[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ మహర్షి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]చె[/dropcap]లీ..!
ఆకామంత నీ ప్రేమని
పొందాలని చుక్కనయ్యాను
భూదేవంత నీ అభిమానానికి
చేరువ కావాలని మొక్కనయ్యాను
వాయువంత నీ ఆదరణకి
నోచుకోవాలని వేణువయ్యాను
సముద్రమంత నీ నీడలో
సేద తీరాలని తీరాన్నయ్యాను
ప్రకృతంత నీ ఒడిలో
ఒదిగిపోవాలని
ఉషా కిరణాన్నయ్యాను
నిత్యం నీ ధ్యానంలో
తరించాలని
నీ ప్రేమ మహర్షినయ్యాను