[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘ఆంధ్ర మాత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]దరంలో క్షుది ఎద వరకు పాకింది
అపరాహ్నం వేళ అలజడి కలిగింది
అన్నం తిందామంటే వ్యంజనమేది
మనోరంజనము కలిగించే కూర ఏది
పాకశాల నుండి వచ్చే అనిలము
నా నోట సలిలమును ఊరించె
క్షుదాగ్ని భగ్గున ఎగదన్ని బాధించె
పరుగన పోయితి అమ్మ కడకు
కంచంలో అన్నమేసి నెయ్య పోసి
ఆంధ్ర మాత లేహ్యము మాత వడ్డించె
కలిపి ముద్ద తిని చూడగ దివి కనిపించె
గోంగూరను మించిన కూర కలదే