సంగీత సురధార-40

0
3

[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]

అధ్యాయం 29 – మూడవ భాగం

కొన్ని రాగముల పేర్లు:

క్రమ సంఖ్య కర్నాటక సంగీతం హిందుస్థానీ సంగీతం
1. శంకరాభరణం బిలావల్
2. ఖరహరప్రియ కాఫి
3. కల్యాణి యమన్
4. తోడి భైరవి
5. అభేరి భీం పలాస్
6. హిందోళం మాల్‍కౌస్
7. మాయామాళవగౌళ భైరవ్
8. శుద్ధ సావేరి దుర్గ
9. మోహన భూపాలీ (భూప్)
10. నాట తిలంగ్
11. శుభపంతువరాళి తోడి
12. పూర్వి కల్యాణి పూర్వీ
13. ద్విజావంతి జైజైవంతి
14. నాటకురంజి మాల్‍గుంజి
15. హంసానంది సోహిని

స్వర స్థానముల పేర్లు:

క్రమ సంఖ్య కర్నాటక సంగీతం

(షాడవ-16 ప్రకారం)

హిందుస్థానీ సంగీతం
1. స – షడ్జమం  No variations, Natural note ఖడ్జ
2. రి- రిషభము – శుద్ధ, చతుశ్రుతి, షట్‍శ్రుతి (రి1, రి2, రి3) కోమల్ రిషభ్

శుద్ధ రిషభ్ (తీవ్ర)

3. గ – గాంధారము – శుద్ధ, సాధారణ, అంతర గాంధారము

(గ1, గ2, గ3)

కోమల్ గాంధార్

తీవ్ర గాంధార్ (శుద్ధ గాంధార్)

4. మ – మధ్యమము (శుద్ధ, ప్రతి) (మ1, మ2) కోమల్ మధ్యమ్

శుద్ధ మధ్యమ్ (తీవ్ర మధ్యమ్)

5. ప – పంచమము. No variations, Natural note పంచమ్
6. ద – దైవతము (శుద్ధ, చతుశ్రుతి, షట్‍శ్రుతి)

(ద1, ద2, ద3)

కోమల్ దైవత్

శుద్ధ దైవత్ (తీవ్ర)

7. ని – నిషాదము (శుద్ధ, కైశికి, కాకలి)

(ని1, ని2, ని3)

కోమల్ నిషాద్

శుద్ధ నిషాద్ (తీవ్ర)

10 స్వర స్థానాలలో 5 కోమల్, 5 తీవ్రల శంకరాభరణ స్వరాలు – శుద్ధ స్వరాలు

భిన్నమైన విషయాలు:

గమకములు, తాళ పద్ధతి, 16 ప్రకృతి వికృతి స్వరాల విషయంలో, భిన్న రాగముల పేర్లు, మనోధర్మ సంగీతములో స్వరకల్పన, వాద్యముల విషయంలోనూ భిన్న మార్గములు ఉన్నవి.

క్రమ సంఖ్య కర్నాటక సంగీతం హిందుస్థానీ సంగీతం
1. ఆధార షడ్జమం – తంబూరా శ్రుతి ఐక్యత
2. స్వరములు 7 ఐక్యత
3. స్వర స్థానములు (12) ద్వాదశ ఐక్యత
4. 16 ప్రకృతి వికృతి స్వరాలు స్వర స్థానములు 12, 16 ప్రకృతి వికృతి స్వరాలు లేవు. వాటి ప్రయోజనం లేదు.
5. మేళకర్తలు 72 మేళకర్తలు 32
6. 40 వివాది మేళాలు అధికం అవసరం లేదు. లేవు.
7. (అ) శుద్ధ గాంధార

(ఆ) షట్మతి రిషభం

(ఇ) శుద్ధ నిషాధం

(ఈ) షట్మతి దైవతం

లేవు. అవసరం  పడలేదు.
8. గమకములు – కంపనముల ప్రాముఖ్యత గమకములు – జారు ప్రాముఖ్యత
9. రవ గమకము ఐక్యత
10. సంగీత రచనకు ప్రాముఖ్యత

సంగీత రచనలో మనోధర్మం ఉండదు

సంగీత రచన యందు కూడా మనోధర్మం ఎక్కువ. కీర్తన, కృతికి ప్రాముఖ్యత చాలా తక్కువ.
11. స్వరకల్పనకు ప్రాముఖ్యం అకారం ‘తాన్’లకు ప్రాముఖ్యత
12. అకారం ‘తాన్’లు ఉండవు స్వరకల్పన ఉండదు. ఈ మధ్య కాలంలో స్వరకల్పన మొదలైంది.
13. రాగ ఆలాపన ఐక్యత ఉంటుంది.
14. నెరవు ఉంది. పేరు బోల్ తాన్
15. తానం లేదు
16. పల్లవి లేదు. కానీ ‘ఖ్యాల్’ ఒక విధంగా పల్లవే.
17. సంగీత రచనలు – గీతం, స్వర పల్లవి, స్వరజతి, తాన వర్ణం, కృతి, కీర్తన, పదమ్, జావలి, తిల్లానా, తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు, భక్తి కీర్తనలు, అన్నమయ్య, భద్రాచల రామదాసు మొదలైనవి లక్షణ గీత్, బడే ఖ్యాల్, చోటా ఖ్యాల్, టుమ్రీ, ఝజల్, టప్పా, దృపద్ (ధ్రువపద్), తులసీదాసు, మీరా, కబీర్ దాసు, సూరదాసు, భజనలు, గీతా ధున్ మొదలైనవి.
18. గాత్ర వాద్య సంగీతం రచనలు ఒకటిగానే ఉంటాయి. విభేదములు లేవు. వాద్య సంగీత రచనలు ప్రత్యేకించి ఉంటాయి. జూడు ఝాలా, గత్, బిలాస్ ఖానీ, గత్, మసీద్ ఖానీ గత్, మొదలైనవి. వాద్యంలో ఖ్యాళ్, ఝజల్, టుమ్రీ వుండవు. ఇవి గాత్ర రచనలు.
19. ముఖ్యమైన వాద్యములు – వీణ, వయొలి, వేణువు, సన్నాయి, విచిత్ర వీణ (గోట్ వాద్యం), మృదంగం, ఘటం, మోర్సింగ్, డోలు, కంజీర మొదలైనవి. తబలా, సారంగి, సితార్, సరోద్, యస్రాజ్, బాల సరస్వతి, షహనాయి, భాంసురీ, డోలక్, దోల్కి మొదలైనవి ముఖ్యమైన వాయిద్యాలు.
20. రాగ పద్ధతిలో స్వరముల మధ్య గమకములు కంపిత గమకములు ఉంటాయి. రాగ పద్ధతిలో ఐక్యత స్వరములపై నిలబెట్టి ‘జారు’ గమకంతో ఉంటాయి.
21. కర్నాటక సంగీత రాగ గమకములు అన్నియు కర్నాటక సంప్రదాయానికి సంబంధించి ఉంటాయి. హిందుస్థానీ సంగీత రాగ గమకములన్నియును హిందుస్థాని సంప్రదాయానికి చెందినవి అయి ఉంటాయి.
22. నారద సంప్రదాయం అని అంటారు. హనుమత్ సంప్రదాయం అని అంటారు
23. ఆలోచనామృతం అనవచ్చు. ఆపాతమధురం అనవచ్చు
24. నేర్చుకోవడం కష్టమే. వినడం కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవడం కష్టం. వినడం సులభం.
25. పాండిత ప్రకర్షణ కల్గినది కనుక అన్ని వేళలా, కేవలం పామర రంజకం కాదు. పండిత పామర రంజకం.
26. దేవాలయ ప్రాంగణాలలో భక్తి ప్రధానంగా అభివృద్ధి అయింది. రాజ దర్బారులో సంగీత రసికుల మధ్య అభివృద్ధి చెందింది.
27. గాత్రజ్ఞుడు కృతిని, తాళాన్ని తనే వేసుకుంటూ గానం చేస్తాడు. మృదంగ విద్వాంసుడు కృతిని అనుసరిస్తాడు. గాత్రజ్ఞుడు ఖ్యాల్ గాని టుమ్రీ గాని మరి ఏ ఇతర రచనను గాని పాడుతున్నప్పుడు తాళాన్ని తన చేతితో వేయడు. తబలా విద్వాంసుడు తాళాన్ని వేస్తూ గాత్రజ్ఞుడికి చూపిస్తూ ఉంటాడు. తాళాన్ని పోషించటమే తబలా విద్వాంసుని బాధ్యత. ఎప్పుడైనా (సాథీ) అనుసరిస్తూ ఉంటాడు కూడా.
28. కర్నాటక సంగీతజ్ఞుడు కొంతలో కొంతగానైనా హిందుస్థానీ శైలిని పాడగలడు. హిందుస్థానీ సంగీతజ్ఞునికి కర్నాటక సంగీతాన్ని గానం చేయటం సులభం కాదు. కనీసం ప్రయత్నం చేయడు. ఈ మధ్యనే ప్రయత్నాలకి సాహసిస్తున్నారు.

రాగ విభజనలు:

క్రమ సంఖ్య కర్నాటక సంగీతం హిందుస్థానీ సంగీతం
1. అసంపూర్ణ మేళాలు, 72 మేళకర్తలు సంపూర్ణ షాడవ, జౌడవ భేదాలు రాగాంగ, ఉపాంగ, భాషాంగ, క్రియాంగ రాగాలు. శుద్ధ, ఖాయలగ, సంకీర్ణ రాగాలు, ముక్తాంగ, కంపిత, అర్ధ కంపిత, కంప విహీన రాగాలు.

నిషాదాంత్య, దైవతాంత్య, పంచమాత్య రాగాలు మొదలైనవి విభజనలు – రాగ పరిణామ దశల్లో ఉంటూ వచ్చాయి. ఇప్పటికి కొన్ని ఆచరణలో ఉన్నాయి.

రాగ విభజనలో స్త్రీ, పురుష, నపుంసక రాగాలు; పుత్ర, మిత్ర, పరివార రాగాలు; రాగముల రసములను బట్టి రాగములు, స్వర సంపుటిని బట్టి లోగడ జరిగింది.

అలాగే సూర్యాంశ, చంద్రాంశ రాగాలు (ఉదయ, మధ్యాహ్న, సాయంకాల, రాత్రి రాగాలు),  ఆయా కాలములకు ఆయా రాగములు విభజించబడ్డాయి. చాలా రాగాలకు దృశ్య కల్పనలు, చిత్రకారుల కల్పనా చాతుర్యంతో చేయబడ్డాయి.

2. గమక ప్రాధాన్యత స్వర కదలికలు, అనుస్వరాలు, ఆందోళిక స్ఫురితం, ప్రత్యాహతం, కంపితం, వరీక, రవ గమకాలు. ఒక పద్ధతి ప్రకారం కనకాంగి, ఇంకొక పద్ధతి ప్రకారం తోడి శుద్ధ స్వరాలు. దిగు జారు, ఎక్కు జారు రవ జారు సంగతులు ఉంటాయి. స్వరాల మీద నిలబెట్టే గమకాలు ఉంటాయి (శంకరాభరణం) బిలావల్, మేళం, శుద్ధ మేళం ముఖ్యమైన స్వరములు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here