారి ఎవరు?
- బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో భీష్ముడిగా ఎన్. టి. రామారావు నటించిన ‘భీష్మ’ సినిమాలో పరశురాముడిగా ఎవరు నటించారు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఆగస్ట్ 29 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 51 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 సెప్టెంబర్ 03 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 49 జవాబులు:
1.హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‍లో 2. మల్లంపల్లి చంద్రశేఖర రావు 3. సమాజం 4. వరూధిని 5. మనోరమ 6. విశ్వప్రసాద్ 7. కన్నవారి కలలు 8. తమ్ముడు 9. కంచుకోట (అందులో నటిస్తున్న ఎన్.టి.ఆర్, ధూళిపాళ, ఉదయ్ కుమార్ లతో కరచాలనం చేశారు) 10. పే ఇట్ ఫార్వార్డ్ 11. కాంచన
సినిమా క్విజ్ 48 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మణి నాగేంద్రరావు బి.
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సునీతా ప్రకాష్
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- దీప్తి మహంతి
- జి. స్వప్న
- యం.రేణుమతి
- ఎస్. వికాస్ చౌదరి
- ఎన్. ఎస్. చంద్రబోస్
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]