దేశ విభజన విషవృక్షం-55

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]‘అ[/dropcap]వసరార్థపు ఐకమత్యం శాశ్వతమని నమ్మొద్దు.. తీవ్రమైన సమస్యలను మాటలతో తేల్చేయవద్దు..’ అని మహమ్మద్ ఆలీ జిన్నా 1913 నుంచి పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. బెంగాల్ విభజన రద్దు అయినప్పటికీ, హిందూ ముస్లిం సమైక్యత, ఐకమత్యం శాశ్వతం కాదని ఆయన మొదట్నంచీ బలంగా వాదించారు. కానీ గాంధీ గారు మాత్రం కేవలం హిందూ ముస్లింల సమైక్యతతోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందన్న గట్టి నమ్మకంతో ఉండిపోయారు. ఇందుకోసం.. ముస్లింలను సంతృప్తి పరచడం కోసం ఎంత చేయాలో అంత చేశారు. జామియామిలియా ఇస్లామియా స్థాపనలో వ్యవస్థాపకుడిగా ఆయన భాగస్వామి కావడం కూడా ఇందులో భాగమే. 1919లో గాంధీ నిర్వహించిన మొదటి సత్యాగ్రహం రౌలత్ చట్టానికి వ్యతిరేకమని చెప్పినప్పటికీ.. అది ఖిలాఫత్ ఉద్యమానికి పూర్వరంగం అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ అది తాము అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఏర్పాటు చేసుకున్న బాంబే ఖిలాఫత్ సంఘం ద్వారా కార్యక్రమాలు మొదలుపెట్టారు. 1919 సెప్టెంబర్ 21న లక్నోలో అఖిలభారత ముస్లిం మహా సభ పెద్ద ఎత్తున జరిగింది. వెయ్యి మందికి పైగా ముస్లిం నేతలు ఈ సభకు హాజరయ్యారు. సెప్టెంబర్ 23 న ఢిల్లీలో మరో సమావేశం జరిగింది. దీన్ని తొలి ఖిలాఫత్ మీటింగ్‌గా చెప్తారు. ముస్లింలీగ్, జమాయతె ఉల్ ఉలేమా సంస్థలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశాల్లోనే సెంట్రల్ ఖిలాఫత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా 1919 అక్టోబర్ 17వ తేదీని ఖిలాఫత్ దినంగా ప్రకటించారు. ఇది ముస్లిం లీగ్‌కు చెందిన కార్యనిర్వాహక వర్గం కాదు. ఎందుకంటే.. ముస్లింలీగ్ పూర్తిగా బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసే వ్యవస్థ. దాని పనిని చెడగొట్టే ఉద్దేశం ఖిలాఫత్ ఉద్యమకారులకు లేదు. ముస్లింలీగ్‌కు సమాంతరంగా.. దాని లక్ష్యాల సాధనలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఖిలాఫత్ ఆందోళనను నిర్వహించాలన్న నయా వ్యూహంతో ముస్లిం నేతలు ముందుకు కదిలారు. వారి లక్ష్యాలకు అనుకూలమైన సంస్థగా బాంబే ఖిలాఫత్ సంఘం అయాచితంగానే కనిపించింది. ఈ సంఘాన్ని 1919 నవంబర్ 11 న భారతీయ ఖిలాఫత్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీగా ఈ సంఘం రూపాంతరం చెందింది. దీని పేరును ఉర్దూ జమియత్ ఇ ఖిలాఫత్ ఇ హింద్ అని పేరు పెట్టుకొన్నారు. ఈ కమిటీ 1919 నవంబర్‌లో అమృత్‌సర్‌లో, 1920లో బొంబాయిలో సమావేశమైంది. ఈ సమావేశాల్లో ముఖ్యమైన లక్ష్యాలను ఖరారు చేశారు.

  1. టర్కీలో శాంతి భద్రతల పరిరక్షణ
  2. ఖలీఫా అధికారాన్ని పునఃస్థాపించడం
  3. అరబ్ దేశాల్లోని ముస్లిం పవిత్ర స్థలాలను కాపాడటం

ఇదేదీ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన అంశమేమీ కాదు. భారతదేశానికి, బ్రిటిష్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ భారతీయ ముస్లిం నాయకులు మాత్రం ఖిలాఫత్ ఆందోళనను భారతదేశమంతటా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. 1919 నవంబర్ 23-24వ తేదీలలో ఢిల్లీలో ఖిలాఫత్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఫజల్ ఉల్ హక్ ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు. హకీం అజ్మల్ ఖాన్, సయ్యద్ హుసేన్, అబ్దుల్ బారీ వంటి ప్రముఖ ముస్లిం నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. మొదట ఈ సమావేశాలు జాతీయ స్థాయిగా దేశవ్యాప్త ప్రతినిధిత్వం కనిపించలేదు. హాజరైన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, సింధ్, ఢిల్లీకి చెందిన వారే ఉన్నారు. కానీ, రెండో రోజు ఈ సమావేశాలకు గాంధీజీ హాజరై మాట్లాడారు. ఆర్యసమాజ్‌కు చెందిన స్వామి శ్రద్ధానంద్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. ఈ సమావేశాల్లో బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలని, పీస్ సెలబ్రేషన్లను బహిష్కరించాలని తీర్మానాలు చేశారు. శాంతి ర్యాలీల బహిష్కారాన్ని గాంధీజీ అంగీకరించలేదు. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కూడా ఆయన అన్నారు. కానీ మిలిటెంట్ ముస్లింలు గాంధీ మాటను పట్టించుకోలేదు. ఆయనను, ఆయన విధానాలను తీవ్రంగా నిరసించడమే కాకుండా తిరస్కరించారు. మేము మీలాగా సత్యాగ్రహులము కాదని తేల్చి చెప్పారు.

‘‘Gandhi, who presided over the meeting on its second day, and Swami Shradanand, the Arya Samaj leader. l04 Resolutions were passed to boycott British goods and the peace celebrations. With respect to these resolutions Bamford points out “the commencement of Gandhi’s influence over the Khilafat leaders”, but a detail related by Khaliquzzaman indicates tension between Gandhi and militant Muslims: “A resolution for the boycott of peace celebrations was opposed by Gandhiji who said that boycott was not the proper remedy. Maulana Hasrat Mohani said that we were not Satyagrahis; he wanted to hurt the British by boycotting peace celebrations. The boycott of peace celebrations was accepted next day.” (THE KHILAFAT MOVEMENT IN INDIA P.84)

గాంధీజీ మాటను పట్టించుకోకుండా తాము అనుకున్న తీర్మానాలను సమావేశం మూడోరోజునాడు తీర్మానించారు. అయినప్పటికీ గాంధీజీ తన వైఖరిని మార్చుకోలేదు. గాంధీజీ అనుసరిస్తున్న తీరుపై అప్పటికే రామ్ మనోహర్ లోహియా కొంత అసంతృప్తిని వ్యక్తంచేశారు. “On the other hand, I am now somewhat suspicious of certain aspects of Gandhi’s philosophy or at least of some of his modes of action and organisation. These appear to have turned other men into heroes or extraordinary men of the flashy moment, 78 THE KHILAFAT MOVEMENT IN INDIA but to have brought out the worst in them in the normal routines of life … Was there an evil core of unbalance in Gandhiji’s modes of action?” (THE KHILAFAT MOVEMENT IN INDIA P.77-78)

గాంధీజీ ఒకే సమయంలో ఒక సాధువుగా, ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఉండాలని భావించారు.

“What I want to achieve – what I have been striving and pining to achieve these thirty years – is self-realization, to see God face to face, to at ta in Moksha. I live and move and have my being in pursuit of this goal. All that I do by way of speaking and writing, and all my ventures in the political field are directed to this same end.’’ (ibid., p. 59)

ఈ రెండు సంక్లిష్టమైన మార్గాల్లో సమాంతరంగా ప్రయాణించాలని భావించారు. ఆయన 1915లో భారత్‌కు తిరిగి వచ్చిన నాటి నుంచి కూడా పూర్తిస్థాయిలో స్వాతంత్ర్యోద్యమం చేపట్టడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఆయనకు మొదట ఎదురైంది ఖిలాఫత్ ఉద్యమమే. దీనిపట్ల ఆయన సానుభూతితో వ్యవహరించారు. 1919 డిసెంబర్‌లో అమృత్‌సర్‌లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ మహా సభలు జరిగాయి. కాంగ్రెస్ సభల ప్రధాన అజెండా ఏమిటంటే.. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టబోతున్న సంస్కరణలకు సహకరించాలా? వద్దా? అని. కాంగ్రెస్ లోని మోడరేట్లు ఈ సంస్కరణలను అసంపూర్తిగా, అసమగ్రంగా, అసంతృప్తిగా ఉన్నాయని వీటిని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. గాంధీజీ, మదన్ మోహన్ మాలవీయ మాత్రం సంస్కరణలతో రాజీ పడాలని, ప్రజలతో ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టి సంస్కరణలకు సహకరించాలని బలంగా అభిప్రాయపడ్డారు. ఇదే సమావేశాల్లో గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమం పట్ల సానుభూతిని వ్యక్తంచేశారు. మిగతా కాంగ్రెస్ నాయకులంతా ఈ విషయం పట్ల మాట్లాడకపోయినప్పటికీ.. గాంధీజీ మాత్రం తన సానుభూతిని స్పష్టంగానే ప్రకటించారు. అటు ముస్లిం లీగ్ సమావేశాల్లో టర్కీ ఖలీఫా అంశమే ప్రధాన అజెండాగా మారింది. షౌకత్ అలీ, మహమ్మద్ అలీ ప్రధాన ప్రసంగకర్తలుగా మారారు. షౌకత్ అలీ తన ఖుద్దమ్ కీ కాబా ప్రతిజ్ఞను మరోసారి చేశారు. అదే వారంలో అమృత్‌సర్ లోనే ఖిలాఫత్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లో కమిటీ అధ్యక్షుడిగా షౌకత్ అలీ ఎన్నికయ్యారు. తమ డిమాండ్లను నెరవేర్చడం కోసం ఒక బృందాన్ని వైస్రాయ్ దగ్గరకు, మరో బృందాన్ని ఇంగ్లండ్‌కు పంపించాలని తీర్మానించారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మోడరేట్లు, అతివాదులు దూరమవటం ప్రారంభించారు. గాంధీజీ మాత్రం తాను అనుకున్న మార్గంలోనే నడవసాగారు. అప్పటి యంగ్ టర్క్‌లుగా ఉన్న పటేల్, నెహ్రూ వంటి వారు కూడా గాంధీని అనుసరించారు.

గాంధీగారితో అవసరం కాబట్టి వారితో అలీ సోదరులు సఖ్యంగా ఉండటం ప్రారంభించారు. కానీ, హిందూ మద్దతు కోసం 1919 నవంబర్ 24 న జరిగిన సమావేశంలో గాంధీ గారినే అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా కాసేపటికే దాన్ని తొలగించారు. హిందువుల మద్దతు కోసం జలియన్ వాలాబాగ్ దారుణాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం, మార్షల్ చట్ట వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టారు కానీ గాంధీజీ వాటిని ఒప్పుకోలేదు. సహాయ నిరాకరణ అనేది కేవలం ఖిలాఫత్ కోసమే చేస్తున్నట్టు తీర్మానం చేయించారు. ఆ తరువాత అలీ సోదరులు ఖిలాఫత్ ఉద్యమాన్ని తమ పెద్దన్న గాంధీగారి సహకారంతో ముందుండి నడిపించారు.

1920 నాటికి ఖిలాఫత్ ఉద్యమం ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకొన్నది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కమిటీలు ఏర్పడ్డాయి. కేంద్ర కమిటీలోనే 250 మంది సభ్యులు నియమితులయ్యారు. దేశమంతటా ఏర్పడ్డ కమిటీల ద్వారా నిధుల సమీకరణ మొదలైంది. ఖిలాఫత్ ఉద్యమం కొనసాగినంతకాలం ముస్లింలీగ్ లూప్ లైన్‌లో పనిచేయసాగింది. ఖిలాఫత్ కమిటీయే ముస్లింల బలమైన సంస్థగా వ్యవహరిస్తూ వచ్చింది. 1920 ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో బాంబేలో ఖిలాఫత్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

“That this Conference accepts the ‘Constitution’ of the Central Khilafat Committee for the next year, as approved by the Subjects Committee, and recommends that the ‘Constitution’ be accepted by all Muhammadans.” Resolution no. 9 reads: “That this Conference re-affirms all the resolutions hitherto passed by all the previous Conferences, and urges upon the Central Khilafat Committee to give practical effect to them without any further delay.” (THE KHILAFAT MOVEMENT IN INDIA P.84-85)

ఈ రాజ్యాంగాన్ని మహమ్మదీయులు అందరూ ఆమోదించారని, ఇక ఖిలాఫత్ కమిటీ ఎలాంటి ఆలస్యం చేయకుండా యాక్షన్ లోకి దిగాలని కూడా తీర్మానం స్పష్టంగా చెప్తున్నది. ఆ వెంటనే ఖిలాఫత్ కార్యకర్తల కమిటీ అన్జుమన్ ఖుద్దమ్ ఇ ఖిలాఫత్.. కార్యాచరణలోకి దిగింది. ఆరు అంశాలతో ఖిలాఫత్ కమిటీ తమ ఆందోళనకు కార్యరూపం ఇచ్చింది. 1. స్వదేశీ, 2. అన్ని పదవులకు రాజీనామాలు చేయడం, 3. బ్రిటిష్ మిలటరీ, పోలీసుల్లో పనిచేసేవారు రాజీనామా చేయడం, పన్నుల చెల్లింపు నిలిపివేయడం, 4. గ్రామాల్లో ప్రచారం, 5. వీలైనంత ఎక్కువమందిని ఆందోళనల్లో భాగస్వామ్యం చేయడం, కమిటీలో సభ్యత్వం కల్పించడం, 6. ఆందోళన చేస్తున్న ముహాజిరిన్లకు సహాయం చేయడం.

ఈ విధంగా ఖిలాఫత్ ఉద్యమం రోజు రోజుకూ తీవ్రమవుతూ వచ్చింది. ఖిలాఫత్ సేవకులు ఒక్కొక్కరి దగ్గరి నుంచి నాలుగు అణాల చందాలు వసూలు చేస్తూ ఉద్యమానికి మరింత బలాన్నిస్తూ పోయారు. 1920 వేసవి కాలం వచ్చేసరికి ఆందోళన విస్తరించడం మొదలైంది. యూపీ, బీహార్, బెంగాల్, మద్రాస్ లలో భారీ సమావేశాలు జరిగాయి. ముస్లింలు అందరూ కూడా వీధుల్లోకి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖిలాఫత్ డిమాండ్లను పూర్తిగా ఆమోదించింది. ఆందోళనకు పూర్తిగా మద్దతునిచ్చింది. విచిత్రమేమిటంటే.. జలియన్ వాలాబాగ్ మారణకాండతోపాటు.. ఖిలాఫత్‌ను ముడిపెట్టి ఉద్యమానికి మద్దతునివ్వడం కాంగ్రెస్ వైచిత్రి. అప్పుడు కానీ ముసల్మానులు నేషనల్ అసెంబ్లీలో భాగస్వాములు కాలేదు.

This motivation is apparent in a letter Muhammad Ali wrote in May 1921, in which he gives a recapitulation of events since the summer of 1920. “The Khilafat question”, he writes, “which began With the Musulmans (only ~ of the Indian population) gradually became, along with the Punjab atrocities question, a national question, and the greatest National Assembly in India (which had become truly National only now that the Musulmans too had come to join it nearly 35 years after its foundation) adopted the first steps of non-violent non-co-operation.” Some pages further on he alludes to the so-called “Bezwada programme”, accepted in a session of the A.I.C.C. on April 1, 1921, where it was resolved to enlist before June 30 one crore (= 10,000,000) of Congress members,119 and then continues his letter by describing his own efforts (and those of Gandhi and his brother Shaukat) in winning over these recruits. But one week after the Bezwada meeting, on April 7 and 10, an All-India Khilafat Conference met at Meerut which passed resolutions “binding Mussalmans to adhere to Non-co-operation and requesting them to join the Congress”, and “urging the enlistment of one crore of Muhammadans and five crores of Hindus as members of the Khilafat and Congress organisations.” (THE KHILAFAT MOVEMENT IN INDIA P.86)

కేవలం గాంధీ కారణంగానే ఖిలాఫత్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని అటు స్వరాజ్యవాదులు, బ్రిటిష్ పాలకులు కూడా భావించారు. ప్రజలను పెద్ద ఎత్తున సభ్యులుగా చేసుకోవడం కోసం అలీ సోదరులతో పాటు, గాంధీ కూడా పెద్ద ఎత్తున బహిరంగ సమావేశాలు నిర్వహించారు. ఇది కాంగ్రెస్‌తో పాటు, ఖిలాఫత్ కమిటీకి భారీ లాభాన్ని చేకూర్చింది. కేవలం గాంధీ హిందూ, ముస్లిం సమైక్యత అన్న నినాదంతోనే ఒక వైపు స్వరాజ్య ఉద్యమం బలపడకుండా, ముస్లిం ‘ప్రత్యేక’తను మరింత బలపడింది. గాంధీజీ మద్దతు లేకపోయి ఉంటే ఖిలాఫత్ ఉద్యమం తీవ్రతను సంతరించుకొని ఉండేది కాదు. ఎందుకంటే ఖిలాఫత్ ఉద్యమకారులకు మొదట్నుంచీ హిందూ ముస్లిం ఐక్యత అన్న ఆలోచనపై నమ్మకం లేదు. ఈ రకమైన తీరు ఉద్యమాన్ని నీరుగారుస్తుందన్న అనుమానమూ ఉన్నది. కాంగ్రెస్‌వాదుల్లో కూడా గాంధీ మార్గం పట్ల అసంతృప్తి తీవ్రంగానే ఉండింది. స్వరాజ్య ఉద్యమాన్ని పూర్తిగా పక్కకు పెట్టి మన దేశంతో సంబంధం లేని, మనకు అవసరంలేని ఖిలాఫత్ వైపు మళ్లడం పట్ల ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. చివరకు ఆయన అనుంగు అనుచరుడైన నెహ్రూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘Jawaharlal Nehru, who in the early twenties was completely under Gandhi’s spell, recorded later on “his distress at the religious overtones'” and the strange admixture of politics and religion.”

పరస్పర వైరుధ్యాలైన భావనలను కలపడం కృత్రిమత్వం అని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌లో ఖిలాఫత్ వ్యతిరేక స్వరాలను గాంధీజీ విజయవంతంగా అడ్డుకున్నారు. పార్టీలో గాంధీజీకి బలమైన మద్దతు సమకూరిన తరువాత సహాయ నిరాకరణ ఉద్యమ రూపంలో ఖిలాఫత్ ఉద్యమం ఊపందుకొన్నది. అభ్యర్థనలు, ఆందోళనల పరిధులు దాటి.. బెదిరింపులు మారణకాండ స్థాయికి విస్తరించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here