[box type=’note’ fontsize=’16’] “నీ హృదయ వీణ పై నేనో మోహన రాగమై పలకనీ, నీ సుమధుర గళంలో నేనో సుందర శబ్దాన్ని అవనీ” అంటున్నారు లక్ష్మి పద్మజ దుగ్గరాజు “నీలో నేను” కవితలో. [/box]
[dropcap style=”circle”]నా[/dropcap] కనులతో పని ఏముంది?
నేనే నీ కనుపాప అయినప్పుడు
నా స్వరం తో పని ఏముంది?
నా పదమే నీ గళం అయినప్పుడు
నా హృదయం తో పని ఏముంది?
నీ శ్వాసే నాది అయినప్పుడు…
నీ హృదయ వీణ పై
నేనో మోహన రాగమై పలకనీ
నీ సుమధుర గళంలో
నేనో సుందర శబ్దాన్ని అవనీ
నీ మాటల మాధుర్యం లో
నేను మకరందం నింపనీ
నీ హృదయపు కోవెలలో
నేనో అఖండ జ్యోతి గా వెలగనీ
నీ మౌన రాగ పద సవ్వడి లో
నేనో శృతి లయనవనీ
నీపై ఏలనో ఈ మమకారం
నీపై ఈ అనురాగ ఝరి కి ఎప్పుడు… ఎలా
జరిగిందో శ్రీకారం??