[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఆమెది ఈర్ష్య.. అతడిది అసూయ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]మెకు ఈర్ష్య అతడంటే.
ఆమెను ప్రేమిస్తున్నాడని,
తనకే తెలియని తన అందాన్ని
అతను అనుభవిస్తున్నాడని,
అందుకే..
అతడికి ఆమె అంటే అసూయ
ప్రేమించబడే అర్హతలెన్ని ఉన్నా
ఒక్క అర్హతను హక్కుగా భావించని
అరుదైన అందం ఆమెకి సొంతమేనని